Suryaa.co.in

Features

మేధావుల్లారా, మీరు మాకు వద్దు

మీ వక్రపుటాలోచనల విషాన్ని మాపై ఒంపకండి; మీ దుష్టత్వంతో‌ మమ్మల్ని దెబ్బకొట్టకండి.

మేధావుల్లారా, మీరు మాకు వద్దు.

లేనిదాన్ని చదవి “ఉన్నది‌ ఇది” అని మాకెందుకు చెబుతున్నారు?‌ ఉన్నది ఉన్నట్టుగా మీకెందుకు కనిపించడం లేదు?

“మిమ్మల్ని చెడగొట్టాం” అని చెడగొట్టిన వాళ్లే గట్టిగా చెప్పినా వినరు మీరు. పైగా మమ్మల్ని చెడగొట్టడానికి ఉద్యమాలు చేస్తున్నారు మీరు.

“ఔరంగజేబ్ మంచి వాడు” అని మీరంటారు.
“మకాలి ఉమ్మిని విద్య అని మీరు చప్పరిస్తూంటారు.
విదేశీ నీచులు మన ఆలయాల్ని కూల్చి ఈ గడ్డ సంపదల్ని కొల్లగొడితే “అలాంటిదేం జరగలేదు” అని మీరు అరుస్తున్నారు. ఇక్కడి స్త్రీల మాన ప్రాణాల్ని హరించిన వాళ్లను మీరు ఆరాధిస్తారు. ఇక్కడ నరమేధం‌ సృష్టించిన‌ వాళ్లను మీరు ప్రేమిస్తారు.‌ చొరబడ్డ దొంగల్ని‌ “దొరలు” అని అంటారు మీరు.

మీ అబద్ధం‌ మీది. అది మాకు వద్దు.

వినాశకర విదేశీ వర్ణాలను మీరు బాగా పులుముకున్నారు. ఈ మట్టికో రంగుంది. అది మీకక్కఱ్లేదు. మీకు విదేశీ మతోన్మాదపు రంగు కావాలి. ఇక్కడి విశ్వవిద్యాలయాలను కాల్చేసిన త్రాష్టుల్ని మీరు తలకెక్కించుకుంటారు.
“అసలిది దేశమే కాదు” అంటారు మీరు.
“ఇక్కడేమీ లేదు” అంటారు మీరు. మీ తాత,‌ తండ్రుల గుఱించి ఎవడో చెబితేకానీ నమ్మరు మీరు‌.

మీ భ్రష్టత్వం మీది.‌‌ అది మాకు వద్దు.

చదవడం చాతగాక మీరేం చదివారో మీకే తెలియకుండా తెగ చదివేశారు. మీ మాటల్ని విని ప్రపంచం ఎంత నవ్వుతున్నా‌ మీ వంకర మీదే.
మీ వికారాన్ని మాపై విసరకండయ్యా.

మాకు మీ వికృతత్వం వద్దు.

మేం‌‌ పామరులం,‌
మేం‌ సామాన్యులం,
మేం ప్రజలం;
అయ్యా మేధావుల్లారా,
మామీద పడకండి
మేమో, ఈ‌ దేశమో
మీకు ఏ హానీ చెయ్యలేదు కదయ్యా?
మీరెందుకు మాకు హాని చేస్తున్నారు? ఈ మట్టికి ఎందుకు‌ కీడు చేస్తున్నారు?
మీ మేధను మాపై ఎందుకు వాంతిచేస్తున్నారు?

మీ దుర్గంధాన్ని భరించలేకపోతున్నామయ్యా;
మమ్మల్ని వదిలెయ్యండయ్యా;
అయ్యా మేధావుల్లారా,
మాకు మీ రొష్టు వద్దయ్యా; మీవల్ల
మా ఆరోగ్యాలు చెడిపోతున్నాయయ్యా; మా మానాన మమ్మల్ని బతకనియ్యండయ్యా;
మేం ప్రశాంతంగా బతకాలయ్యా.

వినాశనాన్ని “విశేషం” అని మీరంటారు.
నష్టాన్ని “లాభం” అని‌ మీరంటారు.
పామరులం,‌ సామాన్యులం,‌ ప్రజలం
మేం‌ మీ మాటలను వినలేం. మేం చెడిపోయి మనలేం.

ప్రపంచానికి పనికిరాని‌ సిద్ధాంతాల్ని
మీరు ముసుగులుగా వేసుకున్నారు. మీ ముసుగులతో మాకు పనిలేదు.
మీ ముసుగులతో మాపై బుసకొట్టకండి.

మీ తుచ్ఛత్వం మీది.
మేం మీలా కాలేం. మేం మామూలుగా బతకుతున్నాం.

మీకు సిగ్గులేదా?‌ మీ బుద్ధి ఎందుకు గడ్డి తింటోంది?‌ మీరు ఎందుకు సరిగ్గా‌ లేరు? అని‌‌ అడిగితే మీరు విదేశీ ధనంతో మా బతుకులపై నిప్పులుపోస్తారని మాకు తెలుసు. మీరు విదేశీ మతంవల్ల బలవంతులు. మేం బలహీనులం. మాకు ఏ ఇజాల డబ్బూ రాదు. మేం పామరులం. మేం సామాన్యులం.‌ మేం ప్రజలం.

మాకు ఈ మట్టి అంటే ఇష్టం.
మాకు మేమంటే ఇష్టం.
మాకు మా‌ భవిష్యత్తు‌ అంటే ఇష్టం.
కాబట్టి‌ మేధావుల్లారా మమ్మల్ని వదిలెయ్యండి.

అయ్యా మేధావుల్లారా, మేం ఈ‌ మట్టి బిడ్డలం; మేం ఈ మట్టి పాట పాడుకుంటాం.
మమ్మల్ని వదిలెయ్యరూ…?

మీరు చేసే రచ్చలవల్ల మా పాట సాగడం లేదు. మా‌ బాటకు మీరు అడ్డం. మాకు మీరు అపాయం.

మీరు రెచ్చిపోతూండడం వల్ల మా క్షేమం చచ్చిపోతోంది.
మా ఉనికికి మీరు ఉరి‌ వేస్తున్నారు.
మీ మేధకు మా భావాలు, భాగ్యాలు ఆహుతవుతున్నాయి. మేధావుల్లారా మమ్మల్ని చంపకండి.

మేధావుల్లారా, మీరు మాకు వద్దు.

తొందఱగా ఎక్కడికైనా వెళ్లిపొండి మేధావుల్లారా,
మా బతుకులు మేం బతుకుతాం.
మేం‌ ప్రశాంతంగా ఉంటాం.
ఈ గొప్ప మట్టిని
మా సంతతికి‌ మేం కానుకగా ఇచ్చుకుంటాం.

– రోచిష్మాన్‌
9444012279

LEAVE A RESPONSE