Suryaa.co.in

Sports

చరిత్ర సృష్టించిన భారత చెస్ ప్లేయర్

భారత చెస్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ వరల్డ్ చెస్ ఛాంపియన్ గా అవతరించారు. వరల్డ్ చెస్ ఛాంపియన్ షిప్-2024లో భాగంగా మాజీ ఛాంపియన్ డింగ్ లిరెన్తో జరిగిన 14వ రౌండ్లో గుకేశ్ విజయం సాధించారు. దీంతో క్లాసికల్ చెస్ ప్రపంచ ఛాంపియన్గా అవతరించిన అత్యంత పిన్న వయస్కుడిగా (18 ఏళ్లు) రికార్డు నెలకొల్పారు. గేమ్ అనంతరం గుకేశ్ కన్నీళ్లు పెట్టుకున్నారు.

గుకేశకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు

ప్రపంచ చెస్ ఛాంఫియన్ గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్(18)ను ప్రధాని మోదీ అభినందించారు. ఆయన విజయం చరిత్రాత్మకం, ఆదర్శవంతమని కొనియాడారు. గుకేశ్ అసాధారణ ప్రతిభ, కృషి, సంకల్పానికి ఈ ఫలితమే నిదర్శనమని చెప్పారు. అటు గుకేశ్ దేశాన్ని గర్వపడేలా చేశారని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము మెచ్చుకున్నారు. కాగా ప్రపంచ చెస్ ఛాంపియన్ అయిన మొదటి భారతీయుడిగా విశ్వనాథన్ ఆనంద్ నిలవగా, రెండో వ్యక్తిగా గుకేశ్ నిలిచారు.

దేశానికే గర్వకారణమన్న సీఎం చంద్రబాబు..

గుకేశ్ తండ్రి రజనీకాంత్, తల్లి పద్మ..7 ఏళ్ల వయసు నుంచే చెస్‌పై ఆసక్తి పెంచుకున్న గుకేశ్. ఒక తెలుగు యువకుడు ఈ రికార్డ్ సాధించడం అందరికీ ఆదర్శం

LEAVE A RESPONSE