– మోటార్లకు మీటర్లను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోము
-రైతులపై అదనపు వడ్డీ భారం
– మీడియాతో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రివర్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
సోమిరెడ్డి ఏమన్నారంటే.. అప్పులు, కంపెనీలు ఇచ్చే కమీషన్ల కోసమే మోటార్లకు మీటర్లు బిగించి రైతుల గొంతు కోసే కుట్ర.చేతనైతే విద్యుత్ నష్టాలు తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోండి.మోటార్లకు మీటర్లను ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోము.వ్యవసాయ మోటార్లకు మీటర్లకు పెట్టాల్సిందేనని సీఎం జగన్ రెడ్డి పంతం పట్టడం దురదృష్టకరం.శ్రీకాకుళం జిల్లాలో మీటర్లు పెట్టడం ద్వారా 33.75 మిలియన్ యూనిట్ల విద్యుత్ పొదుపు చేశామని చెప్పడం విడ్డూరంగా ఉంది..ఆ టెక్నాలజీ ఏంటో అర్థం కావడం లేదు.
మోటార్లకు మీటర్లకు పెట్టబోమని ప్రకటించిన పొరుగు రాష్ట్రాల సీఎంలను జగన్ రెడ్డి చేతకానివాళ్లని చెబుతున్నారా?మీటర్లకు పెట్టాలని షరతు విషయంలో కేంద్ర ప్రభుత్వమే వెనకడుగు వేసిన విషయాన్ని
పరిగణనలోకి తీసుకోరా?కేవలం కేంద్రం దగ్గర అప్పులు, మీటర్ల కంపెనీలు ఇచ్చే కమీషన్ల కోసం రైతుల గొంతుకోసే కుట్ర చేయడం దుర్మార్గం.విద్యుత్ నష్టాలు తగ్గాలంటే అవసరాల మేర సబ్ స్టేషన్లు నిర్మించండి…ట్రాన్స్ ఫార్మర్ల కెపాసిటీని పెంచండి…విద్యుత్ తీగలను పటిష్టం చేయండి.
కమీషన్లకు కక్కుర్తిపడి బొగ్గు కొనుగోలులోనే వేల కోట్ల రూపాయల ప్రజాధనం వృథా చేస్తున్నారు.కృష్ణపట్నం పవర్ ప్రాజెక్టులో మట్టితో కూడిన బొగ్గును తెచ్చి రూ.700 కోట్లు నష్టం తెచ్చినా కనీసం ఏడుగురిపై చర్యలు తీసుకున్న పాపాన పోలేదు.విద్యుత్ పొదుపునకు చేయాల్సినవి చేయండి…అంతే కానీ మీటర్లు పెడతాం, బిల్లు ఇస్తాం..డబ్బు కట్టండి…అది తిరిగి చెల్లిస్తామని చెప్పడం నమ్మశక్యంగా లేదు.రైతులకు సున్నా వడ్డీ రుణాల రెన్యూవల్ విషయంలోనూ మోసం చేశారు..గతంలో అమలులో ఉన్న వ్యవస్థకు విరుద్ధంగా నూతన విధానం తేవడంతో అనేక మంది రైతులు డిఫాల్టర్లుగా మారుతున్నారు..రైతులపై అదనపు వడ్డీ భారం కూడా పడుతోంది.
ఆక్వా రైతులను కూడా జోన్, నాన్ జోన్ పేరుతో నట్టేట ముంచారు.యూనిట్ కి రూ.1.50 వసూలు చేస్తామని చెప్పి ఈ రోజు రకరకాల కొర్రీలు పెట్టి ఆక్వా రైతుల వద్ద రూ.4.85 గుంజుతున్నారురేపు రైతుల మోటార్లకు మీటర్లు బిగించినా జరగబోయేది ఇలాంటి మోసమే.ఈ దుర్మార్గాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోము…మోటార్లకు మీటర్లను అంగీకరించం.దయచేసి సీఎం ఇప్పటికైనా పునరాలోచన చేసి మోటార్లకు మీటర్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నాం.