– బీజేపీ చీఫ్ మాధవ్
గుంటూరు: ఇక్కడి గుంటూరు లోని అరండల్ పేటలోని పుండరీ కాంక్షయ్య పార్క్ దగ్గర లోని ఒక హోటల్ వద్ద మంగళవారం ఛాయ్ పై చర్చ కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా మాధవ్ మాట్లాడుతూ గుంటూరులోని జిన్నా టవర్ లా అనేక ప్రాంతాలో బ్రిటీష్ పాలకుల హయాంలో పెట్టిన పేర్లు భారత మూలాలు ఉండేలా మారుస్తామని అన్నారు. వైజాగ్ లోని కింగ్ జార్జ్ పేరు కూడా అలాంటిదే అన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలు పరిరక్షేంచేలా తమ కార్యాచరణ ఉంటుంది అన్నారు. గుంటూరు సహజ సిద్ధంగా తయారు అయిన నగరం అన్నారు. మిర్చి యార్డ్ అభివృధి కి కృషి చేస్తాం అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసమే భారతీయ జనతా పార్టీ ఉందన్నారు. ప్రపంచంలో ఏ నేత ఆలోచించిన విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారన్నారు. ప్రధానమంత్రిని ఆదర్శంగా తీసుకొని ఈ చాయ్ పై చర్చ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు. ఒక సర్వ సాధారణమైన వ్యక్తి దేశానికి ప్రధానమంత్రి అయితే ప్రజల కష్టాలు తెలుసుకొని అందుకు అనుగుణంగా వారి జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు నిర్విరామం కృషి చేస్తారు అనేది మోడీ పాలన లో రుజువు అయ్యిందన్నారు.
ఆదర్శవంతమైన కాలనీలు తయారు కావలసిన అవసరం ఉందని మోడీ గారి ఆలోచనతో మోడీ కాలనీ తయారు చేయడం జరిగింది అన్నారు. ఆ కాలనీలో సీసీ కెమెరాలు, చక్కటి పారిశుధ్యం, లైటింగ్ వంటివి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
అమృతకాలంలో దేశంలోని బానిస చిహ్నాలు ఏమున్నాయో వాటిని మార్చాల్సిన అవసరం ఉంది. గుంటూరులో జిన్నా టవర్స్ పేరును కూడా మార్చుతామన్నారు. మతం అనేది ఎవరి ఇష్టం వాళ్ళదే… నేను జైశ్రీరామ్ అంటాను. మిగతావాళ్లు వాళ్ళ మతాన్ని స్మరించుకోవాలి. దాన్ని అందరూ గౌరవించాలి అన్నారు. విజయవాడ, గుంటూరు నగరాలు ప్రజలు ఏర్పరచుకున్న నగరాలు. వాటి ఎంతటి అవి ఏర్పడలేదు అన్నారు. గుంటూరు అభివృద్ధి కోసం కృషి చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమానికి భారీగా స్థానిక ప్రజలు హాజరై తమ సమస్యలను బీజేపీ అధ్యక్షుడు మాధవ్ కు వివరించారు.