Suryaa.co.in

Andhra Pradesh

మార్చి 26 నుంచి విజయవాడ-షిర్డీ విమాన సర్వీసులు

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం(గన్నవరం) నుంచి షిర్డీకి మార్చి 26 నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ సర్వీసులను నడిపేందుకు ఇండిగో ఎయిర్‌లైన్స్‌ సంస్థ ముందుకు రావడంతోపాటు ప్రయాణ షెడ్యూల్‌ను కూడా ప్రకటించింది. 72 మంది ప్రయాణికుల సామర్థ్యం గల ATR 72-600 విమానం రోజూ మధ్యాహ్నం 12.25 గంటలకు గన్నవరంలో బయలుదేరి 3 గం.కు షిర్డీ చేరుకుంటుంది.

షిర్డీ నుంచి మరో విమానం మధ్యాహ్నం 2.20 గం.కు బయలుదేరి సాయంత్రం 4.35 గం.కు గన్నవరం చేరుతుంది. విజయవాడ నుంచి షిర్డీకి ప్రారంభ టిక్కెట్‌ ధర రూ 4,246, షిర్డీ నుంచి గన్నవరంకు రూ.4,639 గాను నిర్ణయించారు. ఇప్పటివరకు షిర్డీ వెళ్లేందుకు రైలు,రోడ్డు మార్గాల ద్వారా గంటల తరబడి ప్రయాణించే వారికి ఈ సర్వీస్‌ ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. విజయవాడ నుంచి షిర్డీకి సుమారు 2.50 గంటల ప్రయాణo.

LEAVE A RESPONSE