Suryaa.co.in

Political News

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఎలాంటి చర్యలు ఉండవా?

డిజిపి స్థాయి పోలీసు ఉన్నతాధికారిపై కాట్ తీర్పు తర్వాత కూడా ఏ.బి.వెంకటేశ్వరరావుపై కక్షసాధింపు చర్యలు కొనసాగించడం అత్యంత గర్హనీయం. న్యాయ వ్యవస్థ పట్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి వైఖరి ఏంటో ఈ ఉదంతం ద్వారా బహిర్గతమౌతున్నది. అధికారంలో ఉన్న రాజకీయ నాయకత్వం, ఉన్నతాధికారుల మధ్య ఉన్న అపవిత్ర బంధానికి ఇది ప్రబల నిదర్శనం. ఈ అంశంపై ఈ రోజు ఉదయం టీవీ5 డిబేట్ లో నేను, డా. యన్.తులసిరెడ్డి, రఫీ, ముగ్గరం ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాం.

రెండవసారి సస్పెండ్ చేయడం సుప్రీం కోర్టు తీర్పును ఉల్లంఘించడమేనని క్యాట్ తీర్పులో పేర్కొంది కదా? మరి, ఆ తప్పు చేసిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిపై ఎలాంటి చర్యలు ఉండవా? పైపెచ్చు, ఆయనే క్యాట్ తీర్పును అమలు చేయకుండా ఆపి, కక్షసాధింపు లో భాగస్వామి అవుతారా? ప్రజాస్వామ్య వ్యవస్థలో, ఎన్నికల నియమావళి అమలులో ఉన్న సమయంలో, పోలింగ్ కూడా ముగిసిన తరువాత ఇంత దుర్మార్గమైన పాలన కొనసాగడం, సరిదిద్దే వ్యవస్థ లేకపోవడం సమాజానికి మేలు చేకూర్చదు.

– టి. లక్ష్మీనారాయణ
సామాజిక ఉద్యమకారుడు,
ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి అధ్యయన వేదిక

LEAVE A RESPONSE