Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మెల్యే కోటంరెడ్డికి నాగసాధువు మంత్రి‘వరం’

– సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలు

ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేదు.. ఇప్పట్లోనే కాదు.. మళ్లీ రెండేళ్ల వరకూ విస్తరణే లేదు. కాశీకి చెందిన ఓ నాగసాధువు మాత్రం, ‘సీఎం జగన్‌కు తెలియకుండానే’ .. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఏకంగా మంత్రివరం ఇచ్చేశారు. అదెలాగో సదరు నాగసాధువుకే ఎరుక! ఆ విషయం కోంటరెడ్డి అడగలేదు. అటు నాగసాధువూ చెప్పలేదు.ఇంతకూ అసలేం జరిగిందంటే…

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గణేష్ నిమజ్జన ఘాట్ వద్ద మీడియా సమావేశం నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కాశీ నుంచి వచ్చిన నాగ సాధువులు ప్రత్యక్షం కావడం కలకలం రేగింది. ప్రెస్ మీట్ సమయంలో నేరుగా వచ్చిన అఘోరాలు.. శ్రీధర్ రెడ్డి దగ్గరకు వచ్చి మీ పేరు ఏమిటి అని
అడిగారు… ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అని సమాధానం చెప్పగానే… మీకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని నాగ సాధువులు తెలియజేశారు.. అలాగే ఎమ్మెల్యేకు ఒక సోదరుడు ఉన్న విషయాన్ని తెలిపారు.

భవిష్యత్తులో మంత్రిగా స్థానం పొందుతారని వారు జోస్యం చెప్పారు. గణేష్ నిమజ్జన ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్న రూరల్ ఎమ్మెల్యే కృషిని వారు మెచ్చుకున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే తో పాటు పలువురు నేతలు, నాగ సాధువుల ఆశీర్వాదాన్ని తీసుకున్నారు. అనంతరం వారు అక్కడి నుంచి నరసింహకొండలో బస చేసేందుకు బయలుదేరి వెళ్లారు.

LEAVE A RESPONSE