-గత 4 ఏళ్లలో కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో రోడ్ల కోసం 4 వేల కోట్లకుపైగా తీసుకొచ్చా
-వివిధ అభివ్రుద్ధి పనుల కోసం రూ.7వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చా
– ఎల్కతుర్తి-సిద్దిపేట వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం 578 కోట్లు మంజూరు
-15 శాతం పనులు పూర్తయ్యాయి
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యలు
– ప్రకాశ్ జవదేకర్ తో కలిసి ఎల్కతుర్తి-సిద్దిపేట విస్తరణ పనుల పరిశీలన
గత 9 ఏళ్లలో తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణం కోసం 1 లక్షా 9 వేల కోట్లకుపైగా నిధులు కేటాయించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ తెలిపారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో గత 4 ఏళ్లలోనే 7 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చినట్లు చెప్పారు. అందులో రోడ్ల నిర్మాణం కోసమే రూ.4 వేల కోట్లకుపైగా నిధులు మంజూరైనట్లు పేర్కొన్నారు.‘‘మహజన్ సంపర్క్ అభియాన్’’లో భాగంగా కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్, రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కరీంనగర్, సిద్దిపేట, హన్మకొండ జిల్లా అధ్యక్షులు గంగాడి క్రిష్ణారెడ్డి, శ్రీకాంత్, రావు పద్మ, పార్లమెంట్ కన్వీనర్ బోయినిపల్లి ప్రవీణ్ రావు లతో కలిసి హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం సముద్రాల గ్రామానికి వచ్చారు. ‘‘ఎల్కతుర్తి- సిద్దిపేట ‘‘ జాతీయ రహదారి విస్తరణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బండి సంజయ్ మాట్లాడారు. ముఖ్యాంశాలు..
నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి 9 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో సాధించిన విజయాలు, అభివ్రుద్ధి, సంక్షేమ పనులను ప్రజలకు వివరించేందుకు మహజన్ సంపర్క్ అభియాన్ ముఖ్య ఉద్దేశం. సమాజాన్ని ప్రభావితం చేసే ప్రముఖులను కలవడం, కేంద్ర నిధులతో జరుగుతున్న అభివ్రుద్ధి పనులను పరిశీలించడం ఈ కార్యక్రమం లక్ష్యం.
మీరు ఎంపీగా గెలిపించారు కాబట్టే నేను ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడినయ్యాను. మీరు నన్ను ఎంపీగా గెలిపించాక ఎల్కతుర్తి-సిద్దిపేట వరకు జాతీయ రహదారి విస్తరణ పనుల కోసం 578 కోట్ల రూపాయలను కేటాయించింది. ఈ విషయంలో గతంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ని కలిసి వారి సహకారంతో ఈ నిధులను మంజూరు చేయించాను. పనులు కొనసాగుతున్నాయి. 15 శాతం పనులు పూర్తయ్యాయి. 2024లోపు పనులు పూర్తి చేయాల్సి ఉంది. దీనివల్ల 14 గ్రామాల ప్రజలకు ఎంతగానో మేలు జరుగుతుంది.
ఈ 9 ఏళ్లలో తెలంగాణలో జాతీయ రహదారి పనుల కోసం లక్ష కోట్లకుపైగా ఖర్చు చేసింది. నేను ఎంపీ అయినప్పటి నుండి నేటి వరకు 4 ఏళ్లలో రూ.7 వేల కోట్లకుపైగా నిధులు తీసుకొచ్చిన. రోడ్ల కోసమే 4 వేల కోట్లకుపైగా తీసుకొచ్చిన. కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణం కోసం రూ.వంద కోట్లు మంజూరు చేయించినా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంవల్ల ఆ పనుల్లో జాప్యం జరుగుతోంది.
9 ఏళ్లలో మోదీ సాధించిన విజయాలు
పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే ముందు వరకు గ్రామాల్లో ప్రజలకు అవసరమైనవన్నీ మోదీ ప్రభుత్వం సమకూరుస్తోంది. టాయిలెట్స్, ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు, 5 కిలోలో ఉచిత బియ్యం, కరెంట్, ఉపాధి హామీ, గ్రామీణ సడక్ యోజన రోడ్లు, రైతు వేదిక, పల్లె ప్రక్రుతి వనం, హరిత హారం, వైకుంఠధామం నిర్మాణాలకు నిధులిస్తోంది మోదీ ప్రభుత్వమే.
ఆర్దిక సంక్షోభం నుండి గట్టెక్కించేందుకు ఆత్మనిర్బర్ భారత్ పేరిట 20 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించింది. పీఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద ప్రతి రైతు అకౌంట్లో 6 వేల రూపాయల చొప్పున దేశమంతా లక్ష కోట్ల రూపాయల సొమ్ము రైతుల ఖాతాల్లో జమ చేశారు.. ఇవిగాకుండా సబ్సిడీ ఎరువులు అందిస్తూ ఒక్కో ఎకరానికి 28 వేల రూపాయల ప్రయోజనం కలిగిస్తోంది..
రైతులకు మద్దతు ధరను పెంచింది. ముద్ర రుణాలు, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్కిల్ ఇండియా, డిజిటల్ ఇండియా కార్యక్రమాలను అమలు చేస్తోంది. మోదీ హయాంలో 5వ స్థానానికి చేరిన భారత్ ను తిరుగులేని శక్తిగా ఎదుగుతూ 2047 నాటికి నెంబర్ వన్ గా మార్చేందుకు క్రుషి చేస్తున్నారు.