ప్రీతి మరణం అత్యంత బాధాకరం

– కేసీఆర్ పాలనలో ఆడ పిల్లల భవిష్యత్ కు గ్యారంటీ లేదు
-ప్రజాస్వామ్యవాదులారా…. మీ మౌనం సమాజానికే అరిష్టం
-ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్

ఎంతో భవిష్యత్ ఉన్న ప్రీతి చనిపోవడం నా మనసును తీవ్రంగా కలిచివేస్తోంది. ఇది ముమ్మాటికీ హత్యే. ఫిర్యాదు చేయగానే ప్రభుత్వం పట్టించుకోకపోవడంవల్లే ఈ దారుణం. మీరిచ్చే రూ.10 లక్షల సాయం… ఆ తల్లిదండ్రుల గుండెకోతను చల్లార్చుతాయా? ప్రీతి చావుకు కారకుడైన మనిషికి ఇన్నాళ్లు వకాల్తా పుచ్చుకోవడానికి సిగ్గులేదా? కేసీఆర్ పాలనలో రైతులు, కార్మికులు, ఉద్యోగులు, నిరుద్యోగులుసహా ఎంతో భవిష్యత్తు ఉన్న పసిపిల్లలు, విద్యార్థులు చనిపోవడం అత్యంత దుర్మార్గం.

ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలిపెట్ట ప్రసక్తే లేదు ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే. ప్రీతి మరణానికి కారకులైన దుర్మార్గులను శిక్షించే వరకు పోరాడతాం. మేధావులు, విద్యావేత్తలుసహా సభ్యసమాజం వెంటనే స్పందించాలి. భవిష్యత్తులో ప్రీతిలాంటి అమ్మాయిలకు ఈ దుస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది.

మెడికో స్టూడెంట్ ప్రీతి మరణ వార్త నుండి కోలుకోకముందే నర్సంపేటలో ఇంజనీరింగ్ విద్యార్థిని రక్షిత ర్యాగింగ్ కు బలికావడం తీవ్ర దిగ్బ్రాంతి కలిగిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఆడ పిల్లల భవిష్యత్ కు గ్యారంటీ లేదు. కేసీఆర్ కుటుంబ-అవినీతి-నియంత పాలనలో సామాన్యులు బతకలేని దుస్థితి.

ప్రజాస్వామ్యవాదులారా…. మీ మౌనం సమాజానికే అరిష్టం… ఇకనైనా నోరు విప్పండి. కేసీఆర్ పాలనలో ఎంతో భవిష్యత్ ఉన్న విద్యార్థులు కళ్లముందే చస్తున్నా స్పందించకపోవడం మానవత్వానికే కళంకం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావ్రుతం కాకూండా, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడాల్సిన అసవరం మనందరిపైనా ఉంది.

Leave a Reply