కేసీఆర్‌ సర్కారుపై బీజేపీ దశలవారీ పోరాటం

– జనంలోకి వెళ్లాలని నేతలకు పిలుపు
– ఎక్కడికక్కడ స్థానిక సమస్యలపై సమరం
– బీజేపీ కోర్‌కమిటీ నిర్ణయం

ఇకపై తెలంగాణ సర్కారు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలపై దశలవారీ పోరాటం నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. సీఎం కేసీఆర్‌ ప్రభుత్వంలో నష్టపోతున్న వర్గాల వద్దకు వెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిచ్చింది. ఆ మేరకు బీజేపీ కోర్‌ కమిటీ తీర్మానించింది. బిజెపి రాష్ట్ర కోర్ కమిటీ సమావేశం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అధ్యక్షతన జరిగింది.

వీడియో కాన్ఫరెన్స్ లో కేంద్ర పర్యాటక సాంస్కృతిక ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, బిజెపి పార్లమెంటరీ బోర్డ్ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్, బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి& బిజెపి తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ తరుణ్ ఛుగ్,బిజెపి జాతీయ కార్యదర్శి బిజెపి తెలంగాణ రాష్ట్ర సహా ఇంచార్జ్ అరవింద్ మీనన్, బిజెపి మధ్యప్రదేశ్ రాష్ట్ర ఇంచార్జ్ పి మురళీధర్ రావు, బిజెపి తమిళనాడు సహ ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు & శాసనసభ్యులు ఈటల రాజేందర్, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు ఏపీ జితేందర్ రెడ్డి,డాక్టర్ వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, బంగారు శృతి తదితరులు పాల్గొన్నారు.

ఈ సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాతృమూర్తి హీరా బెన్ మోదీ మరణం పట్ల సంతాపం, విచారం వ్యక్తం చేసింది. సంతాపాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కి పంపించడం జరిగింది.రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజా సమస్యల పట్ల ఉదృతంగా పోరాటాలను ఉద్యమాలను అంచే అంచెలుగా చేపట్టాలని నిర్ణయించింది.

Leave a Reply