Suryaa.co.in

Andhra Pradesh

ఆ అప్పులు మనమే కట్టాలి.. :చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం విశాఖలో టీడీపీ నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు. 2029 నాటికి దేశంలోని నెంబర్ వన్‌గా తీర్చి దిద్దాల్సిన ఏపీని జగన్మోహన్ రెడ్డి నాశనం చేశారని విమర్శించారు. జగన్ జె బ్రాండ్స్‌, డ్రగ్స్‌కు ఏపీ కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. జగన్‌రెడ్డి చేస్తున్న అప్పులన్నీ మనమే కట్టాలని అన్నారు. అన్నింటి మీద పన్నులు వేస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. జగన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని ఆరోపించారు. గ్రామానికో రౌడీని, సైకోను తయారు చేశారని, సైకోలను పూర్తిగా అణచివేస్తామన్నారు. పదవులు రావాలంటే ప్రజలతోనే ఉండాలని.. తనతో కాదన్నారు. మనం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, మనమేమి బాబాయిని చంపలేదు.. కోడి కత్తి డ్రామాలు ఆడలేదని చంద్రబాబు అన్నారు.

LEAVE A RESPONSE