Suryaa.co.in

Features

లక్షల మంది హిందూ బౌద్ధులను చంపిన కమ్యూనిస్టు పోల్ పాట్!

కాంబోడియా ఒకప్పుడు హైందవ దేశం. ప్రస్తుతం బౌధ్ద దేశంగా మారింది అయినా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ హైంధవ ధర్మాన్ని ఆచరించే హిందువులు వున్నారు. ఈ దేశం పురాతన పేరు కాంభోజ్య రాజ్యం, కంపూచియ. పోల్ పాట్ కాంబోడియా దేశ నియంత. 1976 నుంచి 1979 వరకు పాలించిన కరుడు కట్టిన కమ్యూనిస్టు ఉన్మాది, నరరూప రాక్షసుడు. వీడు కంబోడియా దేశంలో వున్న దాదాపు 25 %శాతం మంది అమాయక ప్రజలను చంపించాడు.

వారిలో ఎక్కువ మంది బౌధ్ద దర్మ ప్రచారం చేసే సన్యాసులు ఉపాధ్యాయులు బౌధ్ద ధర్మానికి సంబంధించిన సాధువులు ఆచార్యులు. కాంబోడియా సాంప్రదాయ సంగీత సాహిత్య నృత్య కళాకారులు మరియు హైంధవ దేవాలయాల పూజారులను చంపి కాంబోడియా దేశంలో ఉన్న పురాతన బౌధ్ద హిందూ దేవాలయాలు మరియు బౌధ్ద పాఠశాలు నేలమట్టం చేపించేవాడు. ఇప్పుడు కేవలం 50 %బౌధ్ద హిందూ దేవాలయాలు వున్నాయి. ఇంకా వీడు అభివృద్ధి అని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన అత్యంత అధ్బుతమైన శిల్ప కళా సంపద ఉన్న పురాతన బౌధ్ద హిందూ దేవాలయాలను కూల్చివేసి ఆ శిధిలాలతో రోడ్లు నిర్మాణం చేసాడు. (చాలా సంవత్సరాల క్రితం జాగృతి తెలుగు పత్రికలో వచ్చిన వ్యాసం ఆధారం నా మదిలో గుర్తు వున్నంత వరకు) ఇప్పుడు వీకీపిడియలో ఇలాంటి విషయాలు చాలా వరకు తొలగించారు.

భారత దేశంలో కూడా కమ్యూనిస్టు ఉన్మాదులు స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ముస్లిం మతోన్మాదులతో క్రిస్టియన్ మతోన్మాదులతో కలసి హైంధవ ధర్మాన్ని నాశనం చేసేందుకు తీవ్రంగా పని చేస్తున్నారు. మానవ అస్థిపంజరాలు బౌధ్ద సాధువులు హిందూ పూజారులు ఉపాధ్యాయులవి. కానీ ప్రపంచ మీడియా మాత్రం చనిపోయిన వారి మతం వివరాలు ఏరోజూ ఇవ్వలేదు.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
(అఖిల భారత ఓసి సంఘం జాతీయ అధ్యక్షుడు)

LEAVE A RESPONSE