-తెలంగాణ సమగ్ర సంక్షేమం, అభివృద్ధి సీఎం కేసీఆర్ లక్ష్యం
-సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్
-60 వేల కోట్లతో సంక్షేమ పథకాలు అమలు
-వినూత్న, విశేష పథకాలతో దేశంలో ఎక్కడా లేనంత సంక్షేమం
-కాంగ్రెస్, బీజేపీల నేతలవి తుపాకీ వెంకట్రాముడి కోతలు
-తొర్రూర్ లో 45 మంది జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూం ఇండ్ల పంపిణీ
-మనమంతా సీఎం కేసీఆర్ కి రుణపడి ఉంటాం
-పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నాను
-పాలకుర్తి నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకుంటాను
-తెలంగాణ ఆవిర్భావ వేడుకలలో భాగంగా సంక్షేమ సంబురాలలో ప్రజలకు ఆస్తుల పంపిణీ చేసిన అనంతరం నియోజకవర్గంలోని రాయపర్తి తొర్రూరు పాలకుర్తి లలో వేరువేరుగా ఏర్పాటు చేసిన ఉత్సవాలలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
రాయపర్తి, తొర్రూరు, పాలకుర్తి (పాలకుర్తి నియోజకవర్గం), జూన్ 9: ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి ముఖంలో సంతోషం చూడాలన్న సంకల్పంతోనే సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పలు అభివృద్ధి పథకాలతో పాటు సంక్షేమ పథకాలను కూడా అమలు చేస్తూ ప్రజల సర్వతో ముఖాభివృద్దికి పాటుపడుతున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
సబండ వర్గాలకు సరిపోయే విధంగా వారి అభివృద్ధిలో భాగమవుతూ అనేక పథకాలు రాష్ట్రంలో అమలవుతున్నాయని వాటి ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు పెరగడమే కాకుండా అభివృద్ధి కూడా జరుగుతున్నదని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ సంక్షేమ ఉత్సవాలు పాలకుర్తి నియోజకవర్గం లో ఘనంగా జరిగాయి.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ సందర్భంగా నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటి0చారు. తెలంగాణ సంక్షేమ రంగంలో సాధించిన ప్రగతిని ప్రజలకు వివరిస్తూ ప్రజలను చైతన్యం చేశారు. వరంగల్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం రాయపర్తి, తొర్రూరు, పాలకుర్తి కేంద్రాల్లో లో తెలంగాణ అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబురాలు జరిగాయి.
రాయపర్తి లో రాయపర్తి మండలం, తొర్రూరులో తొర్రూరు పెద్ద వంగర మండలాలకు, పాలకుర్తిలో పాలకుర్తి కొడకండ్ల, దేవరుప్పుల మండలాలకు చెందిన లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ చేశారు. ఆయాచొట్ల కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, గొర్రెల పంపిణీ, బీసీ కులాలకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం కు సంబంధించిన చెక్కులను మంత్రి లబ్ధిదారులకు అందజేశారు.అలాగే తొర్రూరు లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూం ఇండ్ల పట్టాలు అందచేశారు.ఈ కార్యక్రమాల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు, drdo లు, ఆయా శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం సీఎం కెసిఆర్ నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమాలను సమంగా అమలు చేస్తూ, రాష్ట్రాన్ని దేశానికి ఆదర్శంగా మార్చింది అన్నారు. మన రాష్ట్రం, నియోజకవర్గం లో అమలు అవుతున్నన్ని పథకాలు దేశంలో ఎక్కడా అమలు కావడం లేదన్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తూ, ఆయా పథకాలను ప్రజలకు వివరించారు.
ప్రతి ఇంట్లో సంక్షేమం… ప్రతి ముఖంలో సంతోషం చూడాలన్నదే సీఎం కెసిఆర్ గారి లక్ష్యం. తెలంగాణ రాష్ట్రావతరణ దశాబ్ది ఉత్సవాలు మన రాష్ట్ర ప్రగతికి గుర్తులు. తెలంగాణ రాష్ట్రం వచ్చాకే ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వస్తున్నాయి. సీఎం కెసిఆర్ గారికి అభివృద్ధి, సంక్షేమం రెండు రెండు కళ్ళు. ఒక బండికి రెండు ఎడ్ల లాగా, అభివృద్ధి, సంక్షేమాలను సీఎం గారు సమానంగా నడిపిస్తున్నారు. అని మంత్రి తెలిపారు.
