Suryaa.co.in

Telangana

కేసీఆర్‎ను బరాబర్ జైలుకు పంపిస్తాం

ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్
సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ కౌంటర్ ఇచ్చారు. టీఆర్ఎస్ అధినేతను బరాబర్ జైలుకు పంపిస్తామని, ఎప్పటికైనా కేసీఆర్‎ ఖచ్చితంగా జైలుకు వెళ్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ చేసిన అవినీతే ఆయన్ను జైలుకు పంపిస్తుందన్నారు. అవీనితిపై ఆధారాలను ఎవరికి ఇవ్వాలో వారికే ఇస్తామన్నారు. కేసీఆర్‎కు మతిమరుపు ఎక్కువైందని, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌస్‎లోనే విశ్రాంతి తీసుకోవాలన్నారు.
వరి ధాన్యాన్ని కేంద్రం ఎప్పుడు కొనుగోలు చేయమని చెప్పలేదని స్పష్టం చేశారు. మిల్లులను మాత్రమే ఆధునీకరించుకోమని లేఖలో కేంద్రం రాసిందన్నారు. హుజురాబాద్ ఓటమిని సీఎం జీర్ణించుకోలేకపోతున్నారని, బీజేపీ గెలుపు నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి కేసీఆర్ తంటాలు పడుతున్నారని అరవింద్ చెప్పుకొచ్చారు. జామపండు సీతాఫలానికి తేడా తెలియని వేముల ప్రశాంత్ రెడ్డిని ప్రక్కన కూర్చోబెట్టుకుని కేసీఆర్ చదువు గురించి మాట్లాడటం హాస్యాస్పదం అని ధర్మపురి అరివింద్ ఎద్దేవా చేశారు.

LEAVE A RESPONSE