Suryaa.co.in

Telangana

మూసీ పరివాహక ప్రాంతాల్లో నిద్ర చేస్తాం

– పేద ప్రజలకు భరోసా కల్పిస్తాం
– నవంబర్ 16వ తేదీ సా. 4 గం.ల నుంచి 17వ తేదీ ఉ. 9 గం.ల వరకు బస్తీవాసులతో మమేకమై, అక్కడే నిద్ర
బిజెపి తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు

హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ ప్రక్షాళన పేరుతో పేదల ఇండ్లు కూల్చివేయడాన్ని వ్యతిరేకిస్తున్నం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన సవాల్ ను స్వీకరిస్తున్నాం. ఉద్యమ రీతిలో మూసీ పరివాహక ప్రాంతాల్లో పేద ప్రజల ఇండ్లలోనే బిజెపి నాయకుల బృందమంతా నిద్రచేస్తం.. వారికి భరోసా కల్పిస్తం.

నవంబర్ 16వ తేదీ సా. 4 గం.ల నుంచి 17వ తేదీ ఉ. 9 గం.ల వరకు బస్తీవాసులతో మమేకమై, అక్కడే నిద్రచేసి పేద ప్రజలకు భరోసా కల్పిస్తాం. మూసీ పరివాహక ప్రాంతాల్లోని సుమారు 20 బస్తీల్లో 20 మంది బిజెపి ముఖ్య నాయకులతో బస్తీనిద్ర చేసే కార్యక్రమం చేపడుతున్నాం..
ఈ బస్తీ నిద్ర కార్యక్రమంలో కార్పొరేటర్లు, స్థానిక నాయకులు 8 జిల్లాలకు సంబంధించి బిజెపి జిల్లా అధ్యక్షులు పాల్గొంటారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మూసీ పరివాహక ప్రాంతాల్లో పేద ప్రజల ఇండ్లను కూల్చనివ్వం. మూసీ సుందరీకరణ-పునరుజ్జీవం విషయంలో సమగ్రమైన నివేదిక బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.

బస్తీ నిద్ర కార్యక్రమంలో పాల్గొనే ముఖ్య నాయకులు – ప్రాంతాల వివరాలు:

అంబర్ పేట్ (తులసీరామ్ నగర్ ) -కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు – జి.కిషన్ రెడ్డి , అంబర్ పేట్ (కమలానగర్) -మాజీ శాసనసభ్యులు చింతల రామచంద్రారెడ్డి , అంబర్ పేట్ (శాస్త్రినగర్) -మాజీ ఎమ్మెల్యే కె.ఎస్ రత్నం , అంబర్ పేట్ (అంబేద్కర్ నగర్) -మాజీ మంత్రి కృష్ణ యాదవ్, కార్వాన్ అసెంబ్లీ నియోజకవర్గం లంగర్ హౌస్ – డి. ప్రదీప్ కుమార్ , కార్వాన్ డివిజన్ -తల్లోజు ఆచారి , జియాగూడ -యెండల లక్ష్మీనారాయణ , బహదూర్ పురా- ధర్మారావు , ఓల్డ్ మలక్ పేట్ (శాలివాహన్ నగర్) -రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ , గోషామహల్ నియోజకవర్గం అఫ్జల్ గంజ్ లోని రెసిడెన్షియల్ హౌసింగ్ బస్తీ -బీబీ పాటిల్ , జుమ్మెరాత్ బజార్ -సీతారాం నాయక్ , జౌలిగౌడ -ఎమ్మెల్యే వెంకటరమణా రెడ్డి , హైదర్ గూడ (బహదూర్ పురా) – మాజీ ఎమ్మెల్సీ జనార్ధన్ రెడ్డి , రాజేంద్రనగర్ (అత్తాపూర్) -బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి , రాజేంద్రనగర్ (హైదర్ షాకోట్) – పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి , ఉప్పల్ (రామంతాపూర్) – మాజీ శాసనసభ్యులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ , ఎల్బీనగర్ (ద్వారకాపురం కాలనీ, గణేష్ నగర్) -పార్లమెంటు సభ్యులు ఈటల రాజేందర్ , ఎల్బీనర్ (సత్యనగర్, న్యూ మారుతీనగర్) మాజీ ఎంపీ చాడ సురేష్ రెడ్డి , మేడ్చల్ రూరల్ (ఘట్ కేసర్) – మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్ రావు .

LEAVE A RESPONSE