దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి
– టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు
ప్రజాస్వామ్య మూలాలను జగన్మోహన్ రెడ్డి ధ్వంసం చేస్తున్నాడు. అణిచివేతే రాజ్య విధానంగా పాలన సాగిస్తున్నాడు. ప్రజా నాయకుడు చంద్రబాబు అరెస్ట్ ను ఖండిస్తూ ఆయన సతీమణి భువనేశ్వరికి సంఘీభావం తెలిపేందుకు పాదయాత్రగా వస్తున్న టీడీపీ కార్యకర్త నారాయణ మీద వైసీపీ రౌడీలు దాడి చేయడం దుర్మార్గం. నంద్యాల నుంచి పాదయాత్రగా వస్తున్న నారాయణపై పల్నాడు జిల్లా వినుకొండ మండలం విఠంరాజుపల్లి వద్ద ఇద్దరు వైసీపీ రౌడీమూక విచక్షణారహితంగా దాడిచేశారు. తీవ్ర గాయాలనై నారాయణ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతనికి జరగరానిది జరిగితే ఎవరిది బాధ్యత?
అసలు నారాయణ చేసిన తప్పేంటి? జగన్ రెడ్డిలా విధ్వంసాలకు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడా? గతంలో చంద్రబాబు నిర్ధోషిగా బయటకు రావాలని భగవంతుని ప్రార్థించేందుకు ఆలయాలకు వెళ్తున్న టీడీపీ నేతలను కూడా ఇలాగే అడ్డుకున్నారు. పలువురు నేతలను హౌజ్ అరెస్ట్ లు చేశారు. జగన్ రెడ్డి చర్యలు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఉన్నాయి. టీడీపీ కార్యకర్తపై దాడి చేసిన వైసీపీ రౌడీ మూకపై పోలీసులు తక్షణమే చర్యలు తీసుకోవాలి. కేసు నమోదు చేయాలి.