రాబోయే ఎన్నికలు చాలా కీలకంగా మారతాయంటున్నారు వైసీపీ నేతలు. మ్యానిపెస్టోలో చెప్పిన హామీలను 95శాతం అమలు చేసిన సీఎం జగన్ మాత్రమే అన్నారు మంత్రి జోగి రమేష్. రేపటి ఎన్నికల్లో మన యుద్ధం చంద్రబాబు ఒక్కడితోనే కాదు. దత్త పుత్రుడు, ఎల్లో మీడియాతో కూడా యుద్థం చేయాలి. జగన్ మోహన్ రెడ్డి పై రోజూ విషం కక్కుతున్నారు. జిల్లాల పర్యటనలో ప్రజలకు ఏం చెబుతావు చంద్రబాబు ? 14 ఏళ్లు సీఎంగా చేసి ప్రజల కోసం ఒక్క మంచి పథకమైనా పెట్టావా అని ప్రశ్నించారు.
సామాజిక న్యాయంలో మాతో పోటీ పడగల సత్తా చంద్రబాబుకి ఉందా? మహానాడులో సామాజిక న్యాయంపై చంద్రబాబు ఒక్క తీర్మానమైనా చేయగలిగాడా? ఎంతమంది కలిసి వచ్చినా జగన్ మోహన్ రెడ్డిని ఇంచు కూడా కదల్చలేరు. రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకి కుమ్ముడే కుమ్ముడు. 2024లో చరిత్ర సృష్టించబోతున్నాం. 151 పైచిలుకు స్థానాల్లో గెలవబోతున్నాం. ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ కార్యకర్తల్లో 2019 కి ముందు ఎలాంటి ఉత్సాహం ఉందో నేటికీ అదే ఉత్సాహం ఉందన్నారు.
మచిలీపట్నంలో మెడికల్ కళాశాల పెట్టాలన్న ఆలోచన గతంలో ఎవరికీ రాలేదు. మేం అడగగానే మచిలీపట్నానికి మెడికల్ కాలేజ్ ఇచ్చిన గొప్ప సీఎం జగన్ అని కొనియాడారు. బందరు పోర్టుకు లీగల్ సమస్యలు తప్ప మరే ఇబ్బందీ లేదు. టెండర్లు కూడా రెడీ అయ్యాయి. త్వరలోనే బందరు పోర్టు నిర్మాణం ప్రారంభమవుతుంది. వైసీపీకి ఆయువు పట్టు కార్యకర్తలే అన్నారు బాలశౌరి.