Suryaa.co.in

Andhra Pradesh

బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం

-బీసీల పుట్టినిల్లు టిడిపి
-34 శాతం రిజర్వేషన్లు కల్పించింది
-క్వారీలు వడ్డెర్ల కు కేటాయిస్తాం
-జగన్ మత్స్యకారులను దెబ్బతీసే విధంగా జీఓ లు తీసుకొచ్చి వేధిస్తున్నారు
-పీలేరు నియోజకవర్గం వేపుల బైలులో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న నారా లోకేష్

విద్యాసాగర్ కురుబ కులం …
గొర్రెలు మేపడం మా కుల వృత్తి. గొర్రెలు రకరకాల జబ్బులు వచ్చి చనిపోతున్నాయి. వైసిపి ప్రభుత్వం వచ్చిన తరువాత ఇన్స్యూరెన్స్ రావడం లేదు.గొర్రెలు మేపడానికి స్థలాలు లేక ఇబ్బంది పడుతున్నాం. అసైన్డ్ భూముల్లో గొర్రెలు మేపడానికి హక్కు ఇవ్వాలి.గొర్రెలు కొనడానికి ప్రభుత్వం రుణాలు అందించాలి. కార్పొరేషన్ రుణాలు కోసం ఎన్ని సార్లు ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా న్యాయం జరగడం లేదు.
శేఖర్ వాల్మీకి కులం
మమ్మల్ని ఎస్టీల్లోకి చేరుస్తామని హామీ ఇచ్చి జగన్ మోసం చేశారు.మేము ఆర్థికంగానూ, రాజకీయంగానూ వెనకబడి ఉన్నాం.
రమణ…
చేనేత వృత్తి లో ఉన్న మేమే అనేక ఇబ్బందులు పడుతున్నాం. చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.ఉపాధి హామీ మాకు అనుసంధానం చేస్తే బాగుంటుంది.చనిపోయిన కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలి.వర్షా కాలం మగ్గాల్లోకి నీరు చేరి ఉపాధి ఉండటం లేదు.ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.పట్టు రేటు పెరిగిపోవడం వలన తీవ్రంగా నష్టపోతున్నాం.సిల్క్ సబ్సిడీ రావడం లేదు.చేనేత గుర్తింపు కార్డులు ఇవ్వడానికి కూడా ఇబ్బంది పెడుతున్నారు.
చంద్రమోహన్ నాయి బ్రాహ్మణ
సెలూన్లు నిర్వహించుకునే మాకు అనేక ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వ సహాయం అందడం లేదు.దేవాలయాల్లో పనిచేస్తున్న క్షరకులను రెగ్యులర్ చెయ్యాలి.మేళ, తాళాలు వాయించే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలి.
నాగేంద్ర బెస్త
చేపలు పట్టుకొని జీవించే మాకు ఇన్స్యూరెన్స్ కల్పించాలి.ఉండటానికి సొంత ఇళ్లు లేక ఇబ్బంది పడుతున్నాం.
శివ శంకర్ వడ్డెర
ఆర్థికంగా , రాజకీయంగా వెనుక బడి ఉన్నాం.ఇతర రాష్ట్రాల్లో మేము ఎస్సిల్లో ఉన్నాం. ఇక్కడ మాత్రం బీసీలుగా ఉన్నాం.పట్టు రేటు పెరిగిపోవడం వలన తీవ్రంగా నష్టపోతున్నాం.

వారి సమస్యలు విన్న లోకేష్‌ అందుకు స్పందిస్తూ..
బీసీల పుట్టినిల్లు టిడిపి. 34 శాతం రిజర్వేషన్లు కల్పించింది టిడిపి. జగన్ పాలనలో బీసీలకు బాధలే మిగిలాయి.జగన్ 10 శాతం రిజర్వేషన్లు కట్ చేసి. స్థానిక సంస్థల్లో 16000 మందిని జగన్ పదవులకు దూరం చేశారు.జగన్ పాలనలో సామాజిక న్యాయం లేదు. సామాజిక అన్యాయం మాత్రమే ఉంది.నిధులు, పవర్ లేని పదవులు బీసీలకు ఇచ్చి ముఖ్యమైన పదవులు అన్ని జగన్ సొంత సామాజిక వర్గానికి ఇచ్చారు.బీసీ కార్పొరేషన్లు ఫుల్లు… నిధులు నిల్లు. కుర్చీలు లేని కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు జగన్.టిడిపి హయాంలో బీసీల కోసం చేసిన ఖర్చు…వైసిపి హయాంలో బిసి సంక్షేమం కోసం చేసిన ఖర్చు పై నేను చర్చకు సిద్దం.టిడిపి హయాంలో గొర్రెలు కొనడానికి రుణాలు ఇచ్చి ఇన్స్యూరెన్స్ కల్పించింది టిడిపి.వాల్మీకి లని ఎస్టీల్లో చేరుస్తామని హామీ మోసం చేశారు జగన్.

