– ఆయన ప్రసంగాలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు
– పేపర్ లీకేజీ కేసులో 11 లక్షల విద్యార్థులు,వారి కుటుంబ సభ్యులను క్షోభకు గురి చేశాడు
– ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై మండిపడ్డ ఎంపీ విజయసాయిరెడ్డి
రాష్ట్రంలో సమయం సందర్భం లేకుండా ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు
జిల్లాల యాత్రలు చేసి సాధించేదేమిటని వైఎస్సార్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి,రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలపై ఆయన స్పందించారు. ఈ యాత్రలలో చంద్రబాబు చేస్తున్న పొంతన లేని ప్రసంగాలు విని జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.మరీ విడ్డూరంగా ప్రభుత్వ వ్యతిరేక సందేశాలు పంపండి అని ప్రజలను వేడుకోవడం ఎమిటని ప్రశ్నించారు.
టిడిపి అధినేత చంద్రబాబు టెన్త్ పేపర్ లీకేజ్ కేసులో మాజీ మంత్రి నారాయణను వెనకేసుకు వచ్చి 11లక్షల మంది విద్యార్థులు, 30 లక్షల మంది కుటుంబ సభ్యులను క్షోభకు గురిచేశాడని మండిపడ్డారు. ఈ విషయంలో తన బినామీని కాపాడేందుకు చేసిన రాద్దాంతాన్నీ ప్రజలు అంతా చూశారని చెప్పారు. చంద్రబాబు గంజాయి స్మగ్లర్లపై దాడులు చేస్తే సహించడట! లీగలైజ్ చేయమంటావా ఏంటి అని అయన ప్రశ్నించారు.
డిజిటల్ హెల్త్ లో ఏపీ టాప్
ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ రూ.వేల కోట్లు వెచ్చించి వైద్య, ఆరోగ్య రంగాన్ని తీర్చిదిద్దుతున్న ఏపీ ప్రభుత్వాన్ని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకోవాలని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో డాక్టర్ ఆర్.ఎస్.శర్మ సూచించారని వెల్లడించారు. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కార్యక్రమాల అమలులో ఏపీ ప్రథమ స్థానంలో నిలవటాన్ని అభినందిస్తూ ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తు చేశారు.