– ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య
జగ్గయ్యపేట: రావిరాల గ్రామానికి . కనుచూపుమేరలో నీళ్లు ఉన్నప్పటికీ త్రాగటానికి నోచుకోని గ్రామప్రజల కోసం శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ప్రత్యేక శ్రద్ధ తీసుకొని గ్రామానికి మంచినీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో RWS అధికారులు మరియు గ్రామస్తులతో కలిసి కృష్ణానది లోపల సరైన ప్రదేశం కోసం పరిశీలించి దానికి సంబంధించిన అంచనాలను తయారు చేసి ఇవ్వవలసిందిగా శాఖ వారిని ఆదేశించారు. రావిరాల గ్రామంతో పాటు జయంతిపురం, చిల్లకల్లు గ్రామాలకు కూడా దాన్ని విస్తరణ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయమని, అందుబాటులో ఉన్న నిధులతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మంజూరు చేయించి గ్రామాలకు నీటిని అందిస్తానని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.