Suryaa.co.in

Andhra Pradesh

ఐఐటీ నిపుణులతో చర్చించి నగరాభివృద్ధి చేస్తాం

ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో పర్యటించిన ఎంపీ శివనాథ్, ఎమ్మెల్యే గద్దె

ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలోని అవసరమైన సౌకర్యాలతో పాటుగా నగరంలోని సమస్యలను పరిష్కరించడానికి ఐఐటీ నిపుణులతో చర్చించి పరిష్కరిస్తామని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్లు అన్నారు.

ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఎం.పి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్లు పర్యటించి కళాశాల సిబ్బంది, పాలిటెక్నిక్ వాకర్స్ సభ్యులను అడిగి అక్కడ ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాకర్స్ అసోసియేషన్ సభ్యులు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామమోహన్ ను సత్కరించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ అమరావతి పరిధిలో క్రీడలను ఏవిధంగా అభివృద్ధి చేయాలని తమ ప్రభుత్వం చూస్తోందన్నారు. వాకర్స్ సంఘాలకు ఏవిధంగా అవకాశాలు కల్పించాలనే ఆలోచనలు చేస్తున్నామన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాధ్ ఏకగ్రీవంగా ఎన్నికైవడం చాలా ఆనందంగా ఉందని, ఆయనకు అభినందనలు తెలిపారు. ఎంపీ ద్వారా మన ప్రాంతంలో క్రీడలను ఎంతగానే అభివృద్ధి చేసుకోవచ్చునని చెప్పారు.

క్రీడలను అభివృద్ధి చేయడానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, అందుకు ఇలాంటి పదవులు ఎంతగానో దోహదం చేస్తాయన్నారు. నగరంలో టాఫ్రిక్ సమస్యను పరిష్కరించడానికి రామవరప్పాడు నుంచి నిడమానురు వరకు ప్లైవోవర్ నిర్మాణం చేస్తున్నామని చెప్పారు. నిత్యం అభివృద్ధి పనులు జరుగుతూనే ఉంటాయన్నారు. కొండ పై నుంచి నీరు కింద ప్రాంతాల్లోకి వచ్చి ఇబ్బందిగా ఉంటుందని అలాగే నగరంలో డ్రైనేజీ, వర్షం నీరు నిల్వ ఉంటున్నాయని స్థానికులు తమకు చెప్పారని, వీటిపై తమ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ద చూపి పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటుందని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి అయినా నగరంలో డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు.

ప్రత్యేకంగా ఒక ఐఐటీ నిపుణుడితో ప్లాన్ రూపొందించి నగరంలో డ్రైనేజీ సమస్యతో పాటుగా రోడ్లపై వర్షం నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నియోజకవర్గంలోని డ్రైనేజీ సమస్యలను పరిష్కరించడానికే తామిచ్చే నిధులను వినియోగించాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెబుతోందన్నారు. పాలిటెక్నిక్ కళాశాలలోని ప్రాధమిక సౌకర్యాలు కల్పించడానికి తాను కృషి చేస్తానని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హామీ ఇచ్చారు.

ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలోనే ప్రభుత్వ పాలిటెక్నిక్ అసోసియేషన్ వారితో నగరంలోని సమస్యలతో పాటుగా అభివృద్ధిపై చర్చించామని, ఎంతో విలువైన సూచనలు చేశారన్నారు. అందరి సహాకారంతోనే కూటమి ప్రభుత్వం అత్యధిక మెజార్టీతో విజయం సాధించామని చెప్పారు. నారా చంద్రబాబునాయుడినిపై ఎన్నో ఆశలు పెట్టుకుని అత్యధిక మెజార్టీతో టీడీపీ అభ్యర్థులను గెలిపించారని చెప్పారు.

కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ముందుండి రప్పించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఎమ్మెల్యే గద్దె రామమోహన్ నిత్యం ప్రజల మధ్యనే ఉంటారని అదే విధంగా ఆయనకు తోడుగా తాను కూడా నిత్యం ప్రజల మధ్యనే ఉంటామన్నారు. గద్దె రామమోహన్ ఎంపీగా ఉన్న సమయంలో దేశ రాజకీయాల్లో టీడీపీ చాలా ప్రధాన ప్రాత పోషించిందని, అది తెలుగు ప్రజల అదృష్టమని అన్నారు. ఇప్పుడు కూడా కేంద్రంలో టీడీపీకి అధికప్రాధాన్యత ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ సహాకారంతో రాష్ట్రానికి రావాల్సిన నిధులను తెప్పించడమే కాకుండా ప్రజలందరికి అండగా ఉంటానని చెప్పారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు చెన్నుపాటి ఉషారాణి, జాస్తి సాంబశివరావు, సురపనేని శివనాగేశ్వరరావు, గుత్తికొండ సతీష్, కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు, విష్ణు, రాజా, ధూళిపాళ్ళ రమేష్, మల్లెల రామకృష్ణ, ఎర్నేని వేదవ్యాస్, వాసిరెడ్డి లక్ష్మణరావు, కాటంరాజు, పడాల గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE