Suryaa.co.in

Andhra Pradesh

ముఖ్యమంత్రి గారూ.. ఫించన్ల పంపిణీ సరే.. మిగతా హామీల మాటేమిటి?

– రాజ్యసభ మాజీ సభ్యులు, కాంగ్రెస్ నేత డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి

వేంపల్లి: ఎన్నికల మ్యానిఫెస్టోలో పేర్కొన్న హామీ మేరకు ప్రతి నెలా మొదటి తేదీన ఇంటివద్దనే లబ్దిదారులకు సామాజిక ఫించన్లు పంపిణీ చేయడం హర్షణీయం. మ్యానిఫెస్టోలో పేర్కొన్న మిగతా హామీల మాటేమిటి బీసీ,ఎస్సీ,ఎస్టీ,ముస్లిం మైనారిటీలకు 50 ఏళ్లకే ఫించన్ ఇస్తామని మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు.జూలై, ఆగస్టు,సెప్టెంబర్ 3 మాసాలు గడిచిపోయాయి…అమలు కాలేదు.

యువ గళం క్రింద నిరుద్యోగ యువతకు నెలకు 3వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.ఇప్పటివరకు అమలు కాలేదు. తల్లికి వందనం పథకం క్రింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి రూ15,000లు ఇస్తామన్నారు.ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ పథకం క్రింద ప్రతి రైతు కు ఏటా రు 20,000 లు ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకుంది.ఇంతవరకు 20 రూపాయల సాయం కూడా చేయలేదు.

19 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసు ఉన్న ప్రతి మహిళకు నెలకు రూ 1500 ఇస్తామన్నారు.ఇవ్వలేదు. ప్రతి ఇంటికీ ఏడాదికి ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు సరఫరా చేస్తామన్నారు.చేయలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు.అమలు కాలేదు. హామీ లను వీలైనంత త్వరగా అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

LEAVE A RESPONSE