Suryaa.co.in

Telangana

కేసీఆర్ అవినీతిని మన ప్రభుత్వం వచ్చాక కక్కిస్తాం

– కెసిఆర్ ఆల్రెడీ ఓడిపోయాడు
– కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్

తెలంగాణలో కేసీఆర్ పనయిపోయిందని కేంద్రమంత్రి భూపేంద్రయాదవ్ అన్నారు. బండి సంజయ్ పాదయాత్రలో ప్రజలు నాడి తెలుస్తోందన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్ సంపాదించినదంతా కక్కిస్తామని చెప్పారు. భూపేంద్ర యాదవ్ ఏమన్నారంటే..

మోడీ పంపిస్తేనే ఇక్కడికి వచ్చాను. వివిధ సంక్షేమ కార్యక్రమాల కోసం కేంద్రం నుంచి వచ్చే నిధులు ఇక్కడ మీకు కేసీఆర్ అందించడం లేదని తెలిసింది. బండి సంజయ్ కి అందరం మద్దతు ఇస్తున్నాం. తెలంగాణ లో బీజేపీ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది… వచ్చాక కేంద్రం ఇచ్చే నిధులు నేరుగా మీకు చేరేలా చేస్తాం.

కేసీఆర్ అవినీతిని మన ప్రభుత్వం వచ్చాక కక్కిస్తాం. డబుల్ ఇంజిన్ సర్కార్ తెలంగాణ లో కూడా వస్తుంది.. అప్పుడు మరింత అభివృద్ధి జరుగుతుంది.

బండి సంజయ్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కెసిఆర్ ను ఓడించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు. పెన్షన్లు రావడంలేదని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వడం లేదని, పోలీసుల దౌర్జన్యం కొనసాగుతుందని చెబుతున్నారు. బండి సంజయ్ పాదయాత్రతో ప్రజల్లో మంచి జోష్ కనిపిస్తోంది.కెసిఆర్ ఆల్రెడీ ఓడిపోయాడు. తెలంగాణలో వచ్చేది బిజెపి ప్రభుత్వమే.

LEAVE A RESPONSE