Suryaa.co.in

Telangana

జాబ్ క్యాలెండర్ గురించి ముందే ప్రకటించాం

  • అమలు చేస్తున్నాం
  • గత ప్రభుత్వంలో ప్రశ్నాపత్రాల లీక్, పరీక్షలు వాయిదా
  • పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన
  • జాబ్ క్యాలెండర్ పై శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

హైదరాబాద్: నిరుద్యోగ యువతీ యువకుల ఆశలు నెరవేర్చేందుకు.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని ముందే చెప్పాం.. ఆ విధంగానే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తున్నాం. గత ప్రభుత్వంలో ఉద్యోగ నియామకాల ప్రకటనలు, రద్దు కావడం, వాయిదా వేయడం, ప్రశ్నాపత్రాల లీక్, పరీక్షల తేదీలు ఓవర్ లాప్ తో ఇబ్బందులు పడ్డారు.

గత ప్రభుత్వ పాలనలో గ్రూప్ వన్ పరీక్ష రెండుసార్లు రద్దు అయింది. 20 23 మార్చ్ 17న పేపర్ లీక్, 20 24 ఫిబ్రవరి 19న అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడంతో హైకోర్టు తీర్పు మూలంగా రద్దు అయ్యింది. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి యూపీఎస్సీ కమిషన్ చైర్మన్ ను సంప్రదించారు.

యూపీఎస్సీ, కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసి అధ్యయనం చేయించారు. గ్రూప్ వన్ నోటిఫికేషన్ లో అదనంగా 60 పోస్టులు జోడించి 563 ఖాళీల కోసం కొత్తగా నోటిఫికేషన్ జారీ చేశాం. ఫలితాలు ప్రకటించాం. ఈ ఏడాది అక్టోబర్ 21 నుంచి 27 వరకు మెయిన్ పరీక్షలకు షెడ్యూల్ విడుదల చేసాం. అధికారంలోకి రాగానే 32,410 మంది నిరుద్యోగ యువతకు నియామక ఉత్తర్వులు జారీ చేశాం.

అదనంగా 13,5 05 ఉద్యోగాల నియామకం చివరి దశకు చేరుకుంది. 11,022 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేశాము. గ్రూప్ వన్, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్షల మధ్య తగిన సమయం లేకపోవడంతో నిరుద్యోగుల కోరిక మేరకు ఆగస్టు 7, 8 తేదీల్లో జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు నిరుద్యోగుల కోరిక మేరకు డిసెంబర్ కు వాయిదా వేశం. 1-8-24న జరిగిన క్యాబినెట్ సమావేశంలో జాబ్ క్యాలెండర్ గురించి చర్చించి ఆమోదించాం. 2024- 25 జాబ్ క్యాలెండర్ను సభ్యులందరికీ జారీ చేశాం.

LEAVE A RESPONSE