– అకాలవర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకునే వరకు ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం
• అకాలవర్షాలకంటే, జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యధోరణి, చేతగానితనమే ఉభయగోదావరి జిల్లాల్లోని రైతులతోపాటు, రాష్ట్రంలోని రైతుల్ని ముంచేసింది
• టీడీపీ అగ్రికల్చర్ స్టీరింగ్ కమిటీ నేత్రత్వంలో రైతుసంఘాలతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు జరిగిన నష్టం అంచనా వివరాల్నిసేకరించి, ప్రభుత్వం ముందు ఉంచుతాం
• ఈ ప్రభుత్వం రైతుల్ని ఆదుకొని వారికి న్యాయంచేయకుంటే టీడీపీప్రభుత్వం వచ్చాక న్యాయంచేస్తుంది
• రైతులకు జరిగిన నష్టం, వారిసమస్యలు తెలుసుకోవడానికి 11వతేదీన ఉభయగోదావరిజిల్లాల్లోని తెలుగుదేశం పార్టీ నాయకత్వం తాడేపల్లిగూడెంలో రైతులతో సమావేశం కానుంది
• 14వతేదీన నియోజకవర్గాల వారీగా రైతులకు జరిగినష్టం, ధాన్యంసేకరణలో ప్రభుత్వంఅనుసరిస్తున్నదోపిడీ విధానాల్ని టీడీపీ వ్యవసాయ స్టీరింగ్ కమిటీ తెలుసుకుంటుంది
• 16 వ తేదీ నుంచి 24వ తేదీ వరకు 250 నుంచి 300కుటుంబాలకు ఒక సమాచారసేకరణ కేంద్రం ఏర్పాటుచేసి, పంటషనష్టం వివరాలు సేకరిస్తుందని, 26వ తేదీన కలెక్టరేట్ల వద్ద రైతులతో కలిసి కార్యక్రమాలు చేపడతామని స్టీరింగ్ కమిటీసభ్యులు తెలిపారు
– తెలుగుదేశంపార్టీ అగ్రికల్చర్ స్టీరింగ్ కమిటీ సభ్యుల విలేకరుల సమావేశం
ధాన్యంకొనుగోళ్ల పేరుతో ప్రభుత్వం వేలకోట్లు దోచేసింది : సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
“ ఈప్రభుత్వం ఏవిధంగా రైతుల గొంతుకోస్తుందో రాష్ట్రప్రజలకు తెలియాలి. మాం డూస్ తుఫాన్ ప్రభావంతో ఏప్రియల్ , మేనెలల్లో ఉభయగోదావరి జిల్లాల్లోని రైతులకు తీవ్రమైన నష్టం వాటిల్లింది. కష్టాలపాలై నిండామునిగిన రైతుల్ని జగ న్మోహన్ రెడ్డిగానీ, ఆయన ప్రభుత్వంగానీ పట్టించుకోలేదు. వ్యవసాయమంత్రులు ఎవరూ రైతులముఖంకూడా చూడలేదు. రైతుఆత్మహత్యల్లో జనాభాపరంగా రాష్ట్రం తొలిస్థానంలోనిలవడానికి ప్రధానకారణం జగన్మోహన్ రెడ్డి నిర్లక్షవైఖరే.
ఇటీవల కురిసిన అకాలవర్షాలకు తడిచిన ధాన్యం మొత్తాన్ని రైతులవద్ద నుంచి గిట్టుబాటుధరకు తామే కొంటున్నట్టు ప్రభుత్వంచెప్పింది. తడిచిన, రంగుమారిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని టీడీపీ తొలినుంచి డిమాండ్ చేస్తోంది. ఉభయ గోదావరిజిల్లాల్లో ధాన్యంకొనుగోళ్లలో రైతులకు జరిగిన అన్యాయంపై తాముకూడా వివరాలు సేకరిస్తున్నాం. ధాన్యంకొనుగోళ్లముసుగులో ప్రభుత్వం రైతులనుంచి పదిశాతం అదనంగా ధాన్యాన్ని సేకరిస్తోంది. రైస్ మిల్లర్లు కూడా తడిచింది, రంగుమారిందనే వంకతో అదనంగా ధాన్యం సేకరిస్తోంది. అసలే తీవ్రంగా నష్టపోయిన రైతుల్ని ఈవిధంగా దోచుకోవడం చాలాచాలా దారుణం.
