Suryaa.co.in

Telangana

రాష్ట్రంలో అత్యధికంగా రూ.1200 కోట్లు నల్గొండ జిల్లాకే ఇచ్చాం

-మిషన్ భగీరథ కోసం కూడా రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాకు దాదాపు 6వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం
-సీఎం కేసిఆర్ దూరదృష్టి వల్ల వచ్చిన పల్లె ప్రగతి ట్రాక్టర్ల వల్ల గ్రామ పంచాయతీల ఆదాయం గణనీయంగా పెరిగింది
-కొంతమంది కావాలనే కిస్తిలకు కూడా డబ్బులు అడుగుతున్నారు
-రైతు కళ్ళాలు , రైతు వేదికలు కట్టొద్దు అని కేంద్రం అంటోంది…
-ఉపాధి హామీ పథకం కింద అత్యంత నాణ్యమైన పనులు చేసింది మన రాష్ట్ర ప్రభుత్వమే
-మనకు కేంద్రం నుంచి 703 కోట్లు రావాల్సి ఉండగా 150 కోట్లు రైతు కళ్ళాలకు ఖర్చు చేశామని అన్ని నిధులు ఆపారు
-ప్రతి గ్రామానికి రోడ్ల వసతి ఉండాలన్నది సీఎం కేసిఆర్ గారి ఆదేశం..అన్ని రోడ్లు ఇస్తాం
-ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ది మరియు సంక్షేమ సమీక్షలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పింది వాస్తవం…ఉపాధి హామీ పథకం మన దగ్గర బాగా జరుగుతుందనే అక్కసుతో ఆ పథకాన్ని ఆపే కుట్ర కేంద్రం చేసింది – మంత్రి జగదీష్ రెడ్డి

(నల్గొండ, డిసెంబర్ 01): ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర పురపాలక మరియు ఐ.టి.శాఖల మంత్రి కె.టి.రామారావు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగ దీష్ రెడ్డి, రాష్ట్ర రహదారులు, భవనాలు మరియు గృహ నిర్మాణ శాఖల మంత్రి శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ గారి సమక్షంలో ఉమ్మడి నల్గొండ జిల్లా అభివృద్ది మరియు సంక్షేమ సమీక్షా సమావేశం కొనసాగుతుంది.

మూడు జిల్లాల ప్రజా ప్రతినిధులు, అధికారులకు నమస్కారాలు. సీఎం కేసిఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించుకున్నాం.గతంలో జరిగిన పనులు, భవిష్యత్ లో చేయాల్సిన పనుల గురించి సమీక్ష చేసి నివేదిక సీఎం గారు ఇవ్వమన్నారు. 20 కోట్లు ఒక్కో నియోజక వర్గానికి ఇచ్చాం .83 కోట్లు పి ఆర్ రోడ్ల నిర్వహణ కింద ఖర్చు చేశాం.103 కోట్లు సీసీ రోడ్లకు ఖర్చు చేశాం.మిషన్ భగీరథ కు అత్యధిక నిధులు ఇక్కడే ఇచ్చే ఫ్లోరైడ్ లేకుండా చేశారు.కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లోనే ఇది చెప్పింది.

గతంలో కూడా జిల్లా, నియోజక వర్గం స్థాయిలో సమీక్ష చేసి మరిన్ని నిధులు ఇచ్చాం.గ్రామ పంచాయతీలలో ప్రభుత్వం ఇచ్చిన ప్రతి ట్రాక్టర్ మీద ఒక్కో గ్రామంలో 20 నుంచి 25 లక్షలు సర్పంచ్ లు సంపాదిస్తున్నారు.ట్రాక్టర్ల వల్ల గ్రామ పంచాయతీ ఆదాయం పెరిగింది.ముఖ్యమంత్రి దూర దృష్టి వల్ల ఇది సాధ్యం అయ్యింది.కొన్ని చోట్ల సర్పంచులు ఆదాయాన్ని మళ్లించి కిస్తీలకు డబ్బులు రావడం అంటున్నారు.

