Suryaa.co.in

Telangana

కేసీఆర్, మోదీలా మేం బూటకపు హామీలు ఇవ్వం

-కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేయండి
-ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే

కల్వకుర్తి : మిగులు బడ్జెట్ తో ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల కుప్పగా మార్చారు. తెలంగాణకు 5లక్షల 70వేల కోట్ల అప్పు మిగిల్చారు. రాష్ట్రంలో కేసీఆర్ ఒక్కొక్కరిపై 1లక్ష 40 వేల అప్పు మోపారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యాన్ని ఏర్పాటు చేసి తీరుతాం. కేసీఆర్… ఇందిరమ్మను, సోనియమ్మను, రాహుల్ గాంధీని విమర్శిస్తున్నారు. దేశంలో పేదరికాన్ని నిర్మూలించిన ఘనత ఇందిరమ్మది.బ్యాంకుల జాతీయకరణ చేసిన ఘనత ఇందిరమ్మది ఆనాడు పేదలకు భూములు పంచి వారికి అండగా నిలిచింది ఇందిరమ్మ.

కాంగ్రెస్ పాలనలోనే పేదలకు సంక్షేమం అందింది.ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు మేలు జరుగుతుంది.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం.చేయూత పథకం ద్వారా రూ. 4వేలు పెన్షన్ అందిస్తాం.ఆరోగ్యశ్రీ ద్వారా రూ.10లక్షల వరకు పేదలకు ఉచిత వైద్యం అందిస్తాం.ప్రతీ ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తాం.కేసీఆర్, మోదీలా మేం బూటకపు హామీలు ఇవ్వం.కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారేంటీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతుంది. కాంగ్రెస్ గెలుపును ఆపేందుకు బీజేపీ, బీఆరెస్ కలిసి కుట్రలు చేస్తున్నాయి. కాంగ్రెస్ ను గెలిపించండి… కేసీఆర్ అవినీతి పాలనను అంతం చేయండి.

LEAVE A RESPONSE