టీడీపీ స్టీరిం గ్ కమిటీసభ్యులు, రైతుకమిటీ విభాగాలు రైతులకు వాస్తవంగా జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలుసేకరించి కలెక్టర్లకు అందిస్తారు. దానిపై ప్రభుత్వం స్పం దించి, అన్నదాతలకు న్యాయం చేయాల్సిందే. చేసేవరకు ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. రైతులకురావాల్సిన దాన్ని ముక్కుపిండి అయినా వసూలుచేస్తాం. దగాపడినరైతులకు తమప్రభుత్వం వచ్చాక తప్పకుండా న్యాయం చేస్తుంది.
రబీ, ఖరీఫ్ సీజన్లకు కలిపి తెలంగాణప్రభుత్వం కోటి18లక్షలటన్నుల ధాన్యంసేకరణ చేపడితే, జగన్ ప్రభుత్వం మొత్తంకలిపి 49లక్షలటన్నులసేకరణకే పరిమితమైం ది. ఇది ఎంతదుర్మార్గమో ప్రత్యేకంగా చెప్పాలా? వ్యవసాయశాఖను మూసేసి, రైతులకోసం బటన్ నొక్కుతాను అని ముఖ్యమంత్రి చెప్పడం సిగ్గుచేటు. గిట్టుబా టుధర అనేది రైతులహక్కు. అదికేంద్రప్రభుత్వం కల్పించింది. దానిపై రాష్ట్రరైతాం గం వారిహక్కులకోసం పోరాడాలి.
కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైసెస్ (సీ.ఏ.సీ.పీ) విభాగం ఇచ్చిన మద్ధతు ధర కాకుండా రాష్ట్రంలోని ధాన్యంరైతులకు ఈ ప్రభుత్వం క్వింటాల్ కు రూ.213వ వరకు నష్టంచేకూరుస్తోంది అని చెప్పింది. సీ.ఏ.సీ.పీ విభాగం అలాచెబితే, స్వయంగా వైసీపీఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ క్వింటాల్ కు రూ.200వరకు దోచుకుంటున్నారనిచెప్పారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీప్రభుత్వం నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి.
ఈ నాలుగేళ్లలో ధాన్యంకొనుగోళ్లపేరుతో ఈ ప్రభుత్వం కొన్ని వేలకోట్లు కాజేసింది. గోనెసంచులపేరుతో, హామాలీలు, రవాణాపేరుతో కేంద్రప్రభు త్వం ఇచ్చిన సొమ్ముని ఎవరుమింగేశారో కూడా జగన్ ప్రభుత్వంసమాధానం చెప్పాలి. టీడీపీ స్టీరింగ్ కమిటీలు ధాన్యంకొనుగోళ్లపేరుతో రైతులవద్దనుంచి రైస్ మిల్లర్లు, దోచుకున్న అదనపుధాన్యం, అదనపుసొమ్ముని కూడా లెక్క తేలు స్తాయి. ఉదాహరణకు ఒకరైతు రూ.5వేలునష్టపోతే, ఆసొమ్ము ప్రభుత్వం చెల్లిం చాలని డిమాండ్ చేస్తున్నాం.
సజ్జల డైరెక్షన్ తోనే టీడీపీనేత ఆనం వెంకటరమణారెడ్డిపై వైసీపీ దుండగులు దాడి చేశారు. మా నాయకుడిని చంపడానికి దాడిచేసినవారిపై పోలీసులు అలాంటి తప్పుడు కేసులు పెడతారా? వెంకటరమణా రెడ్డిపై, బాలవీరాంజనేయస్వామిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ”
జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ధాన్యంసేకరణ విధానం రైతుల్ని అవమానించేలా ఉంది. : పత్తిపాటి పుల్లారావు
“ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరిస్తున్న ధాన్యంసేకరణ విధానం రైతుల్ని అవమానించేలా ఉంది. ఈ విధానాన్ని తెలుగుదేశం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ విధానంలోధాన్యంసేకరణ వల్ల రైతులకు ఎలాంటి న్యాయంజరగడంలేదు. జగన్ ప్రభుత్వం వచ్చాక రైతులకు ఒక్క పరికరంగానీ, ఇతరత్రాయంత్రాలు, ట్రాక్టర్లు గానీ ఇచ్చిందిలేదు. వ్యవసాయంలో యాంత్రీకరణకోసం కేంద్రప్రభుత్వమిచ్చిన నిధుల్ని జగన్ ప్రభుత్వంపూర్తిగా పక్కదారి పట్టించింది. పండించిన పంటఉత్ప త్తుల్ని అమ్ముకోవడానికికూడా రైతులు నానాయాతన పడుతున్నారు.
జగన్, అతనిప్రభుత్వం ముందస్తుచర్యలు తీసుకోనందునే రైతులపంటలు నీళ్ల పాలు అయ్యాయి. ప్రభుత్వం తక్షణమే ధాన్యంకొనుగోళ్లు చేపట్టాలని, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు న్యాయంచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు గారు 6 రోజులు ఉభయగోదావరిజిల్లాల్లో పర్యటించి, అక్కడేమకాంవేస్తే ప్రభుత్వం కాస్త కదిలింది. రైతులకు ఇప్పటికీపూర్తిస్థాయిలో న్యాయంజరగలేదు. ఉభయ గోదావరి జిల్లాల్లో 35లక్షలటన్నులధాన్యం పండితే, ఈప్రభుత్వం ఇప్పటికి రబీ లో కేవలం 14లక్షలటన్నులు మాత్రమే కొనడంజరిగింది. ఇంకా చాలాధాన్యం రైతులవద్దనే ఉంది. దానిగురించి ఈప్రభుత్వం ఆలోచించడంలేదు.
కొన్నధాన్యా నికి కూడా రైతులకు చెల్లించాల్సిన హామాలీఛార్జీలు, రవాణాఛార్జీలుచెల్లించలేదు. రైతులవద్ద ఒక్కగింజకూడా లేకుండా మొత్తంధాన్యం కొనాలన్నదే తమ డిమాండ్. రేపు టీడీపీప్రభుత్వం వచ్చాక ఉభయగోదావరి జిల్లాలరైతులకు తప్పకుండా న్యాయంచేస్తామని ఇప్పటికే చంద్రబాబుగారు హామీఇచ్చారు. 4 సంవత్సరాల్లో ధాన్యంసేకరణకు సంబంధించి, కేంద్రంనిర్ణయించిన రవాణాఖర్చు, హామాలీల కూలీ ఏదీకూడా జగన్ ప్రభుత్వం రైతులకుఇవ్వలేదు.
4ఏళ్లుగా కేంద్రంనుంచి వచ్చేసొమ్మంతా జగన్ జేబులోకి వెళ్తోందిగానీ, ప్రజలకు అందడంలేదు. ఇప్పటికై నా 4ఏళ్లుగా కేంద్రం రాష్ట్రంలోని రైతులకిచ్చిన సొమ్ముని పూర్తిగా వారికే చెల్లించా లని జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలానే చంద్రబాబు ఆదేశాల ప్రకారం టీడీపీ రైతువిభాగం రాష్ట్రఅధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ఉభయ గోదావరిజిల్లాల్లోని రైతుల్ని ఆదుకోవడంకోసం యాక్షన్ ప్లాన్ సిద్ధంచేశారు.”
టీడీపీ రైతు స్టీరింగ్ కమిటీ ఈనెల16 నుంచి 24వరకు గ్రామాలలో పర్యటించి రైతులతో మాట్లాడి, వారి కష్టాలు, బాధలు తెలుసుకొని, పంటనష్టం అంచనాలు తయారుచేస్తుంది. : మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి
“ రాష్ట్రంలో నడుస్తున్న రైతువ్యతిరేక ప్రభుత్వ విధానాలు, ముఖ్యమంత్రి దోపిడీ రైతులకు శాపంగామారిందనే చెప్పాలి. రైతులగురించి వ్యవసాయం గురించి ముఖ్యమంత్రి వీసమెత్తుకూడా ఆలోచించడంలేదు. ధవళేశ్వరం ప్రాజెక్ట్ పరిధిలో ముందస్తు రబీ సాగుకివెళ్లి ధాన్యంపండించిన రైతులు తీవ్రకష్టాలపాలయ్యారు. ఉభయగోదావరిజిల్లాల్లోని రైతాంగం మొత్తానికి పంటచేతికి అందేసమయంలో తీవ్రనష్టం వాటిల్లింది. ఇటీవల కురిసినఅకాలవర్షాలతో నష్టపోయిన రైతుల్ని ఆదుకోవడానికి చంద్రబాబుగారు ముందడుగు వేశారు.
దానికోసం పార్టీ శ్రేణుల్ని సన్నద్ధంచేశారు. వరిరైతులకు ఎకరాకు రూ.25వేలు, మొక్కజొన్నరైతులకు ఎకరాకు రూ.25వేలు, వాణిజ్యపంటలకు ఎకరాకు రూ.50పరిహారం ఇవ్వాలని ఇప్పటికే తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాం. మిరప, అరటి, ఇతర వాణిజ్య పంటలకు ఇప్పుడు ఇన్ పుట్ సబ్సిడీ వర్తించదు. నష్టపరిహారమే ఇవ్వాలి. కొన డానికి వీలులేని ధాన్యాన్ని ప్రభుత్వమేనేరుగాకొని ఎలాంటి నిబంధనలులేకుండా రైతులకు వెంటనే డబ్బులు ఇవ్వాలని కూడా టీడీపీ రైతువిభాగం తరుపున డిమాండ్ చేశాము.
రైతు వ్యతిరేకి, రైతుద్రోహి అయిన జగన్మోహన్ రెడ్డి పాలనలో ధాన్యంఅమ్ముకోవ డానికి రైతులే ముందుగా మిల్లర్లకు డబ్బులుచెల్లించాల్సిన దుస్థితి. 11వతేదీన తాడేపల్లిగూడెంలో ఉభయగోదావరి జిల్లాల్లోని టీడీపీ నాయకత్వం రైతులు, రైతు సంఘాలు, వాటినేతలతో సమావేశం నిర్వహించనుంది. 14వతేదీనుంచి నియోజకవర్గాలవారీగా రైతులకు జరిగినష్టం, ధాన్యంసేకరణలో ప్రభుత్వం అనుసరిస్తున్నదోపిడీ విధానాలపై వివరాలుసేకరిస్తాం.
ప్రధానంగా అన్ని గ్రామాలలో ప్రతిరైతుని కలిసి మాట్లాడతాం. 16 నుంచి 24వ తేదీవరకు అన్నిగ్రామాల్లో పర్యటించి 250 నుంచి 300కుటుంబాలకు ఒక సమాచారసేకరణ కేంద్రం ఏర్పాటుచేసి, వివరాలు సేకరిస్తాం. 26వ తేదీన కలెక్టరేట్ల వద్ద రైతులతో కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తాం. ధాన్యంసేకరణ ముసుగులో రైతులనుంచి రైస్ మిల్లులయాజమాన్యాలు అదనంగా సేకరించిన ధాన్యానికి డబ్బులు తిరిగిచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడితెస్తాం.
బాధ్యతలేని జగన్ ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ, రాబోయేకాలంలో రైతుకి కష్టమొస్తే తెలుగుదేశంపార్టీ ఏవిధంగా స్పందిస్తుందో తెలియచేసేలా, సమాంతరప్రభుత్వం నడుస్తుందా అనేలా టీడీపీ రైతు విభాగం పనిచేస్తుందని చెబుతున్నాం. ఈ ప్రభుత్వం రైతులపట్లచూపే నిర్దయ, నిర్దాక్షి ణ్యాలే భవిష్యత్ లో జగన్ కు బుద్ధిచెబుతాయి. టీడీపీప్రభుత్వం వచ్చిన వెంటనే అకాలవర్షాలకు నష్టపోయిన రైతుల్ని ఆదుకుంటుందని స్పష్టంచేస్తున్నాం.”
జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యధోరణి కౌలురైతులకు శాపంగామారింది. నష్టపోయిన రైతుల్నిఆదుకోవడానికి చంద్రబాబు ముందడుగు వేస్తే, జగన్ ఇప్పటికీ వారిముఖం చూడలేదు : నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
“ రాష్ట్రరైతాంగంపై జగన్మోహన్ రెడ్డి చూపుతున్న నిర్లక్ష్యధోరణి కౌలురైతులు పూ ర్తిగా వ్యవసాయానికి స్వస్తిపలకాలనే నిర్ణయానికి వచ్చేలాచేసింది. తేమశాతాన్ని ఆర్బీకే ల్లో పరిశీలించడం, రైస్ మిల్లులకు ధాన్యంవెళ్లాక బస్తాకు అదేతేమశాతం పేరుతో బస్తాకు రూ.200నుంచి రూ.400వరకు కోతపెట్టడం జరుగుతోంది. దీనివ ల్ల రైతులు తీవ్రంగా ఇబ్బందులుపడ్డారు. కౌలురైతులు ఇప్పటికే వ్యవసాయానికి స్వస్తిచెప్పి, ఉపాధికోసం హైదరాబాద్ వంటినగరాలకు వలసపోతున్నారు.
ఇటీ వల కురిసిన అకాలవర్షాలకంటే ప్రభుత్వనిర్లక్ష్యం వల్లే రైతులు ఎక్కువగా నష్టపోయారు. ప్రతిపక్షనేత రైతులవద్దకు వెళ్లి, వారితో మాట్లాడినా ముఖ్యమంత్రిలో నేటికీచలనంలేదు. మంత్రులేమో చుట్టపుచూపుగా రైతులవద్దకెళ్లి వచ్చేశారు. వ్యవసాయం గెలవాలి.. రైతు కలకాలం నిలవాలన్న లక్ష్యంతోనే చంద్రబాబుగారు టీడీపీ ఆధ్వర్యంలో స్టీరింగ్ కమిటీ వేశారు.
ఆ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటించి రైతులకు జరిగిననష్టం, వారికి ఎదురవుతున్న మోసాలను ప్రజలకు తెలియ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి నేడు రైతులకు న్యాయంచేయకుంటే, రేపు టీడీపీప్రభు త్వం వచ్చాక చంద్రబాబుగారు న్యాయంచేస్తారు. ఉభయగోదావరిజిల్లాల్లోని రైతు ల్ని ఆదుకోవడానికి ముందడుగువేసి, చొరవచూపిన చంద్రబాబుగారికి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాం.”
ధాన్యంకొనుగోళ్లకు సంబంధించి కేంద్రం రైతులకుచెల్లించమని ఇచ్చిన రవాణా, హమాలీఛార్జీలు వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం : కూన రవికుమార్
“రైతులకు చెల్లించాల్సిన సొమ్ము ఏమైందో పంట పండించడానికి అప్పులుచేయడం చూశాం..కానీ జగన్ పాలనలో పంట ఉత్ప త్తుల్ని అమ్ముకోవడానికి కూడా రైతులు అప్పులుచేయాల్సిన దుస్థితి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలప్రకారం ఆయారాష్ట్రప్రభుత్వాలే ధాన్యంసేకరణ చేయాలి. దాని ప్రకారం రాష్ట్రంలో కొనుగోలుచేసిన ధాన్యానికి కేంద్రమే రవాణా, హమాలీఛార్జీలు ప్రభు త్వానికి చెల్లిస్తుంది. ఆ విధంగా రైతులకు దక్కాల్సిన ఆసొమ్ముని జగన్ అతని బృందం ఈ నాలుగేళ్లలో దోచేసింది.
వ్యవసాయమంత్రికి బాధ్యతలేదా? రైతులు ధాన్యం పండించి, దాన్ని అమ్ముకోవడానికి నానాఅగచాట్లుపడుతుంటే, అతనికి ఇవ్వాల్సిన రవాణా, హమాలీఛార్జీలు ఎందుకుచెల్లించరు? దీనిపై వ్యవసా యమంత్రి సమాధానంచెప్పాలి. పౌరసరఫరాలశాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కారుకూతలకే పరిమితమయ్యాడు తప్ప, రైతులకు ఇవ్వాల్సిన దానిపై మాట్లాడడు.
కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన ధాన్యంకొనుగోళ్లతాలూకా రవాణా, హామాలీఛార్జీలు వెంటనే జగన్ రైతులకు చెల్లించాలి. గతంలో తుఫాన్లు వచ్చిన ప్పుడు టీడీపీప్రభుత్వం నేరుగా రైతులవద్దనుంచి ధాన్యంకొని, వారికి వెంటనే డబ్బులు చెల్లించింది. కానీ జగన్ ప్రభుత్వం 4ఏళ్లుగా రైతుల్ని దోచుకుంటూ, వారికివ్వాల్సిన సొమ్మును కూడా తానే తినేస్తున్నాడు.”