రాష్ట్రం ఏర్పడి పదేళ్లలోనే మన పథకాలు, అభివృద్ధి వల్ల దేశానికి ఆదర్శంగా నిలిచాం. సీఎం కెసిఆర్ గారి ప్రగతి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజా జీవితాల్లో గుణాత్మక మార్పు వచ్చింది. నేడు తెలంగాణ అభివృద్ధి, సంక్షేమాల్లో ఒక మోడల్ గా దేశం లోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాజనీతిని కనబరుస్తూ పనిచేస్తే ఎలాంటి ఫలితాలు సాధించవచ్చో తెలిపేందుకు తెలంగాణ ప్రగతి ఒక కొలమానం అని.మంత్రి తెలిపారు.
నేడు తెలంగాణలో సబ్బండ వర్గాల జీవితాల్లో వెల్లివిరుస్తున్న సుఖసంతోషాలే అందుకు నిదర్శనం. మూడున్నర కోట్ల జనాభా ఉన్న రాష్ట్రంలో 44,12,882 మందికి ప్రతి నెల ఆసరా పెన్షన్లు అందిస్తున్నాం. ఆడపిల్ల పెండ్లి కోసం ఆర్థిక భారంతో కుంగిపోయే నిరుపేద కుటుంబాలను పెండ్లి ఖర్చుల అవస్థలనుంచి గట్టెక్కించడానికి రాష్ట్రంలోని ప్రతీ పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సాయం చేయాలని సీఎం కెసిఆర్ నిర్ణయించారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వర్గాలకు ‘కల్యాణలక్ష్మి’ పథకాన్ని, మైనారిటీలకు షాదీముబారక్ పథకాలన్నీ ప్రభుత్వం అమలు చేస్తున్నది. ఆడబిడ్డ పెండ్లి ఖర్చులకుగాను రూ.1,00,116 ఆర్థికసాయం అందిస్తున్నది. దివ్యాంగులకు కళ్యాణలక్ష్మి పథకం కింద రూ. 1,25,145 చెల్లిస్తున్నారు. 2014 నుండి 2023 మే మధ్య కాలంలో 12,71,839 నిరుపేద కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి పథకం కింద ఇప్పటి వరకు రూ 11,130 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. అని మంత్రి దయాకర్ రావు వివరించారు.
రైతుల పెట్టుబడి సమస్యను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం వినూత్నమైన, ఆదర్శవంతమైన నిర్ణయం తీసుకున్నది. రైతుకు పంట సమయంలో పెట్టుబడి తెచ్చుకొని అప్పుల పాలయ్యే క్షోభను తప్పించి ప్రభుత్వమే పంటసాయం ఇస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం 2018 నుంచి మే 2023 నాటికి 10 విడతల్లో 65,00,588 మంది రైతులకు 65,910.32 కోట్ల రూపాయలను పంట పెట్టుబడి సాయంగా అందజేసింది.
రైతు బీమా ప్రారంభమైనప్పటి నుండి 2023 మే వరకు రూ. 5,383.83 కోట్లను ప్రభుత్వం బీమా ప్రీమియంగా చెల్లించింది. ఇప్పటివరకు 99,297 మంది రైతులు మరణించగా వారి కుటుంబాలకు రూ.4,964.85 కోట్ల బీమా అందిందని మంత్రి పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు రైతులు దశాబ్దాల తరబడి కరెంటు కష్టాలు అనుభవించారు. రోజుకు కనీసం 3 లేదా 4 గంటల కరెంటు కూడా రాకపోయేది. దీంతో పంటలు ఎండిపోయి రైతులు విపరీతంగా నష్టపోయేవారు. ఎలాంటి షరతులు లేకుండా దేశంలోనే 24 గంటలపాటు వ్యవసాయానికి ఉచితంగా నాణ్యమైన కరెంటు ఇచ్చే ఏకైక రాష్ట్రం కేవలం తెలంగాణ మాత్రమే. పుట్టడం నుండి మరణం దాకా సీఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్నారు. అమ్మఒడి, కేసీఆర్ కిట్, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ల పంపిణీ, ఉచిత వైద్యం అందిస్తున్న ఘనత సీఎం కెసిఆర్ ప్రభుత్వానిది.
యాదవులకు బర్రెల పంపిణీ, గొర్రెల పంపిణీ, ముదిరాజ్ లకుచేప పిల్లల పంపిణీ చేపట్టి కుల వృత్తులను ప్రోత్సహిస్తున్నాము. అన్ని కులాల వారికి ఆత్మగౌరవ భవనాలు, ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు, సెలూన్లకు ఉచిత విద్యుత్ సరఫరా అందించి ప్రతి ఒక్కరు ఆర్థికంగా ఎదిగేలా చేస్తున్నాం. ఎన్నో ఏళ్ల కలగా మిగిలి పోయిన గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా చేసుకొని పల్లె ప్రగతి ద్వారా పల్లెలను కడిగిన ముత్యంలా చేస్తున్నామని మంత్రి తెలిపారు.
పేద విద్యార్థులకు గురుకులాలు, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలు, బ్రాహ్మణులకు ఉన్నత విద్యార్జనకై ఓవర్సీస్ స్కాలర్ షిప్ లు ఇచ్చి విద్యార్థుల భవితకు బంగారు బాట వేస్తున్నాం. మిషన్ కాకతీయ ద్వారా చెరువుల పూడికతీత తో భూ గర్భ జలాలు పెరిగాయి. ప్లోరోసిస్ లాంటి వ్యాధులు రాకుండా ఇంటింటికీ మిషన్ భగీరథ నీళ్ళు ఇస్తున్నాం. మహిళ సంఘాలకు వడ్డీలేని రుణాలు ఇచ్చి వారు ఆర్థికంగా ఎదగడానికి కృషి చేస్తున్నాం.
మహిళలు ఎదగడానికి కుట్టు మిషను శిక్షణ ఇప్పించి ఉచితంగా కుట్టు మిషన్లను అందిస్తున్న ఘనత మన ప్రభుత్వానిది. ప్రతిష్టాత్మక పథకాలతో ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పే లక్ష్యంగా ప్రభుత్వం ఎన్నో పథకాలతో విజయవంతంగా ముందుకు సాగుతున్నదని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు.
తెలంగాణ మోడల్ గా నిలిచిన తెలంగాణ ఆచరిస్తున్న పలు కార్యక్రమాలను, పథకాలను, దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నది. సీఎం కేసీఆర్ సారథ్యంలో స్వరాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం సాధించిన వ్యవసాయరంగ ప్రగతి నేడు దేశానికే దిక్సూచిగా నిలిచింది. తెలంగాణ వ్యవసాయరంగం వ్యవసాయాధారిత భారత దేశానికి వొక నమూనా మార్పును తెచ్చింది. సీఎం కేసీఆర్ రైతుల గుండెల్లో రైతుబాంధవుడిగా కొలువై వుండడం వెనక అరవయేండ్ల తన్లాట కు సమాధానం వున్నది.
నేడు తెలంగాణ రాష్ట్రంలో దళితులు, గిరిజనులు సంక్షేమ శిఖరాన నిలిచి ప్రగతి ఫలాలను అనుభవిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ సాకారంతో వెనుకబడిన తరగతులు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. గంగాజమునా తెహజీబ్ కు నిలయమైన తెలంగాణలో, మైనార్టీలు దేశంలో మరెక్కడాలేని విధంగా భరోసాతో ప్రగతి పథంలో దూసుకుపోతున్నారు. తెలంగాణ వస్తే ఏమొచ్చిందని అడిగినోళ్లకు.. నేడు తెలంగాణ రాష్ట్రం ఆవిష్కరిస్తున్న అద్భుత విజయాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయని మంత్రి అన్నారు.
జర్నలిస్టులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాల పంపిణీ
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబురాల సందర్భంగా తొర్రూరు పట్టణంలోని 45 మంది జర్నలిస్టులకు డబల్ బెడ్ రూమ్ ఇండ్ల పట్టాలను మంత్రి ఎర్రబెల్లి పంపిణీ చేశారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి గత ప్రభుత్వాలు ఎన్నడూ చేయని విధంగా సంక్షేమ నిధిని ఏర్పాటు చేసి వారికోసం ప్రభుత్వం పని చేస్తున్నదని తెలిపారు. కొంతమంది జర్నలిస్టులకు పట్టాలు ఇవ్వాల్సి ఉందని వాటిని కూడా త్వరలోనే అందిస్తామని మంత్రి తెలిపారు.
పేదలకు పలు సంక్షేమ పథకాల అందజేత
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో భాగంగా తెలంగాణ సంక్షేమ సంబురాల సందర్భంగా పాలకుర్తి నియోజకవర్గం లోని అన్ని మండలాలకు చెందిన లబ్ధిదారులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అందజేశారు.