వాల్మీకి లని ఎస్టీల్లో చేర్చాలని పోరాడింది టిడిపి. సత్యపాల్ కమిటీ ఏర్పాటు వేసి రిపోర్ట్ తయారు చేయించింది టిడిపి.బీసీలని పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దే బాధ్యత నాది.టిడిపి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇండస్ట్రియల్ క్లస్టర్స్ లో బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి పరిశ్రమలు పెట్టుకోడానికి భూములు కేటాయిస్తాం. చేనేత కార్మికులు పడుతున్న సమస్యలు నాకు బాగా తెలుసు. నేతన్న నేస్తం ఒక పెద్ద మోసం. సొంత మగ్గం ఉంటేనే నేతన్న నేస్తం ఇస్తాం అంటున్నారు. 90 శాతం మందికి సొంత మగ్గాలు లేవు.యార్న్ సబ్సిడీ, పవర్ సబ్సిడీ ఎత్తేశారు. చేనేత కార్మికులు చనిపోతే వైసిపి ప్రభుత్వం కనీసం సహాయం చెయ్యలేదు.అప్కాబ్ ని రాజకీయ పునరావాస కేంద్రం గా మార్చేశారు. చేనేత కార్మికులకు అనేక సబ్సిడీలు ఇచ్చింది టిడిపి.జగన్ రద్దు చేసిన చేనేత సంక్షేమ కార్యక్రమాలు టిడిపి పాలన వచ్చిన వెంటనే పునరొద్దరిస్తాం.టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత చేనేత కార్మికుల పెట్టుబడి తగ్గిస్తాం. పవర్ సబ్సిడీ ఇస్తాం.మార్కెట్ కి లింక్ చేసి చేనేత కార్మికుల ఆదాయం పెంచుతాం.సెలూన్లకు చేయూత ఇస్తాం అని జగన్ మోసం చేశారు.ఒక్క ఓనర్ కి మాత్రమే ఇస్తున్నారు. అది కూడా పది శాతం ఇస్తున్నారు. కరెంట్ ఛార్జీలు పెంచి ఏడాదికి అదనంగా 20 వేలు లాగేస్తున్నాడు.

ఆదరణ పథకంలో పనిముట్లు ఇచ్చాం. ఆదరణ 2 లో వెయ్యి కోట్లు ఖర్చు చేసి పనిముట్లు కంటే జగన్ మీకు ఇవ్వకుండా వాటిని గోడౌన్ల లో పడేసి ఉంచారు. కనీసంకాంట్రాక్టు ఉద్యోగస్తుల రెగ్యులర్ చేస్తాం అని హామీ ఇచ్చి జగన్ మోసం చేశారు.వేట నిషేదం ఉన్న సమయంలో మత్స్యకారులకు ఆర్ధిక సహాయం చేసింది టిడిపి.అలాంటిది జగన్ మత్స్యకారులను దెబ్బతీసే విధంగా జీఓ లు తీసుకొచ్చి వేధిస్తున్నారు. పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యత టిడిపిది.చంద్రన్న భీమా ద్వారా ప్రమాదంలో చనిపోతే 5లక్షలు, సహజ మరణం8 అయితే 2 లక్షలు ఇచ్చే వాళ్ళం. జగన్ ఆ పథకాన్ని రద్దు చేశారు.వైఎస్ఆర్ భీమా ద్వారా నాలుగేళ్ల లో ఒక్కరికైనా భీమా వచ్చిందా?వడ్డెర్ల కు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టిడిపి. నిధులు కేటాయించింది టిడిపి. వడ్డెర్ల ను ఎసిల్లో చేర్చే అంశం పై మేము కమిటీ వేసాం. కేంద్రం లో పోరాడుతున్నాం.వడ్డెర సామాజిక వర్గం కి ఇచ్చిన హామీలు జగన్ మర్చిపోయారు. ఎస్సీల్లో చేరుస్తామని జగన్ ఇచ్చిన హామీ ఏమి అయ్యింది.వడ్డెర్ల కు గనులు కేటాయించింది టిడిపి. వాటిని లాక్కుంది వైసిపి నాయకులు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ క్వారీలు వడ్డెర్ల కు కేటాయిస్తాం. జగన్ ప్రభుత్వం లో బీసీల పై ఎస్సీ, ఎస్టీ కేసులు పెడుతున్నారు. దాడులు చేస్తున్నారు. బీసీలను కాపాడుకోవడానికి, రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా బీసీ రక్షణ చట్టం తీసుకొస్తాం.

LEAVE A RESPONSE