– తెలుగుదేశం పార్టీ తెలంగాణ “తెలుగునాడు విద్యార్థి సమాఖ్య” (TNSF) ఆధ్వర్యంలో సంక్షేమ భవన్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపిన టీఎన్ఎస్ఎఫ్ నాయకులు
రాష్ట్రంలో ప్రభుత్వ వసతి గృహాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, పెరిగిన ధరలకు అనుకూలంగా మెస్ ఛార్జీలు పెంచాలని, పక్కా భవనాలు నిర్మించాలి, పెండింగ్ లో ఉన్న మెస్ & కాస్మొటిక్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఖాళీగా ఉన్న వార్డెన్,వాచ్ మెన్, కామాటి, మొదలగు పోస్టుల భర్తీ. తాగునీరు, దుప్పట్లు, నాణ్యమైన పౌష్ఠిక ఆహారం, అందించాలి అని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఉన్న సంక్షేమ హాస్టళ్ల ను,ఎమ్మెల్యే, ఎంపీలు తనిఖీ చేసి అక్కడి విద్యార్థుల సమస్యలను అడిగి తెలుసుకుని వారి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు, ఎమ్మెల్యేలు ఎంపీలు వారి నియోజకవర్గాల్లో ఉన్న సంక్షేమ హాస్టళ్లను తనిఖీ చేసి, సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ టిఎన్ఎస్ఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాము. లేని పక్షంలో టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడుతామని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరించారు.