Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి పై మాకు నమ్మకం ఉంది

– బొప్పరాజు, వైవీ రావు

రాష్ట్రంలో వున్న 13 లక్షల మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, విశ్రాంత ఉద్యోగులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ మరియు NMR, పార్ట్ & ఫుల్ టైమ్ ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులందరికీ AP JAC అమరావతి రాష్ట్రకమిటీ పక్షాన నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము.

ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, పెన్షనర్స్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, NMR, పార్ట్ & ఫుల్ టైమ్ ఉద్యోగులు గత 3 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న 11వ PRC, cps రద్దు, పెండింగ్ DA లు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, గ్రామ సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ మరియు ఇతర ఆర్థిక, ఆర్థికేతర పరమైన అంశాలు నూతన సంవత్సర కానుకగా ముఖ్యమంత్రి ప్రకటిస్తారని, మాకు ముఖ్యమంత్రి పై నమ్మకం ఉందని తద్వారా రాష్ట్రంలోని ఉద్యోగులందరు సంతోషంగా, ఆనందంగా నూతన సంవత్సరం పండుగలు జరుపుకుంటారని తెలిపారు.

మాకు హక్కు ప్రకారం రావాల్సిన, మేము దాచుకున్న డబ్బులు కూడా ఉద్యోగుల, ఉపాధ్యాయుల తక్షణ అవసరాల కోసం ప్రభుత్వం చెల్లించనందున తీవ్ర ఆవేదన, ఆందోళన చెందుతున్నందున, ముఖ్యమంత్రి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో వున్న తీవ్ర ఆవేదన, ఆందోళన మంచి మనస్సుతో అర్థం చేసుకోని, ఇరు జేఏసీ ల AP JAC& AP JAC అమరావతి ఐక్యవేదిక పక్షాన ఈ నెల జనవరి 3 వ తేదీన నిర్వహించబోయే రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు ముందే రాష్ట్రంలో పనిచేస్తున్న 13 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, గ్రామ సచివాలయ ఉద్యోగులు, పెన్షనర్స్, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, NMR, పార్ట్ & ఫుల్ టైమ్ ఉద్యోగులు వారి కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరంలో సమస్యలు పరిష్కార శుభవార్త తెలుపుతారని ఆశిస్తున్నాము.

LEAVE A RESPONSE