Suryaa.co.in

Telangana

రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం

-మంత్రి జూపల్లి కృష్ణారావు

రైతుల సంక్షేమమే కాంగ్రెస్‌ ప్రభుత్వ ధ్యేయంగా ముందుకుపోతుందని… రైతుల సంక్షేమం విషయంలో ఎలాంటి ఆందోళన చెందవద్దని, అన్ని విధాలుగా అండగా ఉంటామని మంత్రి జూపల్లి కృష్ణారావు భరోసా ఇచ్చారు. నిజామాబాద్‌ జిల్లాలోని అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను క్షేత్రస్థాయిలో మంత్రి గురువారం స్వయంగా పర్యటించి పరిశీలించారు. రైతులకు ఎకరానికి రూ.10 వేల పరిహారం ఇస్తాం అన్నారు. ముఖ్యమంత్రి ప్రతి నిర్ణయం పేదల కోసమేనన్నారు.

ఈ మేరకు గురువారం నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గంలోని సిరికొండ మండలం కొండూరు, పెద్ద వాల్గోట్‌ గ్రామాల్లో అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను, కల్లంలో తడిసిన ధాన్యాన్ని ఆయన నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యే భూపతిరెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకుని రైతుల్లో ధైర్యం నింపారు. ప్రకృతి ప్రకోపంతో తల్లడిల్లుతున్న రైతులకు భరోసా ఇవ్వడం కోసం పంట నష్టపోయిన ప్రాంతాలకు వచ్చానని మంత్రి అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం నిరంతరం రైతుల పక్షానే నిలబడుతుందన్నారు. ఉచిత కరెంటు, రైతు భరోసా, పంటల బీమా పథకం, రైతు నేస్తాం లాంటి పథకాలతో రైతుల్లో భరోసా నింపుతున్నారని తెలిపారు. ఇప్పటి వరకు రూ. 4,295 కోట్లలను రైతుభరోసా ( రైతుబంధు) పథకం క్రింద రైతు ఖాతాల్లో డబ్బులు జమ చేశామని, 4 ఎకరాలకు పైన ఉన్న రైతులకు వారం రోజుల్లో నగదు బదిలీ చేస్తామని వెల్లడించారు. పంటల బీమా పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు.

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని, రైతులకు వచ్చే సబ్సిడీలు, పంటల బీమా లాంటి అనేక పథకాలకు చరమగీతం పాడిరదని వెల్లడిరచారు. పంటల బీమా పథకాన్ని తమ ప్రభుత్వం పునరుద్ధరించిందని పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలను అమలు చేశామని వెల్లడించారు.

LEAVE A RESPONSE