Suryaa.co.in

Telangana

తెలంగాణలోనూ టీడీపీ జెండా ఎగరేస్తాం

– తెలుగుమహిళ తెలంగాణ అధ్యక్షురాలు షకీలారెడ్డి
– బాబును అభినందించిన తెలంగాణ తెలుగు మహిళ
-మాజీలంతా తిరిగి పార్టీలోకి రావాలని పిలుపు

విజయవాడ: సైకో పాలనకు తెరదించిన ఏపీ ప్రజల తిరుగుబాటు నియంతలకు ఒక హెచ్చరిక సందేశమని, తెలంగాణ తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి వ్యాఖ్యానించారు. సీఎంగా పదవీబాధ్యతలు స్వీకరించిన టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును షకీలారెడ్డి కలసి, అభినందనలు తెలిపారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు సైకో జగన్‌పై చేసిన తిరుగుబాటును దేశమంతా గమనించిందన్నారు. ప్రజలను ఖాతరు చేయకుండా, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేయాలనే నియంతలకు ఇలాంటి గుణపాఠమే ఎదురవుతుందని స్పష్టం చేశారు. చంద్రబాబును 56 రోజులు జైల్లో ఉంచినప్పుడు తెలుగు రాష్ట్ర ప్రజల మనసు గాయపడిందని, కోట్లాదిమంది తెలుగువారి ఉసురే జగన్‌కు శాపాలుగా పరిణమించాయన్నారు. ఆరోజే జగన్ పతనం ప్రారంభమైందన్నారు. చంద్రబాబు సారథ్యంలో ఇక ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు.

ఇదే స్పూర్తితో తెలంగాణలో కూడా టీడీపీ పురోగతి సాధిస్తుందన్నారు. తెలంగాణ ఇన్చార్జి కంభంపాటి రామ్మోహన్‌రావు, మాజీ అధ్యక్షుడు బక్కని నర్శింహులు, పొలిట్‌బ్యూరో సభ్యుడు అరవిందకుమార్ గౌడ్, నందమూరి సుహాసిని, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సాయిబాబా నేతృత్వంలో తెలంగాణలో టీడీపీకి మంచిరోజులు రానున్నాయని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ నుంచి వెళ్లిపోయిన వారంతా తిరిగి మాతృసంస్థకు తిరిగిరావాలని షకీలారెడ్డి పిలుపునిచ్చారు.

LEAVE A RESPONSE