Suryaa.co.in

Telangana

వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ముస్లిం సమాజానికి వ్యతిరేకం కాదు

– సుప్రీంకోర్టు కంటే మించి వక్ఫ్ బోర్డుకు ఎక్కువ అధికారాలు
– ప్రజాస్వామ్య దేశంలో అత్యుత్తమైన వ్యవస్థ సుప్రీంకోర్టు
– ముస్లిం దేశాల్లో కూడా ఈ యాక్డు ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది
– ఔరంగజేబు మాదిరిగా దాడి చేసి భూములు ఆక్రమిస్తున్నరు
– ఈ యాక్డులో ముస్లిం మహిళలకు కూడా హక్కు కల్పించిన్రు
– రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు బోర్డులో ఒక్కరు కూడా బీసీలు, దళితులు లేరు
– వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పార్లమెంటులో పాస్ అవుతుంది
– చేవెళ్ల బిజెపి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి

హైదరాబాద్: ప్రజాస్వామ్య దేశంలో అత్యుత్తమైన వ్యవస్థ సుప్రీంకోర్టు. ఎవ్వరైనా సుప్రీంకోర్టు ఆదేశాలు పాటించాల్సిందే. కానీ, మన దేశంలో కొంతమంది నాయకులు చేతిలో రాజ్యాంగం పుస్తకం పుట్టుకుని మరీ ప్రజలను మోసం చేస్తున్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగ వ్యతిరేకంగా, సెక్యులర్ స్ఫూర్తికి వ్యతిరేకంగా 1995 వక్ఫ్ చట్టం ట్రిబ్యునల్ ను తీసుకొచ్చింది.

సుప్రీంకోర్టు కంటే మించి వక్ఫ్ బోర్డుకు ఎక్కువ అధికారాలు ఇచ్చారు. 1995 వక్ఫ్ చట్టంను అడ్డుపెట్టుకుని చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో ఈరోజుకు కూడా కొంతమంది ఔరంగజేబు మాదిరిగా దాడి చేసి భూములు ఆక్రమిస్తున్నరు. చేవెళ్ల పార్లమెంటు సెగ్మెంట్ లో ఔరంగజేబు విధానాలు ఇంకా పీడిస్తున్నాయి. గుట్టల బేగంపేటలో 90 ఎకరాలు వక్ఫ్ బోర్డు చట్టాన్ని అడ్డుపెట్టుకుని ఆక్రమించుకున్నరు.

300 ఏండ్ల క్రితం ఔరంగజేబు నోటిమాటలతో భూములు ఇచ్చి ఉండొచ్చు. కానీ నేడు కుప్పలు కుప్పలుగా డాక్యుమెంట్లతో ఆ భూములు మావి అంటున్నరు. సుప్రీంకోర్టు తీర్పునకు వ్యతిరేకంగా ప్లాట్లను ఆక్రమించుకున్నరు.

ముస్లిం దేశాల్లో కూడా ఈ యాక్డు ప్రభుత్వం పరిధిలోకి వస్తుంది.. కానీ మతం పరిధిలోకి రాదు. కానీ మన దేశంలో ఒక సమాజానికి మాత్రమే వర్తించేలా వ్యవహరిస్తున్నరు. భారతదేశంలో వక్ఫ్ బోర్డు అమలు విధానం చూస్తే నవ్వాలో.. ఏడ్వాలో.. బాధపడాలో కూడా తెలియని పరిస్థితి. ఈ యాక్డులో ముస్లిం మహిళలకు కూడా హక్కు కల్పించిన్రు.

కలెక్టర్, రెవెన్యూ సర్వే డిపార్ట్ మెంటుతో సంబంధం లేకుండా కొందరు ముస్లిం యాజమాన్యాలు సర్వే చేసుకోవడం చట్ట వ్యతిరేకం. కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే.. మత రాజకీయాలతో, ఓటు బ్యాంకు రాజకీయాలతో దేశాన్ని కూడా అమ్ముకుంటరు.

రాజీవ్ గాంధీ చారిటబుల్ ట్రస్టు బోర్డులో ఒక్కరు కూడా బీసీలు, దళితులు లేరు. కానీ, కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాల కోసం.. నేడు బీసీ, ఎస్సీ, ఎస్టీల పట్ల ఎక్కడలేని ప్రేమ చూపెడుతోంది. రానున్న శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు పార్లమెంటులో పాస్ అవుతుంది. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ముస్లిం సమాజానికి వ్యతిరేకం కాదు.

LEAVE A RESPONSE