కొంతమంది కావాలని కిస్తి కట్టలేక పోతున్నామని బదనాం చేస్తున్నారు. కానీ దీనిని మనం ఖండించి, వాస్తవ ఆదాయాన్ని బయట పెట్టాలి.కొన్ని గ్రామ పంచాయతీలలో పొడి చెత్త, తడిచెత్తను వేర్వేరు చేసి ఎరువు తయారు చేసి ఆదాయం 5 నుంచి 6 లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. పల్లె ప్రగతి ద్వారా పంచాయతీలు బాగా సంపాదిస్తున్నాయి. సర్పంచ్ ఎవరైనా ఫిర్యాదు చేస్తే మొత్తం నివేదిక తెప్పించి, ఆదాయం ఎంత వస్తుందో చూపించండి.దేశంలో ఎక్కడా లేని విధంగా కేంద్రం ఇచ్చే నిధులకు సమానంగా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు ఇస్తున్నాం.ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా కూడా ఇలా ఇవ్వడం లేదు.

అయినా కేంద్రం గత ఏడు నెలలుగా గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు ఇవ్వడం లేదు.ఎందుకు ఆపుతున్నారు అని అడిగితే వంకలు పెట్టీ డబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. అధికారులు కూడా ప్రతి సర్పంచ్ ట్రాక్టర్లు, డంపింగ్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారు అని అడగాలి. ఎవరైనా సంపాదించలేకపోతే ఎందుకు అని అడగాలి.

ఉపాధి హామీ పథకంలో అత్యధిక పనులు కల్పించి నాణ్యమైన పనులు చేస్తుంది మనమే.కేంద్రం నుంచి వచ్చిన మొదటి టీమ్స్ మనం చేస్తున్న చేస్తున్నాం అని చెప్పారు.కానీ అది నచ్చక ఇప్పటికీ 18 టీమ్ లు వచ్చాయి.అయినా నాణ్యత లేకుండా చేయలేదని ఎవరూ అనలేదు. కానీ అనుమతి లేకుండా చేశారని అన్నారు.రైతు కళ్ళాలకు 150 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని నిధులు ఆపారు. మనకు రూ.703 కోట్లు ఉపాధి హామీ పథకం కింద రావాలి. రైతు కళ్ళాలు కట్టడం తప్పా..?రైతు వేదికలు కట్టొద్దు అని కేంద్ర అధికారులు అంటున్నారు.ఒకవేళ అనుమతి లేకుండా కళ్ళాలు కడితే వాటికి ఖర్చు చేసిన 150 కోట్లు ఆపి మిగిలినవి ఇవ్వమని అడిగినా.. ఇవ్వడం లేదు.పంచాయతీ రాజ్ రోడ్లకు పాత రేట్ల మీద పిలిస్తే కాంట్రాక్టర్స్ ముందుకు రావడం లేదు. అందుకే ఇప్పుడు రేట్లు పెంచాం.

పంచాయతీ రాజ్ రోడ్లకు పి.ఎం.జి.ఎస్. వై కింద 296.65 కోట్ల రూపాయలు నల్గొండ జిల్లాకు మంజూరు చేశాము.సి.ఆర్.ఆర్ కొండ 19 కోట్ల రూపాయలు మంజూరు చేశాం.81 కోట్లు రోడ్ల నిర్వహణకు ఇచ్చాం.సీసీ రోడ్ల కోసం 103 కోట్ల రూపాయలు ఇచ్చాం.ఇప్పటికే మంజూరైన పనులు మార్చిలోపు పూర్తి చేయండి.
నల్గొండ జిల్లాకు రాష్ట్రంలో అత్యధికంగా 1200 కోట్ల రూపాయిలు మంజూరు అయ్యాయి.మిషన్ భగీరథ కింద కూడా రాష్ట్రంలో ఈ జిల్లాలోనే అత్యధికంగా ఖర్చు చేశాం. దాదాపు 6వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాం. చిన్న గ్రామానికి కూడా కోటి రూపాయల కు పైగా ఖర్చు చేశాం.గతంలో ఈ నియోజక వర్గం మాజీ ఎమ్మెల్యే మిషన్ భగీరథ లో తప్పులు ఎత్తితే నేను ఇక్కడకు వచ్చి సమీక్ష చేస్తే సమావేశం నుంచి తప్పించుకు పోయాడు.

