ఏపీలో సర్కారు సొంత చానెల్‌

Spread the love

-రాష్ట్రంలో కేబుల్‌ ఆపరేటర్లకు పోల్‌టాక్స్‌ రద్దు
-ఆపరేటర్లు, ఎఎంఎస్‌ఓలు ప్రభుత్వ విధానాలు చూపించాల్సిందే
-కొత్తబాక్సులు కొనుగోలు చేస్తాం
-ఎపిఎస్ఎఫ్ఎస్ చైర్మన్‌ గౌతంరెడ్డి

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సొంత టీవీ చానెల్‌ తీసుకురాబోంది. దానితో పాటు రాష్ట్రంలో కేబుల్‌ ఆపరేటర్లకు వెసులుబాటు కలిగించేందుకు ఇప్పటివరకూ కొనసాగిస్తున్న పోల్‌టాక్స్‌ను ప్రభుత్వం రద్దుచేయనుంది. ఈ విషయాన్ని ఏపీఎస్‌ఎస్‌ఎల్‌ చైర్మన్‌ పి.గౌతంరె డ్డి మీడియాకు వెల్లడించారు.

గౌతంరెడ్డి ఏమన్నారంటే.. ఎపిఎస్ఎఫ్ఎస్ కి కొత్తగా ఒక బోర్డును ఏర్పాటు చేశారు.సీనియర్ అధికారులు ఇందులో సభ్యులుగా ఉంటారు. దేశంలో మొదటగా ఏపీలోనే టీవీ కనెక్షన్ తో కూడిన నెట్ ఇస్తున్నాం. త్వరలోనే ఏపిఎస్ఎఫ్ఎల్ నుంచి టీవీ ఛానల్ తీసుకు రాబోతున్నాం. దీని ద్వారా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం.గత ప్రభుత్వం చేసిన అక్రమాల వలన అనేక సమస్యలు వచ్చాయి.

సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాల వలన ఏపిఎస్ఎఫ్ఎల్ లాభాల బాట పట్టింది.గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై విచారణ చేస్తున్నాం.వారు చేసిన రూ.600 కోట్ల అప్పులకు మేము వడ్డీలు చెల్లిస్తున్నాం.గత ప్రభుత్వం పోల్ టాక్స్ వేసి కేబుల్ ఆపరేటర్ల నడ్డి విరిచింది.దీనిపై ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లాం. సీఎం జగన్ సానుకూలంగా స్పందించి పోల్ టాక్స్ ని రద్దు చేయమని చెప్పారు.కొన్ని వేలమంది ఆపరేటర్లకు ఇది మంచి వరం.30 వేల కొత్త బాక్సులు త్వరలోనే రాబోతున్నాయి.పోల్ టాక్స్ రద్దు వలన కొంత నష్టం జరుగుతున్నప్పటికీ, ఆపరేటర్ల సంక్షేమం కోసం నిర్ణయం తీసుకుంటున్నాం. బాక్సుల రిపేర్ కోసం సర్వీసు సెంటర్లు ఏర్పాటు చేశాం.ప్రభుత్వానికి,ప్రజలకు మధ్య వారధిగా ఉండాలని ఛానల్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నాం.

గత పాలకుల తప్పుడు విధానాల వలన ఎపిఎస్ఎఫ్ఎస్ అభివృద్ధి చెందలేదు. గత పాలకులు నాసిరకం పరికరాలు వాడడం వలనే కేసుల్లో ఇరుక్కున్నారు.ఆదాయ వనరులు పెంచుకోవడం తో పాటు ఖర్చు తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నాం.కేబుల్ ఆపరేటర్ లు పోల్ టాక్స్ తో ఇబ్బంది పడుతున్నారు. ఈ ప్రభుత్వం పోల్ టాక్స్ ధరను పెంచడం జరిగింది.మంత్రుల కమిటీ దృష్టికి పోల్ టాక్స్ సమస్యను వివరించడంత వెనక్కి తీసుకోవడం జరిగింది. జీఓ ను రద్దు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆపరేటర్స్ భయాందోళన చెందవద్దు. కేబుల్ mso లు, ఆపరేటర్స్ ప్రభుత్వ విధానాలు ప్రజలకు చూపించాలి. ప్రభుత్వాన్ని విమర్శించే పద్ధతిని విడనాడాలి. 50 లక్షల బాక్స్ లు అవసరం ఉంది.

Leave a Reply