Suryaa.co.in

Telangana

హెల్త్ డైరెక్టర్ ను సస్పెండ్ చేసే దాకా ఉద్యమిస్తాం: VHP

“తెలంగాణ హెల్త్ డైరెక్టర్ గడీల శ్రీనివాసరావును సస్పెండ్ చేసేదాకా ఉద్యమిస్తాం. ఏసు క్రీస్తు మైకంలో మునిగితేలుతున్న గడిల శ్రీనివాస్ హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు. అనేక అవకతవకలకు పాల్పడిన హెల్త్ డైరెక్టర్ ను వెంటనే విధుల నుంచి తొలగించి.. అవినీతి సొమ్మును రికవరీ చేసే విధంగా ఉద్యమిస్తాం. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే చట్టపరంగా కోర్టులను ఆశ్రయించి న్యాయం సాధించేందుకు విశ్వహిందూ పరిషత్ ఉద్యమిస్తుందని” విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సురేందర్ రెడ్డి, పండరినాథ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. కరోనా సమయంలో లెక్కకు మించిన అవినీతికి పాల్పడిన శ్రీనివాస్ తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కాళ్ళు మొక్కుతూ.. అవినీతి సొమ్మును కాపాడుకునేందుకు రాజకీయాల్లోకి ప్రవేశం చేసేటందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వారు విమర్శించారు. ఈ సందర్భంగా ఓటు బ్యాంకు రాజకీయాల కారణంగా ఏసుక్రీస్తును మెచ్చుకొని.. హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరుస్తున్నట్లు VHP నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం హిందువుల మనోభావాలు గాలికి వదిలేసి, అవినీతి శ్రీనివాసరావుకు అండగా నిలబడితే, న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటామని.. అనంతరం కేంద్ర ప్రభుత్వానికి ఆయన అవినీతి చిట్టా అందజేస్తామని వారు హెచ్చరించారు. వెంటనే బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

భవదీయ
పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రముఖ్
విశ్వహిందూ పరిషత్ (VHP)
తెలంగాణ రాష్ట్రం
9912975753
9182674010

LEAVE A RESPONSE