ఎమ్మెల్యేలు ఎప్పటికప్పుడు పనులపై సమీక్ష చేయండి.ఈ నల్గొండలో 1740 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో పాతవి 1150 ఉండగా…కొత్తవి 550 ఉన్నాయి.కొత్తగా గ్రామ పంచాయతీ లలో ఎక్కువ గ్రామాలు తండాలవి ఉన్నాయి. అక్కడ కూడా రోడ్లు కావాలి అంటున్నారు.సీఎం కేసిఆర్ ప్రతి గ్రామ పంచాయతీకి రోడ్లు ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యేలు కూడా వాటికే ప్రాధాన్యత ఇస్తూ ప్రతి పాదనలు ఇవ్వాలి.
731 కొత్త గ్రామ పంచాయతీకి భవనాలు కావాలి. వాటికి ప్రణాళికలు తయారు చేస్తున్నాం.రోడ్ల నిర్వహణ కోసం ప్రతి పాదనలు ప్రజా ప్రతినిధులు ఇచ్చారు. సీఎం కేసిఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళి అవన్నీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను.కొత్త రోడ్ల ప్రతిపాదనలు తీసుకుంటున్నాం.

నల్గొండ జిల్లా, మునుగోడు నియోజక వర్గంకు అన్ని అభివృద్ది పనులు చేయాలని సీఎం కేసిఆర్ చెప్పారు.మిషన్ కాకతీయలో మనం పూడికలు తీసుకున్నాం కాబట్టి ఉపాధి హామీ పథకంలో చెరువు పూడికలు మనం బాగా తగ్గించాం. 20 శాతం కూడా చేయడం లేదు. ఆంధ్రలో 70 శాతం పూడికలు తీస్తూనే ఉన్నారు. కానీ అక్కడ తప్పు పట్టకుండా …పైగా 900 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చారు. మన దగ్గర మాత్రం డబ్బులు ఆపుతున్నారు. మంత్రి కేటిఆర్ ఈ నియోజక వర్గం కోసం చాలా పనులు చేయాలన్నారు. ఇప్పుడు ఇక్కడి ప్రజా ప్రతినిధులతో కూడా మాట్లాడాం.

ఆ పథకాన్ని ఆపే కుట్ర కేంద్రం చేసింది – మంత్రి జగదీష్ రెడ్డి
మన ప్రభుత్వం వచ్చాక మన గ్రామ పంచాయతీలు ఇతర రాష్ట్రాలలోని పట్టణాలతో పోటీ పడుతున్నాయి. గ్రామాలకు వలసలు తిరిగి వస్తున్నాయి. నిజాయితీగా పని చేసిన సర్పంచులు బాగా ఆదాయం గ్రామ పంచాయతీకి పొందుతున్నారు.కొంతమంది డ్రామాలు చేసి ప్రభుత్వం చేసే మంచి పనులకు మసిబూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేస్తున్నారు.కేంద్రం మనకు రావలసిన డబ్బులు ఆపి ఇబ్బంది పెడుతుంది.

ఉపాధి హామీ పథకం కింద వీళ్ళు మంచి పనులు చేస్తున్నారు అని గుర్తించి కుట్ర పన్ని ఆ పథకాన్ని ఆపే ప్రయత్నం చేస్తోంది.గతంలో కేంద్రం నుంచి ఒక టీమ్ లో ముగ్గురు అధికారులు వచ్చి చూసేవారు. కానీ ఈసారి 18 టీమ్స్ వచ్చి చూడడం విశేషం. అవి కూడా కలెక్టర్ కు సమాచారం ఇవ్వకుండా నేరుగా గ్రామాలకు వెళ్లి చూస్తున్నారు.
కానీ బీజేపీ నేతలకు ఇవేవీ తెలువక కుక్కల వలె మాట్లాడుతున్నారు.మేము రైతు కళ్ళాల కోసం ఖర్చు చేస్తే వాటికి ఖర్చు చేసిన 150 కోట్లు ఆపి మిగిలిన నిధులు ఇవ్వమని అడిగినా ఇవ్వడం లేదు.

సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర రైతు బంధు సమితి అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, జడ్పి చైర్మన్ లు బండ నరేందర్ రెడ్డి, దీపికా యుగంధర్, సందీప్ రెడ్డి, పార్లమెంట్ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, ఎం.ఎల్.సి నర్సిరెడ్డి, శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, రవీంద్ర కుమార్ నాయక్, ఎన్.భాస్కర్ రావు, గాదరి కిషోర్ కుమార్, శానంపుడి సైది రెడ్డి, పైళ్ళ శేఖర్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ హనుమంత రావు, రాష్ట్ర పురపాలక శాఖ సంచాలకులు సత్య నారాయణ, ఉమ్మడి నల్గొండ జిల్లా కలెక్టర్ లు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE