Suryaa.co.in

Telangana

కేసీఆర్ కు మూడింది…. వచ్చేది బీజేపీ సర్కారే

– అధికారంలోకి రాగానే బైంసాను మైసా(మహిషా)గా మారుస్తాం
– బైంసాను దత్తత తీసుకుంటాం
– బైంసా అల్లర్ల బాధితులపై కేసులు ఎత్తేస్తాం… ఉద్యోగాలిస్తాం
– 5 లక్షల కోట్ల అప్పు చేసిన కేసీఆర్ సాధించేదేమిటి?
– ఒక్క ఉద్యోగమైనా ఇచ్చారా? ఇండ్లు, దళిత బంధు, రుణమాఫీ హామీలు అమలు చేశారా?
– బీజేపీ అధికారంలోకి వస్తే అందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య-వైద్యం అందిస్తాం
– నిలువనీడలేని వాళ్లందరికీ ఇండ్లు కట్టిస్తాం.. రైతులకు పంట పరిహారం అందజేస్తాం
– బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి
– బైంసా బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్
– కేవలం 13 నిమిషాల్లోపే ప్రసంగాన్ని ముగించిన సంజయ్
– కోర్టు ఇచ్చిన నిర్ణీత గడువులోపే సభను నిర్వహించిన బీజేపీ
– కోర్టులు, చట్టాలపై తమకు గౌరవముందని పేర్కొన్న బండి సంజయ్

ముఖ్యమంత్రి కేసీఆర్ కు మూడిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంప బండి సంజయ్ కుమార్ అన్నారు. రాష్ట్రాన్ని అప్పులపాల్జేసి ప్రజలను కష్టపాల్జేసిన కేసీఆర్ ఏం సాధించారని, ఇచ్చిన హామీలను నెరవేర్చారా? అని ప్రశ్నించారు. రాబోయేది బీజేపీ ప్రభుత్వమేనని ఉద్ఘాటించిన బండి సంజయ్ బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బైంసా పేరును మైసా (మహిషా) మారుస్తామని ప్రకటించారు. అట్లాగే బైంసా బాధితులపై పెట్టిన కేసులన్నీ ఎత్తేస్తామని, ఉద్యోగాలు కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని అర్హులైన అందరికీ ఉచితంగా నాణ్యమైన విద్య-వైద్యం అందించడంతోపాటు నిలువనీడ లేని వాళ్లందరికీ పక్కా ఇండ్లు కట్టిస్తామని ప్రకటించారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందిస్తామన్నారు.

ఈరోజు బైంసా సమీపంలో జరిగిన 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభ బహిరంగ సభకు బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, సోయం బాపూరావు, పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శ్రుతి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, పాదయాత్ర సహ ప్రముఖ్ టి.వీరేందర్ గౌడ్, జిట్టా బాలక్రిష్ణారెడ్డి, కుమ్మరి శంకర్, జిల్లా అధ్యక్షురాలు రమాదేవి, జిల్లా నేతలు రామారావుపటేల్, బోస్లే మోహన్ రావు పటేల్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బండి సంజయ్ 13 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 5వరకు మాత్రమే సభ నిర్వహించాలని హైకోర్టు ఉత్తర్వుల్లో పేర్కొన్న నేపథ్యంలో అందుకు లోబడి సభను ముగించారు. న్యాయ స్థానాలపైన, చట్టాలపై తమకు ఎంతో గౌరవం ఉందని పేర్కొన్న బండి సంజయ్ అందుకు అనుగుణంగా కేవలం 13 నిమిషాల్లోనే తన ప్రసంగాన్ని ముగించారు. కొద్దినిమిషాలే మాట్లాడినప్పటికీ భావోద్వేగ, ఉత్తేజ భరిత ప్రసంగంతో అక్కడున్న వారందరినీ ఆకట్టుకున్నారు. బండి సంజయ్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు…

మేం కోర్టును, చట్టాన్ని గౌరవిస్తాం… బైంసాలో ఫుల్ జోష్… 3 వేల కుర్చీలేస్తే పోలీసోళ్లు 144 సెక్షన్ పెట్టారట.. ఇన్ని వేల మంది వచ్చారు. మీ అందరినీ దర్శించుకునే మాలో జోష్ పెరుగుతోందని ఇక్కడికి వచ్చాను. బైంసాలో మత కల్లోలాల సందర్బంగా గాయపడ్డ, కేసుల పాలైన బాధితులకు అభినందిస్తున్నా. బైంసా బాధితుల పక్షాన హిందూవాహిని తమ్ముళ్ల పోరాటం బేష్.బైంసాకు రావాలంటే వీసా తీసుకోవాలా? ఏం పాపం చేశారన్న బైంసా ప్రజలు? బైంసాలో పచ్చ జెండా మాత్రమే ఎగరేస్తామని ఉర్రూతలూగిన ఎంఐఎం లుచ్చానాకొడుకులున్న పాతబస్తీకి పోయి కాషాయ జెండాను రెపరెపలాడించి గాండ్రించినం.

ఈరోజు బీజేపీని బైంసాకు రాకుండా నిషేధించారు? బైంసా పాకిస్తాన్, బంగ్లాదేశ్, అప్ఘనిస్తాన్ లో ఉందా? వీసా తీసుకుని రావాలా? మతవిద్వేషాలు రగిలించే ఎంఐఎం నాయకులు ఎక్కడైనా తిరగొచ్చు… నా దేవతలను కించపర్చే మునావర్ ఫారుఖీ లాంటి వాళ్లు ఎక్కడైనా సభలు పెట్టుకోవచ్చట… దేశం కోసం, ధర్మం కోసం హిందు ధర్మాన్ని కాపాడే బీజేపీ వాళ్లు మాత్రం సభలు పెట్టుకోవద్దట… ఒక్కసారి ఆలోచించండి. మనం ఏ దేశంలో ఉన్నాం?

ఇకపై తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా కాషాయ జెండా రెపరెపలాడించాలె. బీజేపీ ఏర్పడ్డాక బైంసాను దత్తత తీసుకుంటాం. బైంసా అల్లర్లలో గాయపడ్డ బాధితులపై పెట్టిన కేసులను ఎత్తిపారేస్తాం. వాళ్లకు పక్కా ఉద్యోగాలిస్తాం. అరే… ఇయాళ నీ ప్రభుత్వం ఉంది… రేపు రాబోయేది మా ప్రభుత్వం. మా పార్టీ అధికారంలోకి వస్తే.. మనోళ్ల గురించి ఆలోచిస్తా… మీ కోసమే కష్టపడుతున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడేందుకు కష్టపడుతున్నాం.

బైంసా ప్రజలారా… భయపడాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం మీ వెంట ఉంది. ఫాల్తుగాళ్లు 12 ఇండ్లు తగలబెడితే… కట్టించామా? లేదా? పీడీ యాక్ట్ పెడితే తొలగించినమా? లేదా? కేసీఆర్ కు మూడింది…. బైంసా అంటేనే కేసీఆర్ కు భయం… ఇక్కడ పెట్టిన సభకు వచ్చిన జన స్పందనను చూసి ఫుల్ బాటిల్ తాగుతడు. రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పులపాల్జేశాడు. 5 లక్షల కోట్ల అప్పుల చేసి ఒక్కో వ్యక్తి పై 1.2 లక్షల అప్పు మోపిండు.

ఒక్క ఉద్యోగమియ్యలే…. నరేంద్రమోదీ ప్రభుత్వం పోయిన నెలలో ఒకేసారి 75 వేల మందికి, ఈనెలలో 70 వేల మందికి ఏకకాలంలో ఉద్యోగ నియామక పత్రాలు అందజేశారు. లక్షల కోట్ల అప్పులు చేసిన కేసీఆర్…. ఎంతమందికి డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చినవ్? రుణమాఫీ చేసినవ్? దళిత బంధు ఇచ్చినవో…? దళిత, గిరిజనులకు ఎన్ని ఎకరాల భూమి ఇచ్చినవ్? చెప్పాలే.. సమస్యల పరిష్కారం కోసం ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ధర్నా చేస్తే పట్టించుకోలేదు కేసీఆర్. ఇచ్చిన హామీలను గాలికొదిలేశాడు. వాళ్లకు బీజేపీ అండగా ఉంటుంది. కడెం ప్రాజెక్టు గేట్ల మేయింటెనెన్స్ కు నిధులు ఇవ్వలేనోడు… రాష్ట్రాన్ని ఏం కాపాడతారు? బీజేపీ అధికారంలోకి వస్తే పేదలందిరికీ ఉచిత విద్య-వైద్యం అందిస్తాం. నిలువనీడలేని పేదోళ్లందరికీ పక్కా ఇండ్లు నిర్మిస్తాం. అకాల వానలతో పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందిస్తాం.

అన్ని పార్టీలకు అధికారమిచ్చారు.. ఒక్కసారి బీజేపీకి అవకాశమివ్వండి.ఈ గడ్డపై 5వ విడత ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించడం గర్వంగా ఉంది. కేసీఆర్ ఇంకో ఏడాది హిందువులపై దాడులు చేయిస్తారు. కష్టాలను భరిద్దాం… రాబోయేది మన ప్రభుత్వమే.

LEAVE A RESPONSE