టీడీపీ సభ్యత్వాలకు అనూహ్య స్పందన

– సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు సాయిబాబా

తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ్య స్పందన వస్తుందని సికింద్రాబాద్ పార్లమెంట్ అధ్యక్షులు పి.సాయిబాబా అన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో సభ్యత్వ నమోదు అవగాహన సదస్సు జరిగింది. కార్యక్రమానికి తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు బక్కని నరసింహులు, పొలిట్ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్ , పొలిట్ బ్యూరో సభ్యులు- గ్రేటర్ కన్వీనర్ అరవింద్ కుమార్ గౌడ్ ముఖ్య అతిధులుగా హజరయ్యారు.

ఈ సందర్బంగా నాయకులు మాట్లడుతూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పార్టీకి పునఃవైభవం కల్పించడానికి మంచి అవకాశంగా మార్చుకోవాలని కార్యకర్తలకు సూచించారు.

అనంతరం కార్యక్రమానికి తెలుగుదేశం రాష్ట్ర సాంకేతిక విభాగం (ఐటిడిపి) బృందం పాల్గొని సభ్యత్వ నమోదు కార్యక్రమ వివరాలపై కార్యక్తలకు శిక్షణ ఇచ్చారు. కార్యకర్తలకు తలెత్తిన సాంకేతిక సమస్యలను నివృత్తి చేసారు. అదేవిధఁగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సభ్యత్వ నమోదు
tdp-m కార్యక్రమం విజయవంతంగా సాగటానికి సమన్వయ కమిటీలను వేసి వారి పర్యవేక్షణలో అనుకున్న లక్ష్యాలను సాధించడానికి చర్యలు చేపట్టారు. ఇది దేశంలోనే మొదటి సారిగా తెలుగుదేశం పార్టీ పూర్తి ఆన్ లైన్ ద్వారా జరుగుతున్న సభ్యత్వ నమోదు కార్యక్రమం అని అన్నారు.

కార్యక్రమంలో వర్కింగ్ ప్రసిడెంట్ నల్లెల్ల కిషోర్, ప్రధాన కార్యదర్శి పి.బాలరాజ్ గౌడ్, సెంట్రల్ పార్టీ అధికార ప్రతినిధి జ్యోత్న్స, రాష్ట్రప్రధాన కార్యదర్శులు రాజు నాయక్ జివిజి నాయుడు, ఆరీఫ్, రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పెద్దోజు రవీంద్రాచారి, రాష్ట్ర బిసి అధ్యక్షులు శ్రీపతి సతీష్, రాష్ట్ర కార్యదర్శిఅంజాద్అలి ఖాన్, అన్నపూర్ణ, ఇన్చార్జులు శ్రీనివాస్ నాయుడు, వల్లారపు శ్రీనివాస్, ఐటిడిపి రాష్ట్ర అధ్యక్షులు హరికృష్ణ, రామేశ్వర్ రావు, ఆర్.భాస్కర్, కట్టరాములు, జి.యాదగిరి రావు, ఎం.రాజు, శాంతి, అన్నమ్మ, ఓ.వెంకటేష్, జివి. కృష్ణ, ఎన్.శ్రీనివాస్, శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ యాదవ్, యాదగిరి, శ్రీనివాస్ నాయి, సిహెచ్.ప్రదీప్ గౌడ్, అనిల్ కురుమ, ఎన్.అనిల్, గరిగే ప్రవీణ్, డి.చంద్రమోహన్, ఎస్.ఎం. లయూఖ్, నాథన్, జోగింధర్ సింగ్, లక్ష్మణ్ ముదిరాజ్, ఇక్బాల్ జాకీ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply