-
ఇప్పటికే మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళా
-
7వ డివిజన్ పర్యటనలో ఎమ్మెల్యే గద్దె రామమోహన్
పేద, మధ్యతరగతి వారు చదువుకునే పాఠశాలలను మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి హయాంలో మూసి వేసి విద్యారంగాన్ని సర్వనాశనం చేశారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ అన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలోని సీఎస్ఐ స్కూల్, మాంటిస్సోరి, కృష్ణలంకలోని పాఠశాలను పున:ప్రారంభించాని మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్ళానని, ఆయన కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఫైల్ సిద్ధం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ చెప్పారు. త్వరలోనే ఆయా పాఠశాలలను పున ప్రారంభిస్తామని చెప్పారు.
తూర్పు నియోజకవర్గ పరిధిలోని 7వ డివిజన్ బందుల దొడ్డి సెంటర్ పరిసర ప్రాంతాల్లో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్ గురువారం ఉదయం పర్యటించారు. స్థానికంగా ఉన్న డ్రైనేజీ సమస్య, వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మూసివేయబడిని సీఎస్ఐ ఇంగ్లీషు మీడియం స్కూల్ ను ఎమ్మెల్యే గద్దె రామమోహన్ గద్దె రామమోహన్ స్వయంగా పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెల్సుకున్నారు. స్థానిక టీడీపీ నాయకులతో పాటుగా, బీజేపీ, జనసేన నాయకులు ఎమ్మెల్యే గద్దె రామమోహన్ వెంట ఉన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్ మాట్లాడుతూ.. 1931వ సంవత్సరంలో పేద వారి విద్య కోసం సీఎస్ఐ అనే మిషనరీ ప్రభుత్వం కంటే ముందుగానే విద్యా సంస్థలను స్థాపించారని, అంతటి ప్రాధాన్యత కలిగిన సీఎస్ఐ ఇంగ్లీషు మీడియం స్కూల్ ను వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మూసివేసివేయడం సిగ్గుచేటన్నారు. లక్షలాది మహిళలు చదువుకునే లబ్బీపేటలోని మాంటిస్సోరీ మహిళా కళాశాల, కృష్ణలంక రాణిగారితోటలో పేదలకు ఉచితంగా విద్యాబోధన చేసే మరో పాఠశాలను కూడా ఈ విధంగానే వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మూసివేశారని చెప్పారు.
ఈవిధంగా అనేక పాఠశాలలను మూసి వేశారన్నారు. ఈ పాఠశాలలు, కళాశాలల్లో ఎక్కువుగా పేద, మధ్య తరగతి వారే చదువుకుంటారని వాటిని మూసివేసిన జగన్ ప్రభుత్వం పేద విద్యార్థులకు విద్యకు దూరం చేసిందని చెప్పారు. ఆయా విద్యాసంస్థలను మళ్ళీ ప్రారంభించాల్సిందిగా స్థానికులు తన దృష్టికి తెచ్చారని చెప్పారు. ఇప్పటికే విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్ళానని, ఆయన కూడా వెంటనే సానుకూలంగా స్పందించారని చెప్పారు. త్వరలోనే ఈ విద్యాసంస్థలు అన్ని పున:ప్రారంభం అవుతాయని ఎమ్మెల్యే గద్దె రామమోహన్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పటమట సతీష్చంద్ర, దోమకొండ రవి, పెనుగొండ శ్రీనివాస్, దోమకొండ అశోక్, నాగుమోతు రాజా, దోమకొండ జ్యోతి రత్నాకర్, పరసా లక్ష్మణ్, పడాల గంగాధర్, పెరవళి శివ, కర్రి రాజేష్, జోగవరపు బాలు తదితరులు పాల్గొన్నారు.