– ఇప్పుడు మళ్లీ తాను కేసు ఉపసంహరించుకుంటానని రేవతి భర్త
(రమణ)
సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 39 ఏళ్ల మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలు అవ్వడంతో.. ఆమె భర్త థియేటర్ యాజమాన్యం, హీరో అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు.
పుష్ప -2 ప్రీమియర్ షో కారణంగా ఆర్‌టీసీ క్రాస్ రోడ్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే 39 ఏళ్ల మహిళ మరణించడం, ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్ర గాయాలు అవ్వడంతో ఆమె భర్త థియేటర్ యాజమాన్యం, హీరో అల్లు అర్జున్‌పై బీఎన్‌ఎస్ 105, 118 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
అల్లు అర్జున్ థియేటర్‌కు వచ్చిన సమయంలో , భద్రతాపరంగా జాగ్రత్తలు తీసుకోనందుకు థియేటర్ యాజమాన్యంపై కూడా వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు విషయంలో శుక్రవారం అల్లు అర్జున్ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి వైద్య పరీక్షల నిమిత్తతం బన్నీని ఉస్మానియా ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది.
ఇదిలా ఉండగా బాధిత కుటుంబం పెట్టిన కేసు కాపీ, ఎఫ్‌ఐఆర్ కాపీలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. రేవతి భర్త భాస్కర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కేస్ పెట్టారు. అందులో ఏముందంటే.. “పుష్ప -2 ప్రీమియర్ చూడటానికి భార్య బిడ్డలతో సంధ్య థియేటర్‌కు వెళ్లగా అదే సమయంలో హీరో అల్లు అర్జున్ థియేటర్ విజిట్‌కు వచ్చారు. అప్పటికే క్రౌడ్‌తో థియేటర్ అంతా నిండిపోయింది. ఎటువంటి ముందస్తు ప్రణాళిక లేకుండా సరైన వసతులు ఏర్పాటు చేయకుండా ఎక్కువమందితో ప్రేక్షకులను థియేటర్ లోపలికి అనుమతించి మాకు సీట్లు లేకుండా చేశారు. మమ్మల్ని కిందకు నెట్టివేసి నా భార్య మరణానికి, నా బిడ్డ శ్రీతేజ ఆస్పత్రిపాలు కావడానికి కారకులైన సంధ్య థియేటర్ యాజమాన్యం, సిబ్బంది, తోపులాటకు కారణమైన అల్లు అర్జున్, ఆయన వ్యక్తిగత సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని’’ భాస్కర్ కోరారు. అయితే బాధిత కుటుంబానికి అల్లు అర్జున్ రూ. 25 లక్షలు సాయం ప్రకటించారు.
విచిత్రంగా ఇప్పుడు అదే మృతురాలు రేవతి భర్త భాస్కర్.. తాను కేసు ఉప సంహరించుకుంటానని చెప్పడం విచిత్రం. అర్జున్‌ను అరెస్టు చేశారన్న వార్త చూశానని, ఆయనపై తాను పెట్టిన కేసు ఉపసంహరించుకుంటానని చెప్పారు.