Suryaa.co.in

Editorial

నా ‘సామి’ రంగా!

* ‘చికోటి ’చిక్కుల్లో స్వాములోరు
* ‘చికోటి కారులో జీయర్‌ స్వామి’ వీడియోలు హల్‌చల్‌
* చికోటి ప్రావీణ్యానికి జీయరు ఇమేజికి డామేజీ
* జీయరును వదలని అశ్వినీదత్‌
* మతమార్పిళ్లపై మాట్లాడరేమంటూ అశ్వినీదత్‌ ఆగ్రహం
( మార్తి సుబ్రహ్మణ్మం)

కాలం కలసి రాకపోతే తాడేపామై కరుస్తుంది. ఈ సామెత ఇప్పటివరకూ పామరులకే పరిమితం. కానీ హైదరాబాద్‌ క్యాసినో నిర్మాత చికోటి పుణ్యాన ఇప్పుడా సామెత పండితులకూ.. అంతకుమించి సాములోర్లకూ విస్తరించింది. అప్పుడెప్పుడో క్యాసినో విధాత చికోటి కారులో కూర్చుని చిద్విలాసం చిందించిన సాములోరిని, ఇప్పుడు సోషల్‌మీడియా నా ‘సామి’రంగా అని ఆడేసుకుంటోంది. సదరు సాములోరు ఎప్పుడూ ప్రవచించే విధిరాత, గ్రహస్థితి అంటేనే బహుశా ఇదేనేమో? ఇంతకూ ఎవరా సామి? ఎవరా చికోటి? ఏమా కథ? చూసేద్దాం రండి.

kcr-jeeyarత్రిదండి చినజీయర్‌ స్వామి తెలుసు కదా? అదేనండీ.. తెలంగాణ సీఎం కేసీఆర్‌ మాజీ రాజగురువు. ప్రధాని మోదీని ముచ్చింత్‌కు పిలిపించక ముందు వరకూ, స్వాములోరు కేసీఆర్‌కు రాజగురువే కదా మరి?! ఆ తర్వాతనే కదా మాజీ అయింది! ఇప్పుడాయన చికోటి చిక్కుల్లో పడ్డారు.

chikotiఇంతకూ ‘చికోటి’ ఎవరంటారా? అదేనండీ.. క్యాసినోను సజీవంగా ఉంచే ప్రయత్నాల్లో భాగంగా, దాని ‘ప్రమోషన్‌’ కోసం ముమైత్‌ఖాన్‌, అమీషాపటేల్‌, డింపుల్‌ హయాతీ, ఈషా రెబ్బ, గోవిందా లాంటి స్టార్‌ యాక్టర్లకు లక్షల రూపాయలు కుమ్మరించిన ‘క్యాసినో క్రీడాకారుడు’. సరే ఇంకా ఏపీ-తెలంగాణకు చెందిన మంత్రులు, మాజీ మంత్రులు, 16 మంది ఎమ్మెల్యేలు, గన్నవరం, గుడివాడ బాబులకు దోస్తయిన చికోటి ప్రవీణ్‌కు.. ఎక్కడో శంషాబాద్‌ ఆశ్రమంలో ముక్కుమూసుకుని తపస్సు చేసుకునే సాధువు జీయరు స్వామికీ లింకేమిటన్నదే కదా అందరి సందేహం?!

చాలా ఉందని.. అందుకు సాములోరిని చికోటి ఎక్కించుకున్న కారే సాక్ష్యమన్నది సోషల్‌మీడియా వాదన. ఇప్పుడు ఆ వీడియోలే సోషల్‌మీడియాలో కోడైకూస్తున్నాయి. అప్పుడెప్పుడో మన ‘ప్రవీణుడు’

జీయరుస్వామిని, తన కారులో కూర్చోపెట్టుకుని అలా ఓ రౌండేశారు. ఆ వీడియోను పబ్లిసిటీ కోసం బహుశా మన ప్రవీణ్‌ సారే, సోషల్‌మీడియాలో పెట్టి ఉంచవచ్చు. ఇప్పుడా వీడియోనే సాములోరిని ‘చికోటి చిక్కుల్లో’ పడేసింది.

