Suryaa.co.in

National

మినీ అంగన్ వాడి టీచర్ల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తాం

– ప్రజావాణి ఇంచార్జ్ చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య హామీ
– ప్రజా భవన్ కు భారీగా తరలి వచ్చిన మినీ అంగన్ వాడి టీచర్స్

రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న నాలుగు వేల మంది మినీ అంగన్ వాడి టీచర్ల సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని ప్రజావాణి ఇంచార్జ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి దివ్య దేవరాజన్ హామీ ఇచ్చారు.

మంగళవారం మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్ కు రాష్ట్రంలోని మినీ అంగన్ వాడి టీచర్స్ భారీగా తరలి వచ్చారు. ఈ సందర్బంగా వారు తమ సమస్యల పరిష్కారం కోసం వినతి పత్రాన్ని చిన్నారెడ్డి, దివ్యకు అందజేశారు.

మినీ అంగన్ వాడి టీచర్స్ కు హెల్పర్స్ ను నియమించాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, వేతనాల పెంపు హామీలను నిలబెట్టుకోవాలని వంటి పలు అంశాలను పరిష్కరించాలని మినీ అంగన్ వాడి టీచర్స్ వినతి పత్రంలో కోరారు. ఈ హామీలపై చిన్నారెడ్డి, దివ్య సానుకూలంగా స్పందించారు.

LEAVE A RESPONSE