– విద్య, ఐటి శాఖ మంత్రి నారా లోకేష్
ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. 30 ఏళ్ల క్రితం సామాజిక న్యాయాన్ని అమలు చేసింది చంద్రబాబు. రాష్ట్రపతి ఆర్డినెన్సు ద్వారా వర్గీకరణ అమలు చేయడం వలన అనేక మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఎన్నికల్లో ఇచ్చిన వర్గీకరణ హామీకి కట్టుబడి ఉన్నాం. అన్ని సామాజిక వర్గాల ఆర్థిక ,రాజకీయ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ఎజెండా.