-
వైసిపి పోలీస్ అధికారులపై చర్యలు తీసుకోకుండా పోలీస్ స్టేషన్లో క్రింది సిబ్బందిని బలిపశువులు చేస్తారా….
-
వైద్య పరీక్షలు కూడా నిర్వహించకుండా కోర్టులో ప్రవేశపెడతారా…
-
రాజ మర్యాదల విషయంలో లక్షల రూపాయలు చేతులు మారాయి…
-
పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు పై అజమాయిషి ఎవరిది…
అమరావతి: కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు గడుస్తున్న కూడా వైసీపీ పోలీస్ శాఖలో కిమ్చిత్ మార్పు కూడా కనపడిన దాఖలాలు లేవని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ వాపోయారు, ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీధర్ శర్మ మాట్లాడుతూ…
నారా చంద్రబాబు నాయుడు భువనేశ్వరి, లోకేష్ పుట్టుక గురించి, పవన్ కళ్యాణ్ గురించి గత ప్రభుత్వంలో తీవ్రంగా బూతులు తిడుతూ,బెదిరిస్తూ మాట్లాడిన రౌడీ షీటర్, వైసిపి నేత బోరుగడ్డ అనిల్ కు పోలీస్ రాచ మర్యాదల అంశంలో వాటిని వెలుగులోకి తీసుకువచ్చిన సీసీటీవీ ఫుటేజ్ విషయంలో ప్రైవేట్ టెక్నీషియన్ బ్రాహ్మణ యువకుడు భ్రుగుబండ శేషును వారం క్రితం అక్రమంగా అరెస్టు చేసి సి సి ఎస్ పోలీస్ స్టేషన్లో నాలుగు రోజులపాటు చిత్రహింసలకు గురిచేసిన నేపథ్యంలో బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడితే అప్పటికప్పుడు పోలీసులు తప్పుడు కేసులు బనాయించి రిమాండ్ కి పంపడం జరిగింది. ఆ యువకుడికి కనీసం వైద్య పరీక్షలు కూడా చేయించకుండా కోర్టులో ప్రవేశపెట్టారని, పోలీస్ మీద కోర్టులో గనుక చెబితే ఎన్కౌంటర్ చేస్తామని చెప్పి బెదిరించారని, సిసి ఫుటేజ్ ప్రమేయంలో ఉన్న పోలీస్ సిబ్బందిపై ఇంతవరకు కేసు నమోదు చేయలేదని,కానీ ఇద్దరు మీడియా జర్నలిస్టులను పై కేసు నమోదు చేసి వారికి మొక్కుబడిగా 41 నోటీసు ఇచ్చి వదిలి వేశారు. అరెస్టుల అంశంలో కూడా వివక్ష చూపించారు.
రాజ మర్యాదలు అంశంలో తప్పు చేయించిన ఉన్నతస్థాయి అధికారులైన గుంటూరు జిల్లా ఎస్పీ, గుంటూరు వెస్ట్ డిఎస్పి తదితర అధికారులపై ఎందుకు ఇంతవరకు డిజిపి కార్యాలయం చర్యలు తీసుకోలేదని శ్రీధర్ ప్రశ్నించారు. రాచ మర్యాదలు సంఘటన జరిగిన స్థానిక అరండల్ పేట స్టేషన్లో పనిచేసే నలుగురు క్రింది స్థాయి సిబ్బందిపై, సీఐని వీఆర్కి పంపి చర్యలు తీసుకొని చేతులు దులిపేసుకుంటారా అని శ్రీధర్ ప్రశ్నించారు.
స్టేషన్లో కింద స్థాయి సిబ్బంది పై స్థాయి అధికారులు చెప్పకుండానే రౌడీషీటర్ కు రాజ మర్యాదలు చేస్తారా, రాష్ట్రవ్యాప్తంగా రాచ మర్యాదల సంఘటన, రిమాండ్ ఖైదీకి రెస్టారెంట్లో బిర్యానీ, స్టేషన్లో అర్ధరాత్రి పూట మూలాకత్ లు వంటి అంశాలు సంచలనమై కూటమి ప్రభుత్వం పరువు, పోలీస్ శాఖ పరువు పోయిన కూడా ఇంకా ఈ వైసిపి పోలీస్ వ్యవస్థ ఇలానే ఎందుకు పని చేస్తుందని శ్రీధర్ ప్రశ్నించారు. వైసిపి నేతల కనుసనల్లో గుంటూరు జిల్లా ఎస్పీ, డి.ఎస్.పి పని చేస్తున్నారని, వైసిపి నాయకులు ఆదేశాల మేరకే స్టేషన్లో రాజు మర్యాదలు రెస్టారెంట్ కి తీసుకువెళ్లి మరియు బిర్యానీలు సంఘటనలు జరిగాయని, ఈ రాజమర్యాదల కోసం రౌడీ షీటర్ దగ్గర నుంచి పక్షులది రూపాయలు అధికారుల చేతులు మారాయని అన్నారు.
పోలీస్ స్టేషన్లోని సీసీ కెమెరాల అజమాయషి ఎవరి చేతిలో ఉంటుంది , అసలు పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు ఎందుకు జరిగింది, సీసీ కెమెరాలు ఆధారంగా జరిగిన తప్పులకు ఎవరు బాధ్యత వహిస్తారు అని ప్రశ్నించారు. ఇలాంటి అంశాలు ఎక్కడ బయటబడుతాయో అని తమ తప్పు కప్పిపుచ్చుకునేందుకు కోసం పోలీసు వైఫల్యాన్ని వెలుగులోకి తెచ్చిన వారి మీద అక్రమ కేసులు నమోదు చేసి ప్రతీకార దాడులు చేస్తారా, ఇదే నా ఫ్రెండ్లీ పోలీస్ అంటే అని శ్రీధర్ డిజిపి కార్యాలయాన్ని ప్రశ్నించారు. ఈ జరిగిన సంఘటన పైన కూటమి ప్రభుత్వం తక్షణమే జ్యుడీషియల్ కమిటీ వేసి విచారణ చేస్తే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని, లేనిపక్షంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన సరే వైసిపి పోలీసు మార్క్ పాలన, అరాచకం ఈ రాష్ట్రంలో ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని, దానివల్ల ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేక భావనలు వచ్చే అవకాశం ఉందని శ్రీధర్ ఆందోళన వ్యక్తం చేశారు.
కూటమి ప్రభుత్వం వల్ల ఒక బ్రాహ్మణ యువకుడికి అన్యాయం జరిగిందని బ్రాహ్మణ సమాజంలో ఇప్పటికే చర్చ జరుగుతుందని, దాన్ని అరికట్టాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వ నేతలపై ఉన్నదని, అందువల్ల ఈ సంచలన సంఘటన విషయంలో తప్పు చేసిన ఏ పోలీసు అధికారిని వదిలిపెట్టవద్దని, ఒక ఉన్నతాధికారితో జ్యుడీషియల్ కమిటీ వేసి ప్రభుత్వ పరంగా తగిన చర్యలు తీసుకోవాల్సిందేనని శ్రీధర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.