ప్రతి మనిషికి ఒక కర్ర కొనివ్వడానికి డబ్బులు ఉన్నాయి కానీ కంచె వేయడానికి డబ్బులు లేవా?
తిరుమల ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం కలిగిన ఒకే ఒక్క దేవాలయం… ఈ దేవాలయ ఆదాయం రోజుకు వందలు కాదు, వేలు కాదు, లక్షలు కాదు, కోట్ల రూపాయలు అన్న సంగతి ఎంత మందికి తెలుసు?
తిరుమల నడక దారిలో భక్తులపై వన్యప్రాణులు దాడులు చేస్తున్నాయి.. తాజాగా ఒక బాలుడుపై చిరుత పులి దాడి, మరో 10 ఏళ్ల బాలికను చిరుత పులి చంపిన వైనం మనందరికీ తెలుసు.
ఈ సమస్యను అధిగమించడానికి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చూపిన పరిష్కారం ఏమిటో తెలుసా భక్తులందరికీ తలా ఒక చేతి కర్ర ఇస్తాడంట.. అయ్యా టిటిడి చైర్మన్ గారు.. భక్తులపై దాడి చేస్తున్నవి కుక్కలనుకుంటున్నారా కర్రలతో కొట్టడానికి… దాడులు జరుగుతున్న ప్రాంతంలో జాలరి కంచే వేయడానికి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఉన్న సమస్యలు ఏమిటి…. డబ్బు సమస్యనా మరి రోజు వస్తున్న కోట్ల రూపాయలు ఏమవుతున్నాయి…?
అభయారణ్యం కాబట్టి అటవీ అధికారుల అనుమతి ఉండదని చెప్పి సాకులు చెప్పబోతున్నారా… మనసుంటే మార్గం ఉంటుంది అన్న చందంగా ఇప్పుడు ఏవైతే మెట్లు కట్టారో వాటిల్లోనే జాలరి కంచే వేయవచ్చు కదా… దీనికి ఎటువంటి అనుమతులు అవసరం లేదు కదా? తలా ఒక చేతి కర్ర ఇస్తామంటున్నారు… చేతి కర్రల వ్యాపారం చేయడానికా? కోట్ల రూపాయల చేతి కర్రలుకొని వాటిల్లో కమిషన్లు బొక్కేయడానికా?
హిందూ బంధువులారా.. గమనిస్తున్నారా ఈ సంఘటనలను… ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఆదాయం కలిగిన తిరుమలపై ఎప్పటినుండో అన్యమతస్తుల కన్ను ఉంది… తిరుమలను భ్రష్టు పట్టించడానికి వంద సంవత్సరాలుగా వీరు చేయని ప్రయత్నం లేదు… ప్రస్తుత ముఖ్యమంత్రి రూపంలో మంచి అవకాశం లభించింది… వీరి తండ్రి దివంగత నేత హయాంలో ఏడుకొండలను ఆక్రమించుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు… ప్రజల్లో తిరుగుబాటు వస్తుందన్న భయంతో వెనకడుగు వేశారు. ఇప్పుడు ఎలాంటి బెరుకు లేకుండా తిరుమలను సర్వనాశనం చేయడానికి పూనుకున్నారు.
వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ పదవి వడ్డెరలకు మాత్రమే ఇస్తారు, కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవి కాపులకు మాత్రమే ఇస్తారు ఇతరులకు ఇవ్వరు. హజ్ యాత్రకు వెళ్లాలంటే ముస్లింలకు మాత్రమే సబ్సిడీ ఇస్తారు… అదే హజ్ యాత్రకు మేము వెళతామని హిందువులు అంటే వారికి అర్హత లేదు పొమ్మంటారు. మసీదులకు, చర్చిలకు ఆయా మతాలకు చెందిన వారిని మాత్రమే పెద్దలుగా నియమిస్తారు…
మరి ఇదేం దౌర్భాగ్యం? ప్రపంచంలోనే అతి పెద్ద హిందూ దేవాలయమైన తిరుమల పాలకమండలి చైర్మన్లుగా క్రైస్తవులను నియమించడం సబబేనా…? అన్యమతస్తులు తాము వెంకటేశ్వరుడిని భగవంతుడిగా నమ్ముతాము అని రిజిస్టర్ లో సంతకం చేసిన తర్వాతనే, దర్శనానికి అనుమతిస్తారు. అలాంటి దివ్య క్షేత్రంలో కనీసం ముఖానికి తిరునామం కూడా ధరించని కరుణాకర్ రెడ్డిని, చైర్మన్ నియమించడం హిందుత్వంపై జరుగుతున్న కుట్ర కాదా?
వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి తిరుమలలో సౌకర్యాలు పూర్తిగా అడుగంటిపోయాయి… స్నానాల గదులను రిపేర్లు చేయించేవారు లేరు… దర్శనానికి వెళ్లిన భక్తులను గంటల తరబడి కంపార్ట్మెంట్లలో బంధిస్తున్నారు… గతంలో భక్తులకు పాలు, అల్పాహారాన్ని అందించేవారు… ఇప్పుడు అవన్నీ గత చరిత్రగా మార్చివేశారు..
ఆర్జిత సేవల ధరలు ఆకాశాన్ని అంటేలా పెంచేశారు… లడ్డును మరింత ప్రియం చేశారు… అద్దె గదుల ధరలు విపరీతంగా పెంచేశారు… ఇవన్నీ ఎందుకు చేశారంటారు…? తిరుమల ఏమీ నష్టాల్లో ఉన్న కంపెనీ కాదు కదా… కొత్తంగా ఆదాయం పెంచడానికి. కేవలం తిరుమల ప్రభావాన్ని తగ్గించడానికి క్రైస్తవ ముఖ్యమంత్రి, క్రైస్తవులైన వారి బంధువుల కుట్రగా ఇది కనిపించడం లేదా…?
వందల వేలకోట్ల ఆదాయం కలిగిన దేవాలయం తిరుమల దేవాలయం… నడక మార్గానికి కంచే వేయడానికి కేవలం కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెడితే చాలు, సమస్యను పరిష్కరించవచ్చు. కానీ భక్తులను భయభ్రాంతులకు గురి చేస్తూ నడక మార్గాన్ని మూసి వేయడానికి ప్రయత్నం చేస్తున్నారా…?
అపహాస్యమైన పరిష్కారాలను చూపిస్తూ తిరుమలకు వచ్చే భక్తులను అవహేళన చేస్తున్నారా… భక్తులారా ఒక్కసారి ఆలోచించండి. అన్యమతస్తుల దాడి నుండి మన ఆలయాలను పరిరక్షించుకోవాలంటే, ప్రతి హిందూ బంధువు నడుము కట్టి తీరాల్సిందే. ఉద్యమించి తీరాల్సిందే. ఈ చైతన్యాన్ని ఆ వెంకటేశ్వరుడి ఆజ్ఞగా భావించి ప్రతి హిందువు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి… ఓం నమో వెంకటేశాయ.
– మంజరి