Suryaa.co.in

Telangana

వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలుస్తాం

-అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టివి ఛానల్
-బిఆర్ఎస్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టివి యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్
-మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొంటాం
-శాసనసభ్యులు లేని చోట జడ్పీ ఛైర్మన్లు, ఎంపీలు, జిల్లా ఇంచార్జిలు
-ఏపీ తలసరి ఆదాయం మనకన్నా లక్ష రూపాయలు తక్కువ
-తెలివి ఉంటే బండమీద నూకలు పుట్టించుకోవచ్చు
-క్యాడర్ లో అసంతృప్త్తిని తగ్గించే చర్యలు చేపట్టండి
-బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుక లో సిఎం కేసీఆర్

రాజకీయ పంథాలో తక్కువ నష్టాలతోని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం.పార్లమెంటరీ పంథాలో ఏదైనా సాధించవచ్చని స్వరాష్ట్ర సాధనతో దేశానికి తెలియజేయగలిగినం.అదే పంథాలో అబ్ కి బార్ కిసాన్ సర్కార్ నినాదంతో దేశాన్ని ప్రగతి పథంలో నిలిపేందుకు ముందుకు సాగుతున్నాం. అకాలవర్షాలు రాకముందే పంట కోతలు పూర్తయ్యేలా వ్యవసాయశాఖ రైతులను చైతన్యం చేయాలి. మక్కలు, జొన్నలు అన్ని పంటలు కూడా గతంలో మాదిరి కొంటాం. మార్క్ ఫెడ్ కు ఈ మేరకు ఆదేశాలిస్తం. వ్యవసాయాన్ని నిలబెట్టి, రైతుల సంక్షేమమే పరమావధిగా రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ అమలు చేస్తున్నది. దేశ జీఎస్డీపిలో వ్యవసాయరంగం వాటా 23 శాతం.

కొన్నిగ్రామాల్లో ప్రభుత్వ భూములు నిరుపయోగంగా ఉన్నాయి. వాటి సర్వే నెంబర్లేసి నా ఆఫిసులో ఇవ్వండి. ఇండ్లు కట్టుకోవటానికి యోగ్యంగా వుంటే వాటిని తక్షణం పంచేద్దాం. మన శాసనసభ్యులు లేని చోట జడ్పీ ఛైర్మన్లు, ఎంపీలు, జిల్లా ఇంచార్జిలుగా ఉపయోగించుకోవాలి. ఈ 3,4 నెలల్లో ప్రక్రియ పూర్తి చేయాలి.మన మంత్రులు పారదర్శకంగా పనిచేస్తుండటంతో రాష్ట్రానికి పెట్టుబడులు తరలివస్తున్నయి. ఏపీ తలసరి ఆదాయం రూ. 2,19,518. ఇది మనకన్నా లక్ష రూపాయలు తక్కువ. ఇంతకన్నా తక్కువ రాష్ట్రాలు 16, 17 వున్నాయి. తెలివి ఉంటే బండమీద నూకలు పుట్టించుకోవచ్చు.

కొత్త సెక్రటేరియట్ ప్రారంభం సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు గం. 12.45 కల్లా అక్కడికి చేరుకొండి. గం. 1.58 నుంచి గం. 2.04 వరకు మంత్రులు వారి వారి చాంబర్స్ కు పోవాలి. సెక్రటేరియట్ గ్రౌండ్ ఫ్లోర్ లోబ్రీఫ్ మీటింగ్, లంచ్, తర్వాత డిస్పోస్. మెయిన్ గేట్ గుండా సీఎం, మంత్రులు, ఎంపి, ఎమ్మెల్యేలకు ఉద్దేశించింది. 3 గేట్లు, నార్త్ ఇస్ట్ గేట్ అధికారుల రాకపోకలకు ఉద్దేశించింది. సౌత్ ఇస్ట్ జనరల్ విసిటర్స్ కు ఉద్దేశించింది. మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఎక్కువ. కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించాక అనేక రాష్ట్రాల మోడల్స్ తెప్పిచ్చి మనం ఎలా ముందుకుపోవాలని మేధోమదనం చేసాను.తలసరి ఆదాయంలో మహారాష్ట్ర, తమిళనాడును దాటవేసి ముందుకు పోతున్నాం. తలసరి విద్యుత్ వినియోగంలో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. మహారాష్ట్ర ప్రభుత్వానికి విజన్ లేదు.

మనం అమలు చేస్తున్న పథకాలు అమలు చేస్తే దివాలా తీస్తామని మహారాష్ట్ర ప్రభుత్వం అంటున్నది. కానీ తెలంగాణ ఎందుకు దివాలా తీస్తలేదు ? 2021-2022 కు ముందు జీఎస్టీ ఆదాయం 34 వేల కోట్లు వుంటే, అంచనా 44 వేల కోట్లు పెట్టుకున్నం.మొదటి అసెంబ్లీ ఎన్నికల్లో 63, రెండో అసెంబ్లీ ఎన్నికల్లో 88 సీట్లు గెలిచాం. వచ్చే ఎన్నికల్లో 100 కు పైగా గెలుస్తాం. నియోజకవర్గం వారీగా ప్రభుత్వం నుంచి కూడా ఇద్దరు నాయకులు బాధ్యతలు తీసుకోవాలి. పల్లె నిద్ర వంటి కార్యక్రమాలతో జనంతో మమేకం కావాలి.కరెంటు, రోడ్లు, ధాన్యం కొనుగోళ్లు, వ్యవసాయం, పశుసంపద, మత్స్య సంపద ఇలా ప్రతీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశమే ఆశ్చర్యపోయే ప్రగతిని నమోదు చేసింద. తెలంగాణ రాష్ట్ర ప్రగతిని చూసేందుకు మహారాష్ట్ర వాళ్లు సొంత బండ్లేసుకుని వచ్చి చూసిపోతున్నారు.

క్యాడర్ లో అసంతృప్త్తిని తగ్గించే చర్యలు చేపట్టండి. ప్రభుత్వ పథకాలను ప్రచారం చేయడం, ప్రజలతో కమ్యూనికేషన్స్ పెంచుకోవడం, నిత్యం ప్రజల్లో ఉండేలా కార్యాచరణను చేపట్టాలి. మన ప్రభుత్వం అధికారంలోకి రావడమనేది పెద్ద టాస్క్ కాదు. మునపటి కన్నా ఎక్కువ సీట్లు రావాలి అనేది ప్రాధాన్యతాంశం. ఎలక్షన్ షుడ్ బి నాట్ బై చాన్స్… బట్ బై చాయిస్. దూపయినప్పుడు బావి తవ్వుతం అనే రాజకీయం నేడు కాలానికి సరిపోదు. తప్పక విజయం సాధిస్తాం.బిఆర్ఎస్ ను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవడానికి టివి యాడ్స్, ఫిల్మ్ ప్రొడక్షన్ కూడా మన పార్టీ నుండి భవిష్యత్తులో చేపట్టవచ్చు. అవసరమైతే పార్టీ ఆధ్వర్యంలో టివి ఛానల్ ను కూడా నడపవచ్చు.

LEAVE A RESPONSE