Home » ప్రభుత్వం కావాలనే ఉద్యోగులను రెచ్చగొడుతుంది

ప్రభుత్వం కావాలనే ఉద్యోగులను రెచ్చగొడుతుంది

– స్పష్టత లేని సమావేశాలతో ప్రభుత్వం కాలయాపన చేస్తుంది…ఇది ప్రభుత్వానికే నష్టం
-సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం విసృతం, ఉదృతం చేస్తాం..
– బొప్పరాజు వెంకటేశ్వర్లు

సోమవారం సచివాలయంలో ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి ని కలిసి ఏపీజేఏసీ అమరావతి రాష్ట్రకమిటి బృందం సోమవారం ప్రకటించిన మూడవ దశ ఉద్యమ కార్యాచరణకు సంబందించిన నోటీసును అందజేస్తూ, ప్రభుత్వం ఇప్పటికైనా ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించే దిశగా చిత్తశుద్ధితో చర్యలు చేపట్టేలా చూడాలని కోరారు.

సచివాలయం లో ప్రభుత్వ ప్రధానకార్యదర్శిని కలసి అనంతరం మీడియాతో మాట్లాడుతూ… ఇప్పటికే రోజుల 53 రోజులుగా ఉద్యోగం చేస్తూ ఉన్న ప్రభుత్వము సానుకూల దృక్పథంతో ముందుకు రాకపోగా, స్పష్టత లేని అనధికారిక సమావేశాలు నిర్వహిస్తూ ఉద్యోగులను అయోమయం లోకి నెట్టడానికి ప్రయత్నిస్తున్నదని తెలియచేశారు.

ఉద్యోగుల ఆర్దికపరమైన అంశాలపై రక రకాలుగా లీకులు ఇచ్చి ప్రతి పండగ సందర్భాలలోనూ DA ఇస్తున్నట్లు బ్రమలు కల్పిస్తున్నారు. అదేవిధంగా ఉద్యోగులను రెచ్చ గొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని దీనిని బట్టి ప్రభుత్వమే కావాలని ఈ ఉద్యమాన్ని కొనసాగేలా చూడాలని భావిస్తున్నట్లు అనిపిస్తుందని బొప్పరాజు అనుమానం వ్యక్తం చేశారు.

అదే విధంగా ఎపి జెఏసి అమరావతి ఉద్యమ కార్యాచణను కు దిగే ముందు సమర్పించిన 50 పేజీల డిమాండ్ లలో ప్రధానంగా ఆర్ధిక పరమైన అంశాలపై 27.3.2023 న జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో మౌఖికంగా ఒప్పుకున్న ఈ క్రింది అంశాలు ఉత్తర్వుల రూపంలో వెంటనే ఇవ్వాలని, అలాగే మా డిమాండ్స్ లో పొందుపరచిన అర్దికేతర అంశాలపై తక్షణమే పరిష్కరిస్తే, అప్పుడు మాత్రమే మా ఉద్యమ కార్యాచరణపై ఆలోచన చేస్తామని ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కి స్పష్టంగా తెలియచేసామని చెప్పారు.

27-4-23న మంత్రివర్గ ఉపసంఘం తో జరిపిన చర్చల్లో సానుకూలంగా స్పందించిన అంశాలు
1)1.7.2018 మరియు 1.1.2019 ల డి ఎ ఎరియర్స్ కు సంబందించి ops ఉద్యోగులకు GPF ఖాతాలో, CPS మరియు విశ్రాంత ఉద్యోగులకు కలిపి 1800 కోట్ల రూపాయలు నగదు రూపంలో సెప్టెంబర్ లోగా చెల్లింస్తామని..
2) సరెండర్ లీవులు 1653 కోట్లు జూన్/సెప్టెంబర్ లోగా చెల్లిస్తామని..
3) పిఆర్సి సిఫారసు చేసిన విధంగా పే స్కేల్స్ పై నిర్ణయం తీసుకుంటామని…
4) పి.ఆర్.సి ఎరియర్స్ నుండి 1.7.2019 & 1.7.2021 DA ఎరియర్స్ను విడదీసి వాటిని కూడా చెల్లించేందుకు చర్చించి ప్రణాళిక సిద్ధం చేస్తామని తెలిపారని….
5) PRC సిఫారసు చేసిన స్పెషల్ పేలు యధాతధంగా గా ఇవ్వాలని..
6) గురుకులాలు, పబ్లిక్ సెక్టార్ మరియు యూనివర్సిటీలకు నాన్ టీచింగ్ ఉద్యోగులకు పదవి విరమణ వయస్సు 62 సంవత్సరాలకు పెంచుతామని…
7) కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని…
8) మిగిలిపోయిన 8 కొత్త జిల్లాల జిల్లా ప్రధాన కేంద్రాలలో HRA 16% నికి పెంచుతామని..
9) 12వ పిఆర్సి కమిషన్ ని నియమిస్తామని ..
10) ఈ హెచ్ ఎస్ కార్డులు వెంటనే పూర్తిస్థాయిలో అమలు చేయాలని..
11) విడుదల చేయాల్సిన పెండింగ్ డి ఏ లలో ఒక DA తక్షణమే విడుదల చేస్తామని….
పైన తెలిపిన మంత్రివర్గ ఉపసంఘం జరిగిన అన్నిటీపై లిఖిత పూర్వకంగా ఉత్తర్వులు ఇవ్వాలని, అలాగే అర్షికేతర అంశాలపై కూడా తక్షణమే CS సమావేశం నిర్వహించాలని కోరడమైనది.
ఫణి పేర్రాజు మాట్లాడుతూ ప్రభుత్వం జీతాలు / పెన్షన్ లు సమయానికి ఇవ్వడానికి ప్రత్నిచడం లేదు కానీ ధర్నాలకు వెళ్లకుండా గ్రామ వార్డు సచివాలయంలో ఉద్యోగుల్ని ఆపడానికి చాలా కష్టపడుతుందని ఆరోపించారు.
వి.వి. మురళీకృష్ణ నాయుడు మాట్లాడుతూ మా సమస్యల పరిష్కారమయ్యే వరకు ఉద్యమం విసృతం చేస్తామని , అవసరమైతే మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని స్తంభింపజేసే స్థాయి వరకు ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు..
ఈ కార్య్రమానికి రాష్ట్ర కోచేర్మన్లు సంసాని శ్రీనివాసరావు ఎస్ మల్లేశ్వరరావు రాష్ట్ర కార్యదర్శిలు సాంబశివరావు, జ్యోతి, రత్నకుమారి, కుమార్ రెడ్డి కృషా జిల్లా అధ్యక్షుడు ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి వై సత్యనారాయణ ఎపి రెవెన్యూ సర్వీస్ అసోసియేషన్ నాయకులు వెంకట రాజేష్, శ్రీనివాసరావు,బి.రామకృష్ణ తదితరులు హాజరయ్యారు.

Leave a Reply