Ulnr-Istva1-Qgx-L-yఒక భక్తుడి కారులో సాములోరు ఎక్కడం నేరమా? అనే కదా అందరి ప్రశ్న. అవును. నిజమే. అది ఏమాత్రం నేరం కాదు. కానీ నిష్ఠాగరిష్ఠుడు, ఎవరితో ఎలా ఉండాలని తెలిసి, వేదాలను అవపోసనపట్టిన త్రికాల జ్ఞాని, వీటికి మించి… బాగా క్రేజ్‌ ఉన్న ఇదే జీయరు స్వామి వారు.. అందరి కార్లలో కూడా ఇలాగే సేదతీరుతారా అన్నది నెటిజన్ల ప్రశ్న. మరి అది కూడా రైటే కదా? అసలు సామాన్యులకు స్వామి వారి అపాయింట్‌మెంట్‌ దొరకడమే కష్టం. మామూలు భక్తులు అల్లంత దూరం నుంచి స్వామివారిని మొక్కవలసిందే.

chikoti-jeeyarఅలాంటి ప్రవీణ్‌కు, స్వామి వారిని పక్కనకూర్చోబెట్టుకుని డ్రైవింగ్‌ చేసే అదృష్టం ఎలా పట్టింది? అంటే ఆయనతో చికోటికి పూర్వాశ్రమంలో పరిచయం ఉన్నట్టే కదా మరి? అన్నది బుద్ధిజీవుల ‘లా’జిక్కు. అప్పుడెప్పుడో చికోటి కారులో సాములోరు ఎక్కడమేంటి? ఇన్నాళ్ల తర్వాత మళ్లీ ఆ వీడియో.. అది కూడా క్యాసినో ఈడీ రైడింగు కథ సమయంలో బయటపడటమేమిటి? స్వామి వారు తన ఉపన్యాసాల్లో తరచూ చెప్పే విధిరాత అంటే, ఇదే కామోసన్నది ఆయన భక్తుల ఉవాచ.

జీయరు స్వామి జాతకంలో బహుశా ఏవో కొత్త గ్రహాలు ప్రవేశించినట్లున్నాయన్నది జ్యోతిష పండితుల సందేహం. లేకపోతే… పరమ ఆస్తికుడయిన సినీ నిర్మాత అశ్వనీదత్‌ కూడా, ‘ముచ్చింతల్‌ సాములోరి’మీద ఒంటికాలిపై లేస్తారా చెప్పండి? ‘కొండమీద అన్యమత ప్రచారం జరుగుతుంటే జీయరు స్వామి ఎందుకు మాట్లాడటం లేదు? తిరుమలలో జరగని పాపం లేదు. మూడేళ్లలో ప్రభుత్వం తిరుమలనుScreenshot-2022-07-29-110305 నాశనం చేసింది. ఇన్ని పాపాలు జరుగుతున్నా స్వామి ఎందుకు చూస్తున్నాడో అర్ధం కావడం లేదు. గతంలో ఆగమశాస్త్ర ప్రకారం చంద్రబాబు వెయ్యికాళ్ల మండపాన్ని కూలిస్తే, ఈ జీయర్‌స్వామి అంతెత్తున లేచి బాబును విమర్శించారు. మరి ఇప్పుడు ఏపీలో బలవంతపు మతమార్పిళ్లు జరుగుతున్నా జీయర్‌ మాట్లాడటం లేదు. పైగా జగన్‌ను దైవాంశ సంభూతుడని పొగుతుంటే కుడుపు మండిపోయింది. సమ్మక్క-సారక్కలను దేవతలను కాదనడంతో నా ఒళ్లుమండింద’ని అశ్వనీదత్‌.. లేటెస్టుగా జీయరు వారిపై కారాలు, మిరియాలు నూరడం చర్చనీయాంశమయింది.

శివుడాజ్ఞలేనిదే చీమయినా కుట్టదు. అలాగే విధిరాత, గ్రహస్థితి బాగోలేకపోతే పామరులయినా, పండితులయినా.. సామాన్యుడయినా, స్వామీజీలకయినా చిక్కులు తప్పవు. కాకపోతే జీయరు వారికి మాత్రం ‘చికోటి చిక్కులు’. అన్యులకు మరో రకం చిక్కులు. అంతే తేడా. మిగిలినదంతా సేమ్‌ టు సేమ్‌!

LEAVE A RESPONSE