Suryaa.co.in

Andhra Pradesh

ఎన్నికల కురుక్షేత్రంలో మీరంతా సై అంటూ ముందుకు కదలాలి

– వైసీపీ అరాచకాలను ఎదురించి గెలవాలి
– సత్యవేడు నియోజకవర్గ ప్రజలకు భువనమ్మ పిలుపు

రానున్న ఎన్నికల కురుక్షేత్రం మనకు చాలా ముఖ్యమైనది. తెలుగుదేశంపార్టీని గెలిపించుకునేందుకు ప్రతి కార్యకర్త సై అంటూ ఎన్నికల కురుక్షేత్రంలోకి దూకాలని చంద్రబాబు సతీమణి భువనమ్మ పిలుపునిచ్చారు. సత్యేవేడు నియోజకవర్గం, నారాయణవనం మండలం, తుంబూరు గ్రామంలో పార్టీకార్యకర్త మునివేలు కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం అక్కడికి వచ్చిన కార్యకర్తలు, గ్రామస్తులతో భువనమ్మ మాట్లాడుతూ…

తెలుగుదేశంపార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు, చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం భయపెట్టి ఇంట్లో కూర్చోబెట్టాలని ప్రయత్నాలు చేస్తోంది. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు, నిర్బంధాలు, అరెస్టులు, అక్రమాలతో ఇబ్బందులు పెట్టి బయటకు రాకుండా చేయాలని వైసీపీ కుట్ర చేస్తోంది.

టీడీపీ కార్యకర్తలు, నాయకులను బయటకు రాకుండా చేసి, వచ్చే ఎన్నికల్లో ఏకపక్షంగా ఓట్లు వేయించుకుని గెలవాలని జగన్ ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. జగన్ పాలనలో ఇప్పటి వరకు వేలాదిమంది టీడీపీ కార్యకర్తలపై తప్పుడు కేసులు, అక్రమ అరెస్టులతో పాటు అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకునేందుకు తెలుగుదేశం కార్యకర్తలంతా సిద్ధం అనే వాళ్లకు ధీటుగా సై అంటూ ముందుకు కదలాలి.

వచ్చే ఎన్నికల కురుక్షేత్రంలో పసుపుజెండాను ఎగరేయాలి. కార్యకర్తలే మా కుటుంబానికి కొండంత బలం. నేను ధైర్యంగా పర్యటన చేస్తున్నానంటే దానికి గల కారణం మీరున్నారనే నమ్మకం. చంద్రబాబు పాలనలో రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందిందో మీకు తెలుసు. వైసీపీ పాలనలో నష్టపోయిన రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలి అని అన్నారు.

LEAVE A RESPONSE