– శాసనమండలి సభ్యులు భూంరెడ్డి రాంగోపాల్ రెడ్డి
అత్యవసర సమయాల్లో ప్రజల ప్రాణాలు రక్షించే 108 కాల్ సెంటర్ సిబ్బందిపై మంత్రి విడదల రజనీ ఓఎస్డీ మధుసూదన రెడ్డి దాడి చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిన్న అన్నమయ్య జిల్లాలో 108 కాల్ సెంటర్ లో పని చేస్తున్న ఉద్యోగిపై జరిగిన దాడికి నిరసనగా దాదాపు 15 నిమిషాల పాటు సేవలు నిలిపివేశారు.
ఈ సమయంలో ఎవరికైనా ప్రమాదం జరిగి వాళ్లు కాల్ సెంటర్ కి కాల్ చేసి ఉంటే పరిస్థితి ఏంటి? అనవసరపు భావోద్వేగాలతో ప్రజల ప్రాణాలతో ఆటలాడవద్దు. విధి నిర్వహణలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తే పై స్థాయి వారికి ఫిర్యాదు చేయాలి గాని ఇలా దురుసుగా ప్రవర్తించడం సిగ్గుచేటు.
108, 104లో కాల్ సెంటర్లలో అన్ క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారని ఎన్ని సార్లు ఫిర్యాదులు వచ్చినా ఇంత వరకు పట్టించుకోలేదు. తన శాఖలో ఇంత జరుగుతున్నా మంత్రి విడదల రజనీ మాత్రం దీనిపై నోరెత్తకపోవడం హేయం. మధుసూదన్ రెడ్డిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు?