– జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు జడా శ్రావణ్ కుమార్
విజయవాడ : ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని, యువతకు ఉపాధి కల్పంచలేని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై త్వరలోనే గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని, జై భీమ్ భారత్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం ప్రతినిధులు ప్రకటించారు. “నిరుద్యోగ పోరు- బడ్జెట్ తీరు” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సమావేశంలో భాగంగా “గడప గడపకు దగా ప్రభుత్వం” పేరుతో మార్చి ఒకటో తేదీ నుంచి 56 పేజీలతో పుస్తకం అందరికీ అందిస్తామన్నారు. ఉద్యోగులకు జీతాలు, యువతకు ఉపాధి కల్పంచలేని ఈ ప్రభుత్వంపై ఫిర్యాదు చేస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని, యువతకు ఉపాధి కల్పించలేని, అమరావతిని రాజధానిగా నిర్మించలేని ఈ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై అతి త్వరలోనే రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని, జై భీమ్ భారత్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం ప్రతినిధులు ప్రకటించారు.
”గడపగడపకు దగా ప్రభుత్వం” పేరుతో మార్చి ఒకటోవ తేదీ నుంచి 56 పేజీలతో పుస్తకాన్ని అందరికీ అందిస్తామని తెలిపారు. ఆ పుస్తకంలో 1500 మందిపై ఈ ప్రభుత్వం వచ్చాక జరిగిన దాడుల వివరాలను పొందుపరిచామని పేర్కొన్నారు. విజయవాడలో జై భీమ్ భారత్ పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో ఈరోజు ”నిరుద్యోగ పోరు- బడ్జెట్ తీరు” అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు విద్యార్ధి సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధులతో పాటు రాజకీయ విశ్లేషకులు పాల్గొన్నారు.
జై భీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపకులు, ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ సమావేశానికి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపారు. ముఖ్యంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వం జనవరి 1న జాబ్ క్యాలెండర్ ఇస్తానని మోసం చేసిందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హామీ ప్రకారం 6 లక్షల 50 వేలు ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉండగా ఐదు వేల రూపాయల జీతంతో వాలంటీర్లను నెట్టుకొస్తున్నారని విమర్శించారు. బీటెక్, ఎంటెక్ చదివిన వాలంటీర్ల శ్రమను ఈ రాష్ట్ర ప్రభుత్వ దోపిడీ చేయిస్తోందని ఆగ్రహించారు.
సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి చిన్నాభిన్నమైందని, చివరకు ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సోమ్మును కూడా దొంగిలించే స్థాయికి రాష్ట్ర ప్రభుత్వం దిగజారిందని ఆరోపించారు. జనవరి 1వ తేదీన జాబ్ క్యాలండర్ ఇస్తానని మోసం చేశారని, జగన్ ఇచ్చిన హామీ ప్రకారం ఐదేళ్లలో 6 లక్షల 50 వేల ఉద్యోగాలు ఇవ్వాల్సి ఉందని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా, వ్యాపారం పరంగా అత్యంత అవకాశాలు ఉన్న రాష్ట్రం. కానీ, ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, యువతకు ఉపాధి కల్పించలేని పరిస్థితికి దిగజారింది. ఈ పరిస్థితికి కారణం ఎవరు?
కనీసం 40శాతం ఉద్యోగులు ప్రతి నెల 1వ తారీఖున జీతాలు పొందలేని పరిస్థితిలో ఉన్నారంటే చాలా బాధకరమని జైభీమ్ భారత్‌పార్టీ వ్యవస్థాపకులు జడా శ్రావణ్‌కుమార్ పేర్కొన్నారు. జగన్ సర్కార్ నిరుద్యోగుల విషయంలో అనుసరిస్తున్న విధానం, బడ్జెట్లో జరుపుతున్న కేటాయింపులపై రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, రానురాను పాలన గాడి తప్పిందని విమర్శించారు.
బడ్జెట్ సమావేశాలను దృష్టిలో ఉంచుకుని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల మెరుగుకు తగిన ఆలోచనలతో ప్రభుత్వం ముందడుగు వేసేలా ఒత్తిడి తేవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అనంతరం రాష్ట్ర మంత్రులకు పరిశ్రమలు తీసుకొద్దామనే ఆలోచనలు లేవని, రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చిన వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. అమరావతి నిర్మాణం కొనసాగి ఉంటే, మూడు లక్షల కోట్ల రూపాయలు ఆదాయం అమరావతే సృష్టించేదని, ఈ ఆదాయాన్ని కూడా జగన్ ప్రభుత్వం నేలపాలు చేసిందని అమరావతి రైతుల ప్రతినిధులు ఆవేదన చెందారు.