– విశ్వహిందూ పరిషత్ డిమాండ్
పవిత్రమైన హిందూ దేవి దేవతలను దూషిస్తూ ఘోరంగా అవమానించిన దుర్మార్గుడిని వెంటనే ఎన్కౌంటర్ చేయాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. హిందూ దేవతలను అవమానించిన వ్యక్తిపై పిడి యాక్ట్ నమోదు చేసి, కమ్యూనల్ కేసులు పెట్టాలని పేర్కొంది. నాస్తికుల పేరుతో సభలు సమావేశాలు నిర్వహించి హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన సంస్థను నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ నేతలు అన్నారు.
ఈ మేరకు శుక్రవారం విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాథ్, సహకార్య దర్శులు భాను ప్రసాద్, శశిధర్, రాజేశ్వర్ రెడ్డి, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు, ధర్మ ప్రసార్ రాష్ట్ర సహ ప్రముఖ్ సుభాష్ చందర్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇతర మతస్తులను పల్లెతి మాట విమర్శించే ధైర్యం చాలని నాస్తికులు కేవలం హిందువులనే టార్గెట్ చేసుకొని అవమానించడం రాజ్యాంగ విరుద్ధపు చర్యలు అన్నారు. హిందువులను కాకుండా మరి ఇతర మతస్తులను దూషించినా ప్రపంచం మొత్తం ఏకమై ఆందోళనలకు పిలుపునిచ్చే వారన్నారు.
కానీ నాస్తికుల పేరుతో హిందువులను అవమానించడం దుర్మార్గపు చర్య అని వారు ఖండించారు. అంబేద్కర్ సంఘాల పేరుతో కొంతమంది దుర్మార్గులు సంస్థలు ఏర్పాటు చేసుకొని చీఫ్ పబ్లిసిటీకి పాకులాడుతున్నారన్నారు. అంబేద్కర్ కూడా అసహ్యించుకునే విధంగా మాట్లాడిన దుర్మార్గులను ఈ సభ్య సమాజం క్షమించదన్నారు. తల్లిదండ్రులు, అక్క చెల్లెలు కూడా అసహ్యించుకునే విధంగా మాట్లాడిన దుర్మార్గుడు బైరి నరేష్ వెంటనే ఎన్కౌంటర్ చేయాలని విశ్వహిందూ పరిషత్ నేతలు డిమాండ్ చేశారు.
ఇలాంటి దుర్మార్గులపై చర్యలు తీసుకొనట్లయితే రాబోవు రోజుల్లో మరి కొంతమంది అలుసుగా తీసుకొని, ఇదే పద్ధతిని కొనసాగించే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వేచ్ఛ పేరుతో.. లౌకికవాదం ముసుగులో .. నాస్తికత్వం అనే మాటలు మాట్లాడుతూ హిందుత్వాన్ని, హిందూ దేవి దేవతలను అవమానించడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి వారి పట్ల తెలంగాణ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించరాదని.. వెంటనే చర్యలు తీసుకోవాలని నేతలు డిమాండ్ చేశారు. నాస్తికత్వం అంటే హిందుత్వాన్ని విమర్శించడమేనా .? అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగాన్ని అవమానించేలా మాట్లాడిన సంస్థను సంస్థ పెద్దలపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు.
అంబేద్కర్ కూడా తలదించుకునేలా నీచాతి నీచంగా అనాగరికంగా అసభ్యంగా మాట్లాడడం మానవజాతికే అవమానకరమన్నారు. తనకు దేవుళ్ళు నచ్చకపోతే వదిలేయాలని.. నచ్చిన వారిని దేవీ దేవతల పై విశ్వాసం ఉన్న వారిని అవమానించేలా మాట్లాడడం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధమన్నారు. కులాల పేరుతో హిందూ సమాజాన్ని చీల్చి రాజకీయ లబ్ధి పొంది దుర్మార్గపు చర్యల్లో భాగంగానే ఈ విధమైన వ్యాఖ్యలు చేశారని విశ్వహిందూ పరిషత్ మండిపడింది. ఏది ఏమైనా హిందువులను తిట్టడం ఫ్యాషన్ గా మారిపోయిందని.. హిందూ దేవి దేవతలను అవమానించడం అలవాటుగా మారిందని పేర్కొన్నారు.
రాజకీయాలు.. కులాలకు అతీతంగా ప్రతి హిందువు స్పందించి బైరి నరేష్ అనే దుర్మార్గుడిని ఎన్కౌంటర్ చేసేదాకా పోరాడాలని పిలుపునిస్తున్నారు. అంబేద్కర్ పేరు చెప్పుకునే అర్హత కూడా లేని వ్యక్తులు ఈరోజు అంబేద్కర్ పేరుతో సంఘాలు ఏర్పాటు చేసుకోవడం సభ్య సమాజం క్షమించదన్నారు. అంబేద్కర్ ఆశయాలు.. అంబేద్కర్ ఆలోచనలు ఏమాత్రం తెలియని దుర్మార్గులే నేడు హిందుత్వంపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం వెంబడే ఇలాంటి సంస్థలను నిషేధించి, సంస్థ నిర్వాహకులపై కమ్యూనల్ కేసులను పిడి యాక్ట్ నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలంగాణ ప్రభుత్వం స్పందించక పోతే హిందూ సమాజం తగిన రీతిలో స్పందిస్తుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్వహిందూ పరిషత్ నేతలు హెచ్చరించారు. హిందూదేశంలోనే హిందూ దేవి దేవతలు అవమానాలకు గురవడం సహించరానిదన్నారు. హిందువులను అరెస్టు చేయడం హిందువులను హింసించడంలో ఉన్న ఆసక్తి.. హిందూ వ్యతిరేకులైన వ్యక్తులపై చర్యలు తీసుకునే శ్రద్ధ తెలంగాణ పోలీసులకు లేకపోవడం శోచనీయమన్నారు.
అయ్యప్ప స్వామి పుట్టుక పై అసభ్యకరమైన భాషను ఉపయోగించి కోటాను కోట్ల అయ్యప్ప స్వామి భక్తుల మనోభావాలు గాయపరచి , అయ్యప్ప స్వామి, విష్ణుమూర్తి మరియు పరమ శివునిపై అసభ్యకరమైన భాషను ఉపయోగించిన భైరి నరేష్ పై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. నేర చరిత్ర కలిగిన భైరి నరేష్ పైన మరియు సభా నిర్వాహకులైన చట్టపరమైన కఠిన చర్యలు చేపట్టాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది . పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోతే లక్షలాది మంది అయ్యప్ప స్వాములతో కలిసి ప్రగతి భవన్ దిగ్భందం చేస్తామని విశ్వహిందూ పరిషత్ హెచ్చరిస్తుంది.