– ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ
సత్తెనపల్లి: టీడీపీ సత్తెనపల్లి రూరల్ మండల విస్తృతస్థాయి సమావేశం రఘురామ్ నగర్ ప్రజావేదిక వద్ద జరిగింది. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారామయణ పాల్గొని, మాట్లాడారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. దార్శనికుడు, విజనరీ లీడర్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాలనలో అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రతి గడపకు తెలియజేయాలని, పార్టీ పదవులు ఉన్న ప్రతి ఒక్కరూ, కార్యకర్తలు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. సత్తెనపల్లి రూరల్ మండల కమిటీ అనుబంధ కమిటీల అధ్యక్ష, కార్యదర్శుల సభ్యులు, క్లస్టర్ ఇంచార్జిలు యూనిట్ ఇంచార్జ్ లు సమావేశంలో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.